సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరబోయే తమ అభిమాన హీరో మైనపు విగ్రహం ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చేసింది కాబట్టి. గచ్చిబౌలిలోని మహేశ్‌కు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్‌లో ఈ విగ్రహాన్ని సోమవారం ప్రదర్శనకు ఉంచారు. బ్లాక్ సూట్‌లో తీర్చిదిద్దిన మహేశ్ మైనపు బొమ్మ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహేశ్ భార్య నమత్ర, పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈరోజు ఉదయం ఏఎంబీ థియేటర్‌కు చేరుకున్నారు.
కొన్ని నెలల క్రితం మహేశ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రూపొందించారు. మహేశ్ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు.
తనతో తనే 👌🏼👌🏼👌🏼👌🏼 pic.twitter.com/GEeOijU2Qh
— Srinivasareddy (@Actorysr) March 25, 2019
Comments
Please login to add a commentAdd a comment