'సామ్రాట్ ఆఫ్ సౌత్ ఇండియన్ బాక్సాఫీస్' | Hero Vijay Unveils His Wax Statue | Sakshi
Sakshi News home page

'సామ్రాట్ ఆఫ్ సౌత్ ఇండియన్ బాక్సాఫీస్'

Published Tue, Jun 13 2017 10:35 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

'సామ్రాట్ ఆఫ్ సౌత్ ఇండియన్ బాక్సాఫీస్'

'సామ్రాట్ ఆఫ్ సౌత్ ఇండియన్ బాక్సాఫీస్'

సౌత్ ఇండస్ట్రీ నుంచి మరో స్టార్ హీరో మైనపు విగ్రహం సిద్ధమయ్యింది. ఇప్పటికే బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించిన ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూను ఏర్పాటు చేయగా.., తాజాగా ఈ లిస్ట్ లోకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా చేరిపోయాడు. వరుస విజయాలతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న విజయ్ని ఓ మీడియా సంస్థ సత్కరించింది. ఈ కార్యక్రమంలో విజయ్ మైనపు విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని లోనవాలా సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.

ఆదివారం చెన్నైలో జరిగిన బిహైన్డ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ ఈవెంట్లో పాల్గొన్న విజయ్ని 'సామ్రాట్ ఆఫ్ సౌత్ ఇండియన్ బాక్సాఫీస్' బిరుదుతో సత్కరించారు. ఆన్లైన్లో నిర్వహించిన ఓటింగ్లో 66 శాతానికి పైగా ఓట్లు సాధించి విజయ్ ఈ సత్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్న విజయ్, ఆ తరువాత మరోసారి ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement