
టాలీవుడ్‌లో స్టైలిష్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 8.6 మిలియన్లపైనే మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు స్నేహా ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే.
చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్
వీలు చిక్కినప్పుడు తరచూ జిమ్, యోగ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. తన డైలీ రోటీన్‌ను ఓ చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇందులో స్నేహ వ్యాయమంతో పాటు తన ఆహారపు అలవాట్లను కూడా పంచుకుంది. ప్రస్తుతం స్నేహ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు ఇటీవల తన కూతురు ఆర్హ యోగ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. కూతురు వేసిన యోగ పోస్టర్‌కి బన్నీ షాకవుతూ అలానే చూస్తుండిపోయిన ఫొటోను ఇటీవల స్నేహ షేర్ చేశారు.
చదవండి: డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత
Comments
Please login to add a commentAdd a comment