అల్లు స్నేహ పోస్టుకు సామ్‌, రకుల్‌ కామెంట్‌ | Samantha Rakul Comment On Allu Sneha Instagram Post From Norway vacation | Sakshi
Sakshi News home page

Viral Photo: బన్నీ భార్య పోస్టుకు సామ్‌, రకుల్‌ ‘హార్ట్‌ సింబల్‌’..

Jul 24 2024 8:58 PM | Updated on Jul 25 2024 9:32 AM

Samantha Rakul Comment On Allu Sneha Instagram Post From Norway vacation

అల్లు స్నేహా రెడ్డి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌ స్టార్‌ ఐకాన్‌ అల్లు అర్జున్‌ భార్యగానే కాకుండా తనకంటూ  ప్రత్యేక పేరు సంపాదించుకున్నారామె. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా తన పిల్లల వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేగాక ఇంట్లోనూ పిల్లల బాధ్యతలు చూస్తూ.. బన్నీకి పూర్తి అండగా ఉంటూ వస్తున్నారు.

తాజాగా బన్నీ తన కుటుంబం సమేతంగా వెకేషన్స్‌కు వెళ్లారు. పుష్ప 2 సినిమా షూటింగ్‌కు గ్యాప్ రావడంతో యూరప్‌లోని నార్వే దేశంలో భార్య, పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ భార్య స్నేహ నార్వే వెకేషన్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో అల్లు అర్జున్‌ స్నేహను హగ్‌ చేసుకొని ఉండగా.. ఆమె తన పక్కనుంచి సెల్ఫీ తీసింది. ఈ ఫోటోలో పక్కనే పిల్లలు అయాన్‌, అర్హ కూడా ఏదో అల్లరి చేస్తూ పోజులు ఇవ్వడం కనిపిస్తోంది.

ఈ పోస్టుకు నెటిజన్లతో సైతం సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘హార్ట్‌ సింబల్‌’ను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటా వైరల్‌గా మారింది.  వీటికంటే ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పిట్ రాక్ అనే పర్యాటక ప్రాంతంలో   భారీ కొండ పైకి ఎక్కి దాని అంచున కుటుంబమంతా కలిసి దిగిన ఫోటో కూడా స్టోరీలో షేర్ చేసింది స్నేహ రెడ్డి. 

 మరోవైపు బన్నీ ఈ వెకేషన్ నుంచి తిరిగొచ్చాక ఆగస్టులో మళ్ళీ పుష్ప 2 షూటింగ్‌లో జాయిన్‌ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement