క్యూట్‌ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్‌ డ్యాన్స్‌.. | Allu Arha And Allu Ayaan Dance In School Event In Cute Getups, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

క్యూట్‌ గెటప్‌లో అల్లు అర్జున్‌ పిల్లలు.. మురిసిపోయిన స్నేహా

Feb 1 2025 10:58 AM | Updated on Feb 1 2025 12:18 PM

Allu Arha, Ayaan Dance in School Event

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పిల్లలు అర్హ (Allu Arha), అయాన్‌లకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. అందులో పిల్లలిద్దరూ క్యూట్‌ గెటప్‌లో కనిపించారు. క్లాస్‌మేట్స్‌తో కలిసి హుషారుగా డ్యాన్స్‌ చేశారు. అర్హ, అయాన్‌ తమ స్కూల్‌ ఈవెంట్‌లో ఇలా వింత గెటప్‌తో డ్యాన్స్‌ చేసినట్లు కనిపిస్తోంది. అర్హ ముందు వరుసలో ఉంటే అయాన్‌ మాత్రం వెనకాల నిల్చున్నాడు.

పుష్ప 2తో కలెక్షన్ల ఊచకోత
ఇకపోతే అ‍ల్లు అర్జున్‌ పుష్ప 2 మూవీతో గ్రాండ్‌ సక్సెస్‌ అందుకున్నాడు. రూ.1800 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్‌ అవుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. సునీల్‌, జగపతిబాబు, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు.

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలా
బన్నీ తన నెక్స్ట్‌ సినిమాను త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తికేయుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రీమియర్స్‌ సందర్భంగా డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అటు థియేటర్‌ యాజమాన్యంతోపాటు ఇటు అల్లు అర్జున్‌ను సైతం అరెస్ట్‌ చేశారు. దీనిపై బన్నీ కోర్టును ఆశ్రయించగా రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

చదవండి: గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్‌ విన్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement