madam tussauds
-
మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?
"శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి. కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుందరాధి పోజ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" ! ( హంపీక్షేత్రం కొడాలి & కామరాజుగడ్డ ) నేను శిక్షణలో భాగంగా బెంగుళూరు వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి పనిగట్టుకొని హంపీ, బేలూరు, హలబెలిలకు వెళ్లి అలనాటి విజయనగర సామ్రాజ్య గతవైభవ శిథిలాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన పద్యం ఇది. అమెరికా లాస్ ఏంజెల్స్ వెళ్ళినప్పుడు, హాలీవుడ్ బొలివెర్డ్ లోనున్న ‘ మేడం టుస్సాడ్ వాక్స్ మ్యూజియం ’ చూశాం. అప్పుడు పదేపదే నాకు జ్ఞాపకం వచ్చింది ఈ పద్యమే. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం 2009 లో ప్రారంభమైందట. దీని ముందున్న కింగ్ కాంగ్ పెద్ద ఆకృతి ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రదర్శించబడిన మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో , చార్లీ చాప్లిన్, బ్రూస్ లీ, బారక్ ఒబామా వంటి ఎంతోమంది ప్రముఖుల రూపాలను చూసినప్పుడు వాటిని సజీవమూర్తులా అన్నట్లుగా తయారుచేసి పెట్టిన కళాకారుల ప్రతిభాసామర్థ్యాలు మమ్మల్ని ముగ్దులను చేశాయి. అయితే అప్పట్లో అందులో నాకు ఇండియా వాళ్ళది ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. ఈ వాక్స్ కళను మ్యూజియం స్థాయికి అభివృద్ధి చేసిన మేడం, ఫ్రాన్స్‌కు చెందిన మేరీ టుస్సాడ్ ( 1761 - 1850 ) మూర్తికి చేతులెత్తి మొక్కాము. ఇప్పుడు మేడం టుస్సాడ్ & సన్స్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీరు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి మ్యూజియంలను స్థాపించి ,అందులో సినిమా నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల మూర్తులను పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూపోతున్నారు. నిజమే కానీ ఇవన్నీ ఉత్త మైనపు బొమ్మలు మాత్రమేనన్న విషయం మనం మరిచిపోవద్దు. వీటితో పోల్చినప్పుడు కఠిన శిలలను శిల్పాలుగా, దేవతా మూర్తులుగా, మలిచిన మన శిల్పుల గొప్పదనం అర్థమౌతుంది. ఎన్నో కాలపరీక్షలను తట్టుకొని వేలవేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిలిచివున్న మన అపురూప కళాఖండాల విలువ తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మట్టితో భిన్న భిన్న ఆకృతుల వినాయక విగ్రహాలు చేసి అమ్ముకుంటున్న మన కళాకారుల వ్యాపారమంతా ఇప్పటికీ సరియైన ఆదరణ లేక రోడ్ల మీదనే కదా జరుగుతుంది. బ్రిటిషర్స్ పరాయి పాలకులైనా, భిన్న మతస్తులైన భారతదేశ చరిత్ర, సంస్కృతికి సాక్ష్యాలైన మన శిల్ప, శాసన సంపత్తిని చాలావరకు కాపాడగలిగారు. అపాటి కృషి స్వతంత్ర భారతంలో కూడా జరుగలేదన్నది చేదునిజం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎంతో అమూల్యమైన మన ప్రాచీన శిల్పసంపద సరియైన ఆదరణకు నోచుకోకుండా శిథిలమై కాలగర్భంలో కలిసిపోతుండడం విచారకరం. వీటిని కాపాడి ఎన్ని మ్యూజియంలైనా పెట్టవచ్చు. ప్రకృతివిపత్తులు, బయటివారి దండయాత్రలు, దేశ అంతర్గత మతబేధాల వల్ల మనం ఎంతో శిల్ప సంపదను కోల్పోయింది వాస్తవం . ఇప్పుడు ఉన్నదాన్నైనా కాపాడుకోలేక పొతే, మ్యూజియంల వంటి వాటిలో పరిరక్షించుకోలేకపోలే భావితరాలు మనల్ని క్షమించవన్న భావన నాకు మేడం టుస్సాడ్ మ్యూజియం సందర్శన ప్రేరణగా కలిగింది ! వేముల ప్రభాకర్(చదవండి: US : చర్మం రంగు.. కోటి తిప్పలు!) -
15 ఏళ్ల క్రితం ఇదే మ్యూజియంలో అంటూ అల్లు శిరీష్ కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు. అక్కడ ఈ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న బన్నీకి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన సోదరుడు అల్లు శిరీష్ కూడా బన్నీని విష్ చేస్తూ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నాడు. '15 ఏళ్ల క్రితం నేను, అన్నయ్య కలిసి దుబాయ్‌లోని ఇదే మ్యూజియానికి టూరిస్టులుగా వచ్చాం. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న పలు విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగాం. కానీ ఇంతటి గొప్ప ప్లేస్‌లో మా కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుంది అని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ విగ్రహంతో కలిసి ఫోటోలు దిగుతామని అనుకోలేదు. అన్నయ్యా.. నీ సినీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.' అంటూ అల్లు శిరీష్ శుభాకాంక్షలు చెప్పారు. బన్నీతో దిగిన పోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా శుభాకాంక్షలు తెలిపింది. బన్నీ భార్యగా తనకెంతో గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఎక్కడైనా సరే తనదైన ముద్రవేసే అల్లు అర్జున్ .. ఇప్పుడు మైనపు విగ్రంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటారని ఆమె తెలిపింది. మార్చి 28 ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. తొలి నటుడిగా రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న బన్నీకి అరుదైన గౌరవం లభించింది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వయంగా అల్లు అర్జున్ హాజరైన తన రూపాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అచ్చం పుష్ప స్టైల్లోనే విగ్రహాన్ని రూపొందించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో ఫోటోలో కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి నటుడిగా రికార్డ్ కాగా.. టాలీవుడ్ ఫ్యాన్స్ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్ తనదైన నటనతో ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. భారతదేశంలో అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ వాక్స్ స్టాట్యూ రూపంలో చిరస్థాయిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండియా నుంచి ఏ ఒక్క నటుడికి ఇలాంటి గౌరవం దక్కలేదు. తొలిసారి మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తన విగ్రహాన్న చూసిన బన్నీ.. నిజంగా తనని తానూ అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందని.. చాలా రియలిస్టిక్‌గా చేశారని వారిని ప్రశంసించారు. విగ్రహం ప్రత్యేకతలు ఈ మైనపు విగ్రహం ఫర్ఫెక్ట్గా రావడం కోసం 200 రకాల మేజర్మెంట్స్ను అల్లు అర్జున్ నుంచి సేకరించారు. తన డాన్స్ మూమెంట్స్‌ను కూడా సేకరించడం జరిగిందని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మేనేజర్ అయిన సనాజ్ కోల్స్రడ్ వెల్లడించారు. Here we go #MadameTussaudsdubai #ThaggedheLe pic.twitter.com/HuOveipJiO — Allu Arjun (@alluarjun) March 28, 2024 View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం'.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు మన ఐకాన్ స్టార్. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా.' అని పోస్ట్ చేశారు. It’s a very spl day today 🖤 . My 1st movie #Gangotri was released today in 2003 & today I am launching my Wax statue at #madametussauds dubai . It’s been an unforgettable journey of 21 years . I am grateful to each and every one of you in this journey & special thanks to my Fans… pic.twitter.com/kWRQemlwgi — Allu Arjun (@alluarjun) March 28, 2024 -
ఐకాన్ స్టార్ అరుదైన ఘనత.. ఆ రోజే ముహుర్తం ఫిక్స్!
పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో బిజీ ఉన్నారు. అయితే బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అల్లు అర్జున్ కొలతలను గతేడాది అక్టోబర్‌లోనే సేకరించారు. దీంతో తమ అభిమాన హీరో విగ్రహం ప్రారంభోత్సవం కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానుల నిరీక్షణకు తెరదించారు. బన్నీ మైనపు విగ్రహం ప్రారంభోత్సవానికి తేదీని నిర్ణయించారు. మార్చి 28న అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. మార్చి 28న రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విషయాన్ని దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో బన్నీ విగ్రహం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. View this post on Instagram A post shared by Madame Tussauds Dubai (@tussaudsdubai) -
టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం..
Virat Kohli Wax Statue At Dubai Madame Tussauds Museum: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అక్టోబరు 14న దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ప్రారంభించారు. టీమిండియా కెప్టెన్ కోహ్లికి ఇది రెండో మైనపు విగ్రహం. గతంలో 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఈనెల 24న దాయాది పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. చదవండి: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా..? ప్రధానిని నిలదీసిన ఓవైసీ -
వీరిలో నా డార్లింగ్ ఎవరబ్బా: కాజల్ భర్త
గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్ కొంతకాలం వరకు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చందమామ చేతిలో.. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ భారతీయుడుతో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతోపాటు కాజల్ తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కవగానే ప్రధాన్యతే ఇస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త గౌతమ్‌తో సమయం గడుపుతోంది. అంతేగాక ఇప్పుడిప్పుడే తన ప్రేమ మధుర జ్ఙాపకాలను బయటకు తీస్తోంది. చదవండి: స్టార్ హీరోయిన్ల మధ్య డిజిటల్ వార్ కాగా సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి నేటికి ఏడాది పూర్తయ్యింది. 5 ఫిబ్రవరి 2020న కాజల్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకు కాజల్ కుటుంబసభ్యులతోపాటు గౌతమ్ కూడా హాజరయ్యాడు. అయితే ఆవిష్కరణ ముందురోజే గౌతమ్ సింగపూర్ చేరుకొని కొన్ని గంటలపాటు కాజల్‌తో గడిపి మరుసటి రోజు బిజినెస్ పని మీద జర్మని వెళ్లాడు. కానీ గౌతమ్ వచ్చినట్లు మీడియాకు పెద్దగా తెలియదు. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్చేస్తూ కాజల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో గౌతమ్.. కాజల్, మైనపు విగ్రహం మధ్యలో నిలబడి అసలైన కాజల్ ఎవరని చూస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I'm seeing myself through the eyes of an artist 😍 The resemblance is uncanny and the attention to detail is spectacular. pic.twitter.com/WmOz38QBpS — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020 -
‘కాజల్’తో పోజులిచ్చిన ‘చందమామ’!
దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. కుటుంబంతో కలిసి సింగపూర్‌కు చేరుకున్న ఈ చందమామ.. అక్కడి మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన తన విగ్రహంతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో తమ అభిమాన హీరోయిన్ ఫొటోలను షేర్ చేస్తూ కాజల్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖల విగ్రహాలు సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన సంగతి తెలిసిందే. దివంగత తార శ్రీదేవి, అనుష్క శర్మ, కరణ్ జోహార్ సహా టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ రూపొందించింది. ఇక దక్షిణాది నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరోయిన్గా కాజల్ రికార్డుకెక్కారు. ఇక లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్.. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె... తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాతో పాటు, లోకనాయకుడు కమల్ హాసన్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. View this post on Instagram Another one of u is finally year. It took a year and she is here! Hahahah @kajalaggarwalofficial #doubletrouble #kajalaggarwal #madametussauds #madamtussaudssingapore #mtsg A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on Feb 4, 2020 at 7:38pm PST -
ఏఎంబీలో మహేష్ మైనపు విగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరబోయే తమ అభిమాన హీరో మైనపు విగ్రహం ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చేసింది కాబట్టి. గచ్చిబౌలిలోని మహేశ్‌కు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్లో ఈ విగ్రహాన్ని సోమవారం ప్రదర్శనకు ఉంచారు. బ్లాక్ సూట్లో తీర్చిదిద్దిన మహేశ్ మైనపు బొమ్మ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహేశ్ భార్య నమత్ర, పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈరోజు ఉదయం ఏఎంబీ థియేటర్‌కు చేరుకున్నారు. కొన్ని నెలల క్రితం మహేశ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రూపొందించారు. మహేశ్ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. తనతో తనే 👌🏼👌🏼👌🏼👌🏼 pic.twitter.com/GEeOijU2Qh — Srinivasareddy (@Actorysr) March 25, 2019 -
నిన్ను మా ఇంటికి తీసుకువెళ్లొచ్చా..?!
బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్.. తన భార్య దీపికా పదుకొనేపై ప్రేమను కురిపించే ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్సవ్వడు. వీలు చిక్కినప్పుడల్లా భార్యపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటాడు. అయితే ఇప్పుడు దీపికా పైనే కాదు మరొక ‘అమ్మాయి’పై కూడా ఈ ‘సింబా’ మనసు పారేసుకున్నాడు. ‘నాతో పాటు నిన్ను కూడా మా ఇంటికి తీసుకెళ్లచ్చా’ అంటూ స్వీట్ ప్రపోజల్ ఆమె ముందు ఉంచాడు. అంతేకాదు ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. అదేంటి రణ్వీర్ ఇలా ఎలా చేస్తాడు అంటూ కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే రణ్వీర్ ప్రేమను కురిపించింది ఎవరిపైనో కాదు దీపికా మీదే. అవును దీపికా మైనపు బొమ్మను చూసి ముగ్ధుడైన రణ్వీర్.. బొమ్మను కూడా తనతో పాటు తీసుకెళ్లాలని ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. రణవీర్ ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నాడా? ఇంతకీ విషయమేమిటంటే... లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన తన మైనపు విగ్రహాన్ని బాలీవుడ్ భామ దీపికా పదుకొనే గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త రణ్వీర్తో పాటు అత్తమామలు, తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో దీపికా సహా అభిమానులు, రణ్వీర్ ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. విగ్రహం చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ఇక రణ్వీర్ అయితే ఎంత బావుందో.. నాతో పాటు తీసుకెళ్తా అంటూ తనదైన స్టైల్లో కామెంట్ చేయడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అందుకు ప్రతిగా.. ‘ నువ్వు 83 షూటింగ్ కోసం వస్తావుగా. అప్పుడు నన్ను మిస్సయితే ఇక్కడికి వచ్చెయ్ అంటూ దీపికా కొంటెగా సమాధానమిచ్చారు. కాగా సింబా, గల్లీ బాయ్ వంటి సూపర్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న రణ్వీర్ ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్న 83 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక దీపికా కూడా యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ ‘చప్పాక్’లో నటించడంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Deepika Padukone unveils her wax statue at Madame Tussauds London. . . . . @ranveersingh @deepikapadukone @bollywoodbubble @madametussauds #wax #waxstatue #deepikapadukone #madametussauds #london #ranveersingh #deepveer #instalike #instagood #smile #bright #btown #bollywoodactress #fun #india #igers #bollywoodstars #bollywoodbubble #glamorous #doubletap #instagram #like #follow #updates #latest #photo #bollywoodpics A post shared by bollywood bubble videos (@bollywoodbubblevideos) on Mar 14, 2019 at 3:01am PDT -
స్మాల్ శాంపిల్ మాత్రమే
లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ మధ్య మహేశ్ ట్వీటర్లో పేర్కొన్నారు. దానికి సంబంధించిన కొలతలను, వివరాలను తుస్సాడ్స్ టీమ్ మెంబర్స్‌కు ఇచ్చారు మహేశ్. ఇప్పుడు ఆ మైనపు విగ్రహం కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మేడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు. మహేశ్ బాబు విగ్రహం ఎలా ఉంటుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిన్న టీజర్ చూపించారు మేడమ్ తుస్సాడ్స్వారు. చిన్న లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. ఈ బొమ్మను శిల్పి ఇవాన్ రీస్ తయారు చేస్తున్నారట. త్వరలోనే పూర్తి స్థాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం బృందం తెలిపింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. -
ప్రభాస్ తరువాత మహేష్
‘భరత్ అనే నేను’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేశ్‌బాబు హ్యాపీనెస్ ఇప్పుడు రెట్టింపు అయ్యింది. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘ప్రతిష్టాత్మక మేడమ్ తుస్సాడ్స్‌లో భాగం కాబోతున్నందుకు సూపర్ హ్యాపీగా ఉంది. నా కొలతలను తీసుకోవడానికి వచ్చిన బృందానికి థ్యాంక్స్. వాళ్ల డీటైలింగ్ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది’’ అన్నారు మహేశ్‌బాబు. మహేశ్‌కు ఈ గౌరవం దక్కడంతో అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇది వరకు టాలీవుడ్ హీరో ప్రభాస్‌కు ఈ గౌరవం దక్కిన విషయం తెలిసిందే. మహేశ్ తాజా సినిమాల విషయానికొస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన నెక్ట్స్ మూవీ రూపొందనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగాతో కూడా ఓ సినిమా ఉంది. -
అరుదైన గౌరవం.. హీరో రికార్డ్
సాక్షి, సినిమా : బాలీవుడ్లో హైపర్ హీరోగా పేరొందిన వరుణ్ ధావన్‌కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఈ యంగ్ హీరో మైనం విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హంకాంగ్‌లో ఉన్న బ్రాంచ్‌లో వరుణ్ ప్రతిమను ఏర్పాటు చేసేందుకు మ్యూజియం అధికారులు ముందుకు వచ్చారు. ఈ మేరకు కొత్త చిత్రం షూటింగ్లో ఉన్న వరుణ్ దగ్గరికే స్వయంగా వెళ్లి మరీ కొలతలు తీసేసుకున్నారు. ఇదే మ్యూజియంలో మహత్మా గాంధీ, నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్ విగ్రహాలు ఉండగా.. వారి సరసన ఇప్పుడు బాలీవుడ్ హీరో కూడా చేరిపోతున్నాడన్న మాట. వరుణ్‌కు నటుడిగా, యూత్ ఐకాన్‌గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని.. అందుకే ఆయన విగ్రహ ఏర్పాటు చేయబోతున్నామని మ్యూజియమ్ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తన విగ్రహ ఏర్పాటుపై ట్విట్టర్ వేదికగా వరుణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. బాలీవుడ్ తరపున అమితాబ్, షారూఖ్, అమీర్, సల్మాన్, ఐష్, హృతిక్, సౌత్‌లో ప్రభాస్ ఇలా పలువురి సినీ సెలబ్రిటీల విగ్రహాలు మేడమ్ టుస్సాడ్‌లో ఉన్నాయి. అయితే చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన నటుడిగా వరుణ్(30 ఏళ్లు) ఇప్పుడు రికార్డు క్రియేట్ చేశాడు. వచ్చే ఏడాది ఈ విగ్రహం సందర్శకుల కోసం అందుబాటులోకి రానుంది. Guess who is at Madam Tussauds now?? In Honk Kong! Presenting @Varun_dvn ....it’s on its way!!!! 😍 pic.twitter.com/NhUX4JVVZ8 — Karan Johar (@karanjohar) 16 October 2017 -
సచిన్ బొమ్మ తీసేశారు!!
ఆస్ట్రేలియాలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం పెట్టిన సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఇప్పుడు తీసేశారు. అప్పట్లో బొమ్మ పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి ఆ బొమ్మను చూడటం.. దాని పక్కనే నిలబడి ఫొటోలు తీయించుకుని అచ్చం మాస్టర్ తోనే ఫొటో దిగినట్లు ఫీలయిపోవడం లాంటివి కనిపించేవి. నాటి బొమ్మలో ఐసీసీ టీ20 టోర్నమెంటులో ధరించినట్లు బ్లూ జెర్సీ రూపం ఉండేది. కానీ.. సచిన్ అసలు ఆ మ్యాచ్‌లో ఆడలేదన్న విషయాన్ని మిడ్ డే పత్రిక వాళ్ల దృష్టికి తేవడంతో.. రంగు మారుస్తామని చెప్పారు. అయితే.. శుక్రవారం అక్కడికి వెళ్లి చూసిన పత్రిక ప్రతినిధులు షాకయ్యారు. కొన్ని నెలల క్రితమే అక్కడినుంచి సచిన్ మైనపు బొమ్మను తీసేశారు!! దాన్ని ఇక్కడినుంచి బ్యాంకాక్ పంపామని, ఒకచోటు నుంచి మరో చోటుకు బొమ్మలను పంపడం తమకు సర్వసాధారణమేనని మ్యూజియం సూపర్వైజర్ ఒకరు తెలిపారు. అభిమానులంతా ఎంతో అపురూపంగా చూసుకునే సచిన్ బొమ్మను ఏమాత్రం సమాచారం లేకుండానే తరలించడం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.