![Sneha Reddy Reveals Allu Arjuns Favourite Food In Chitchat Session - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/25/bunny.gif.webp?itok=basZFxQo)
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహా ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్లతో చిట్‌చాట్ సెషన్‌లో పాల్గొంది.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, లండన్ ఫేవరెట్ హాలీడే స్పాట్ అని పేర్కొంది. ఇక బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగ్గా.. బిర్యానీ అని సీక్రెట్ బయటపెట్టేసింది. ఇక రీసెంట్‌గా దిగిన ఫ్యామిలీ ఫోటోలను సైతం పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment