15 ఏళ్ల క్రితం ఇదే మ్యూజియంలో అంటూ అల్లు శిరీష్‌ కామెంట్‌ | Allu Sirish Comments On Allu Arjun Wax Statue At Madame Tussauds, 15 Years Back Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun Wax Statue In Tussauds: 15 ఏళ్ల క్రితం ఇదే మ్యూజియంలో అంటూ అల్లు శిరీష్‌ కామెంట్‌

Published Fri, Mar 29 2024 9:41 PM | Last Updated on Sat, Mar 30 2024 10:49 AM

Allu Sirish Comments On Allu Arjun Wax Statue - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు. అక్కడ ఈ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్‌ ఇండియన్‌ హీరోగా రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో సహా దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న బన్నీకి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన సోదరుడు అల్లు శిరీష్‌  కూడా బన్నీని విష్‌ చేస్తూ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నాడు.

'15 ఏళ్ల క్రితం నేను, అన్నయ్య కలిసి దుబాయ్‌లోని ఇదే మ్యూజియానికి టూరిస్టులుగా వచ్చాం. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న పలు విగ్రహాలతో కలిసి ఫోటోలు దిగాం. కానీ ఇంతటి గొప్ప ప్లేస్‌లో మా కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుంది అని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఆ విగ్రహంతో కలిసి ఫోటోలు దిగుతామని అనుకోలేదు. అన్నయ్యా.. నీ సినీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.' అంటూ అల్లు శిరీష్‌ శుభాకాంక్షలు చెప్పారు. బన్నీతో దిగిన పోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ కూడా శుభాకాంక్షలు తెలిపింది. బన్నీ భార్యగా తనకెంతో గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఎక్కడైనా సరే తనదైన ముద్రవేసే అల్లు అర్జున్‌ .. ఇప్పుడు మైనపు విగ్రంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటారని ఆమె తెలిపింది. మార్చి 28 ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement