Ayaan
-
'పుట్టిన రోజు'నాడే ఇలా జరగడంతో.. తీవ్ర విషాదం!
సాక్షి, కరీంనగర్: రుద్రంగికి చెందిన ఇట్టవేణి సతీశ్, రాజేశ్వరి దంపతుల కుమారుడు ఇట్టవేణి అయాన్(3) డెంగీతో శుక్రవారం రాత్రి మృతిచెందాడు. బాలుడి పుట్టిన రోజు శనివారం నాడే అంత్యక్రియలు నిర్వహించడంతో కాలనీ శోకసంద్రంలో మునిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. అయాన్ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వేములవాడలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యుడు రక్తకణాలు తగ్గాయని చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మిన్నంటిన రోదనలు.. శుక్రవారం రాత్రి మృతిచెందిన అయాన్‌ది శనివారం పుట్టిన రోజు. ఆరోగ్యంగా ఉంటే పుట్టిన రోజు వేడుకలు ఎంతో సంబురంగా జరుపుకునేవాడు. డెంగీతో మృతిచెందడంతో పుట్టిన రోజు నాడే అంత్యక్రియలు నిర్వహించారు. పుట్టిన రోజునే నిన్ను పోగొట్టుకుంటున్నామా కొడుకా.. అంటు తల్లీదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
భార్య బిజినెస్‌ను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోల, వీడియోలను తరచూ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. ఇక బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్ ఎడిషన్ కోసం స్నేహారెడ్డి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ డిజైనర్ బ్రాండ్స్ సందడి చేశాయి. ముఖ్యంగా మామ్ అండ్ కిడ్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్నేహారెడ్డి కూతురు అర్హతో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో కలిసి ఈవెంట్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. భార్య ఈవెంట్‌ను సపోర్ట్ చేయడానికి బన్నీ రావడం ముచ్చటేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
కొడుకుతో వంట చేయిస్తున్న అల్లు స్నేహ, ఫోటో వైరల్
టాలీవుడ్లో స్టైలిష్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఫ్యాన్స్‌తో జరిపిన చిట్‌చాట్‌లో కొత్త సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రశ్నకు తన తనయుడు అయాన్‌తో కలిసి వంట చేయాలనుకుంటున్నానని ఆన్సరిచ్చింది. ఆ మాట చెప్పిందో లేదో వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది స్నేహ. తాజాగా అయాన్‌తో కలిసి వంట చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అయాన్ తల్లికి సాయంగా కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తున్నాడు. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయాన్ తల్లికి ఇలాగే హెల్ప్ చేస్తే త్వరలోనే మంచి చెఫ్ అవుతాడని సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే అల్లు అర్జున్- స్నేహ.. గురువారం నాడు దిల్ రాజు మనవరాలి పుట్టిన రోజు ఫంక్షన్లో తళుక్కుమని మెరిసిన సంగతి తెలిసిందే! చదవండి: దిల్‌రాజు మనవరాలి బర్త్‌డే ఫంక్షన్లో బన్నీ దంపతులు -
సమంతకు కొడుకుగా నటించేది ఈ స్టార్ హీరో తనయుడే!
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం "శాకుంతలం". దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. ఇదిలా వుంటే శాకుంతలంలో సమంత కొడుకు పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేదానిపై ఫిల్మీదునియాలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. శాకుంతలం కొడుకు భరత్ పాత్ర కోసం స్టార్ హీరోల కొడుకులను సంప్రదిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్లలో ఎవరో ఒకరిని శాకుంతలం సినిమాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ముందుగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ విషయమై సంప్రదించనున్నాడట గుణశేఖర్. ఒకవేళ అభయ్ రామ్ కాదంటే భార్గవ్ రామ్‌తో అయినా ఆ పాత్ర చేయించమని ఎన్టీఆర్‌ను రిక్వెస్ట్ చేస్తాడట. కుదరదంటే అప్పుడు బన్నీ దగ్గరికెళ్లి అతడి కొడుకును భరత్ పాత్ర కోసం ఒప్పించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ చర్చలు ఎంతవరకు వెళ్తాయి? సమంతకు కొడుకుగా ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! ఇదిలా వుంటే శాకుంతలం చిత్రాన్ని 'దిల్' రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. చదవండి: నా స్థాయిని మించి శాకుంతలం బడ్జెట్: సమంత ఈ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
ఆరుబయట మంచం మీద పిల్లలతో సేద తీరుతూ బన్నీ!
అల్లు అర్జున్ ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారన్న విషయం తెలిసిందే. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏ అకేషన్ వచ్చినా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ కుటుంబంతోనే సరదాగా గడుపుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో షూటింగులకు కూడా బ్రేక్ పడినట్లయ్యింది. ఈ సమయాన్ని అల్లు అర్జున్ పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. బుధవారం పిల్లలు అయాన్, అర్హలతో అల్లు అర్జున్ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను స్నేహ రెడ్డి తన ఫోన్లో బంధించింది. ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకు ఏదో వివరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇదిలా వుంటే ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్వకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి : బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న అల్లు అర్జున్ బన్నీకి నెగెటివ్.. పిల్లలతో కలిసి ఎమోషనల్ వీడియో -
బుల్లి అభిమాని కల నెరవేర్చిన బన్నీ
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కల నెరవేర్చడంతోపాటు అనాథబాలల్లో సంతోషాన్ని నింపారు. తన బుల్లి వీరాభిమానికి ఆయన ఆటోగ్రాఫ్ పంపించడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బిగ్‌బాస్ ఫేమ్ వితిక షేరు అభ్యర్థన మేరకు ఆటో గ్రాఫ్‌తోపాటు, శాంటా బహుమతులను పిల్లలకు పంపించారు బన్నీ. వీటిని అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ స్వయంగా అనాథాశ్రమాన్ని సందర్శించి పిల్లలతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో కలిసిపోయి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు బహుమతులను అందజేయడం విశేషం. దీంతో ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. థ్యాంక్యూ బన్నీ అన్నా అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు. మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా బన్నీ పిల్లలు అర్హ, అయాన్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తండ్రితో పోటీపడుతూ మరీ అభిమానులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిస్మస్ ట్రీ అలంకారం, మురిసిపోతున్న అల్లు అర్హ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోస్‌కు లక్షల సంఖ్యలో వ్యూస్ రావడమే ఇందుకు ఉదాహరణ. -
ఈ అబ్బాయికి అద్భుత దీపం దొరికింది!
పదమూడేళ్ల వయసులోనే తొలి కంపెనీ ప్రారంభించి ‘యంగెస్ట్ సీయివో ఆఫ్ ఇండియా’గా సంచలనం సృష్టించాడు ఈ కుర్రాడు. ఐటీ కాలేజీల్లో చదువుకోలేదు. అసలు కాలేజీ మెట్లే ఎక్కలేదు. అయితే అతడి దగ్గర అద్భుతదీపం ఉంది. దాని పేరు సంకల్పబలం. ఆ బలాన్ని నమ్ముకుంటే ఎన్ని అద్భుతాలైన జరుగుతాయని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ....అయాన్ చావ్లా... ఎనిమిది సంవత్సరాల వయసులో ‘అమ్మా, నాకు కంప్యూటర్ కావాలి’ అని అడిగాడు అయాన్. ‘ఈ వయసులో కంప్యూటర్ ఎందుకు నాన్నా....బుద్ధిగా చదువుకోకుండా...’ అని కుంజమ్ చావ్లా అందో లేదో తెలియదుగానీ ఒక ఫైన్‌మార్నింగ్ ఆ ఇంటికి కంప్యూటర్ వచ్చింది. ఆ కంప్యూటరే తన తలరాతని మార్చే అల్లావుద్దీన్ అద్భుతదీపం అవుతుందని అయాన్ ఆ క్షణంలో ఊహించి ఉండడు! రకరకాల వీడియోగేమ్స్ ఆడి విసుగెత్తిన అయాన్ దృష్టి ‘ఎడిటింగ్’పై పడింది. వీడియోలు, మూవీలు ఎడిటింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీపై ఆసక్తి మొదలైంది. ‘వీడియోలు సొంతంగా ఎడిట్ చేయగలుగుతున్నాను. వెబ్సైట్లు, సాఫ్ట్వేర్, యాప్‌లు క్రియేట్ చేయగలనా?’ అనే ఆలోచన వచ్చింది. ‘ఇది ఎలా చేయాలి?’ ‘అది ఎలా చేయాలి?’ అని ఎవరినైనా అడిగితే– ‘చదువుపై దృష్టి పెట్టుకుండా ఇవన్నీ నీకెందుకు?’ అని తిడతారేమో అని భయం. ఆ భయమే తనకు తాను గురువుగా మారే అవకాశం ఇచ్చింది. టెక్నాలజీకి సంబంధించి రకరకాల పుస్తకాలు కొనుక్కొని తలుపులు పెట్టుకొని గదిలో వాటిని శ్రద్ధగా చదివేవాడు. నెట్లో దొరికిన సమాచారాన్ని దొరికినట్లు చదివేవాడు. మొదట్లో అర్థం కానట్లు, అర్థమై అర్థం కానట్లు....రకరకాలుగా ఉండేది. మొత్తానికైతే బాగుంది. 13 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి 12 లాంగ్వేజ్‌లపై పట్టు సాధించాడు. అమ్మ దగ్గర నుంచి తీసుకొన్న పదివేల రూపాయాల పెట్టుబడితో 2011లో సోషల్ కనెక్టివీటి ప్లాట్‌ఫాం గ్రూప్ ఆఫ్ బడ్డీస్, రెండు నెలల తరువాత ఏషియన్ ఫాక్స్ డెవలప్మెంట్(వెబ్ సోల్యూషన్స్), 2013లో మైండ్–ఇన్ అడ్వర్టైజింగ్(మీడియా–మార్కెటింగ్), గ్లోబల్ వెబ్‌మౌంట్(డోమైన్స్, వెబ్సైట్ అండ్ మోర్) కంపెనీలు మొదలుపెట్టాడు. అయితే అయాన్ పని నల్లేరు మీద నడక కాలేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి వచ్చింది. అయితే ఇదంతా కష్టం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కష్టంలోనే తనకు ఇష్టమైన ‘కిక్’ కనిపించింది. మొదట్లో ఈ చిన్నవాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తన మార్కెటింగ్ సేల్స్మెన్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదు. ఆ తరువాత మాత్రం అయాన్‌లోని టాలెంట్ పదిమంది దృష్టిలో పడింది. ‘విషయం ఉన్న కుర్రాడు సుమీ’ అనే నమ్మకం ఏర్పడింది. కస్టమర్లు పెరిగారు. యూఎస్, యూకే, హాంగ్‌కాంగ్, టర్కీలలో అయాన్ కంపెనీలకు శాఖలు ఉన్నాయి. లక్షలాది మంది కస్టమర్లు ఏర్పడ్డారు. 18 సంవత్సరాల వయసులో ‘యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రశంస లేఖ అందుకున్నాడు. నైట్ పార్టీలకు దూరంగా ఉండే అయాన్ చావ్లా ప్రభుత్వ పాఠాశాలల్లోని పేద విద్యార్థును మోటివెట్ చేయడం అంటే ఇష్టం. క్షణం తీరికలేని వ్యవహారాల్లో నుంచి తీరిక చేసుకొని కాన్ఫరెన్స్, సెమినార్, వెబినార్లలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తుంటాడు. 2014–2015లో ఫ్లోరిడాలో జరిగిన ‘ఎంటర్ప్రైజ్ కనెక్ట్’లో ఉపన్యాసకుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు ఈ ఢిల్లీ కుర్రాడు. ‘విలువలు, అంకితభావం, సహనం...ఇలాంటివి మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. ఆమె నా కలల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే విజయాలు సాధించి ఉండేవాడిని కాదు’ అంటాడు తన తల్లి కుంజమ్ చావ్లా గురించి. అసలు అయాన్ చావ్లా కంపెనీ ట్యాగ్‌లైన్‌లోనే విజయరహస్యం దాగుంది. బిల్డ్...గ్రో....ఇన్స్పైర్! -
చెఫ్‌గా మారిన బన్నీ కొడుకు
హీరో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అల్లరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బన్నీ, అతని భార్య స్నేహారెడ్డిలు పలు సందర్బాల్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ సారి మాత్రం అయాన్ కొత్తగా చెఫ్ అవతారం ఎత్తాడు. సలాడ్ తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ) ఈ వీడియోలో అయాన్ సలాడ్ ఎలా తయారు చేయాలో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ సలాడ్ మనకు చాలా విటమిన్లను అందజేసి.. శరీరాన్ని బలంగా చేస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అయాన్ క్యూట్‌నెస్ చూసిన బన్నీ అభిమానుల మురిసిపోతున్నారు. ఇటీవల బన్నీ కుమార్తె అర్హ.. బుట్టబొమ్మ సాంగ్‌కు లిప్ సింక్ ఇచ్చిన వీడియో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘రాములో రాములా’.. మరో రికార్డు) -
క్యాన్సర్‌ను జయించిన హీరో కొడుకు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి సంక్రాంత్రి సందర్భంగా తన అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన కుమారుడు అయాన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన కుమారుడితో దిగిన ఫోటోలను పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఇమ్రాన్ ధన్యవాదాలు తెలిపారు. అయాన్‌కు 2014లో క్యాన్సర్ సోకినట్లు వైద్యులు ధృవీకరించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చికిత్స చేయించడంతో అయాన్ పూర్తిగా కోలుకున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. అభిమానుల ప్రార్థనలతో తన కుమారుడు క్యాన్సర్ నుంచి విముక్తి పొందాడని ఆనందం వ్యక్తం చేశారు. కాగా బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. సోనాలీ బింద్రే, ఇర్ఫాన్ ఖాన్లు కూడా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. -
కొడుకు ఫోజు చూసి.. బన్నీ విస్మయం!
బన్నీ తాజా సినిమా ‘డీజే దువ్వాడ జగన్నాథం’ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్ మనవడు, బన్నీ కొడుకు అయాన్ , ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ కలిసి విడుదల చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ పాటల వేడుకలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ వేడుకలో అయాన్ జనాలను చూసి ఇచ్చిన ఓ పోజు తల్లిదండ్రులు అల్లు అర్జున్-స్నేహరెడ్డిలను ఆశ్చర్యంలో ముంచెత్తితే.. అక్కడే ఉన్న తాత అల్లు అరవింద్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించేసింది. ఇంతకూ బుజ్జీ అయాన్ ఏం చేశాడంటే.. ఆడియో వేడుకకు వచ్చిన అభిమానులు చూసి.. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడి రీతిలో అభివాదం చేశాడు. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోను బన్నీ ట్విట్టర్లో షేర్ చేశాడు. కొడుకు జనాలకు అభివాదం చేస్తుంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయిన బన్నీ.. అవును అయాన్ తీరు చూసి నేనూ ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నాడు. I have to admit this gesture of Ayaan Surprised me -
'పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ ఫీవర్ అభిమానులతో పాటు స్టార్ హీరోలలో కూడా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలు ఈ సినిమా ప్రమోషన్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. తాజాగా మెగా హీరో అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్, మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 'దేవుడా... నా కొడుకు అయాన్, నా ఫోన్లో ఐ ట్యూన్స్ నుంచి సాంగ్స్ వింటూ కనిపించాడు. నా ట్విట్టర్ ఎకౌంట్ నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ పాటలను ఓపెన్ చేశాడు. వాడికి ఫోన్ గురించి ఏమీ తెలియదు. అయినా వాడు పాటలు ప్లే చేశాడంటే అది కేవలం లక్ మాత్రమే'. అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ ట్వీట్స్ కు కొసమెరుపుగా తన మార్క్ కామెడీ టచ్ కూడా ఇచ్చాడు బన్నీ. అయాన్ పాటలు వినటం చూసిన బన్నీ భార్య స్నేహ.. 'అది పవన్ పాట కాబట్టి సరిపోయింది, ఇంకెవరి పాట అన్నా అయి ఉంటే' అంటూ కంగారు పడిందంట. బన్నీ ఫోన్లో అంతలా భయపడేలా ఇంకెవరి పాటలు ఉంటాయో మరి. ఏది ఏమైనా సర్దార్ గబ్బర్‌సింగ్‌ను వీలైనంతగా ప్రమోట్ చేయటం కోసం మెగా హీరోలు తెగ కష్టపడిపోతున్నారు. Oh my god ! Shocking! My son was listening to songs in my phone iTunes a while ago. The next thing I see is Sardaar song in my Twitter acc. — Allu Arjun (@alluarjun) 29 March 2016 It's impossible to do it. It took my 10 mins to figure out how he did it. He does'nt know anything on the phone. Just pureeee luck. Unreal. — Allu Arjun (@alluarjun) 29 March 2016 My wife said : Thank god ! It's was a Pawan Kalyan song -
ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్'
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ రచయితగా మారుతున్నాడు.తన జీవిత కథను ద కిస్ ఆఫ్ మై లైఫ్ పేరుతో అభిమానులకు అందించనున్నాడు. అయితే బాలీవుడ్లో హాట్ హీరో ఇమేజ్ ఉన్న ఈ హీరో తన ఆత్మ కథలో మాత్రం జీవితంలోని విషాదాలనే నేపథ్యంగా తీసుకున్నాడట. తెర మీద స్టార్ హీరోగా వెలుగిపోతున్న ఇమ్రాన్ ఒక దశలో తన జీవితంలో ఎంతో బాదపడిన సందర్భాన్ని ఈ ఆత్మకథలో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమ్రాన్ హాష్మీని ఎన్నో ఏళ్లుగా వేదిస్తున్న సమస్య తన కొడుకు అయాన్ క్యాన్సర్‌తో బాధపడటం. తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ సహానిని పెళ్లి చేసుకున్నాడు ఇమ్రాన్. తరువాత కొడుకు పుట్టిన ఆనందం ఈ దంపతులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. కొడుకుకు క్యాన్సర్ అని తెలియంటంతో తల్లడిల్లి పోయారు. కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి ఎంతో వేదనకు గురయ్యారు. అందుకే క్యాన్సర్‌ను జయించిన తన కొడుకు జీవితాన్నే తన ఆత్మకథలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు. ఇంగ్లీష్, హిందీ, మరాఠి భాషల్లో విడుదలవుతున్న ఈ పుస్తకానికి 'ద కిస్ ఆఫ్ లైఫ్ : హూ ఏ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్' అని పేరు పెట్టాడు. ఈ ఏడాది చివరకల్లా ఈ పుస్తకాని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బ్రయోగ్రఫికల్ ఫిలిం అజార్లో నటిస్తున్నాడు. -
డాక్టర్ అయాన్.. S/O అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తనయుడు చిన్నారి అయాన్ డాక్టర్ గెటప్‌లో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శనివారం 'హాలోవీన్స్ డే' సందర్భంగా అయాన్‌ను డాక్టర్లా రెడీ చేసి అల్లు అర్జున్ తన సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. దాంతో అయాన్ నెట్లో లిటిల్ స్టైలిష్ స్టార్ అయిపోయాడు. హాలోవీన్స్ డే అనేది అమెరికాతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో జరుపుకొనే ఓ ఫెస్టివల్. 'హాలోవీన్స్ డే' ని 'సెయింట్స్ డే' అని కూడా అంటారు. కాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'. ఆ చిత్ర ఆడియో విడుదల సందర్భంగా అల్లు అర్జున్ చిత్ర టీంకు విషెస్ తెలిపారు. శనివారం జరిగిన ఆడియో రిలీజ్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. రాజ్ తరుణ్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. Fun Stuff with my lil son ! Happy Halloween's Day ! pic.twitter.com/MEpToujAQE — Allu Arjun (@alluarjun) October 31, 2015 -
అల్లువారి బుల్లోడు ..ఈసారి శాంటాక్లాజ్
సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్‌తో వెండితెరపై 'నాన్న' మెరుస్తుంటే...కొడుకు మాత్రం తక్కువ తిన్నాడా? సందర్భాన్ని బట్టి ఆయా గెటప్‌లతో అదరగొడుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా బుడతడు అంటే... అదేనండి అల్లువారి బుల్లోడు తాజాగా శాంటాక్లాజ్ వేషంలో దర్శమనిచ్చాడు. ఇటీవల బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ గెటప్‌లో అదరగొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్...ఈసారి రెడ్ అండ్ వైట్ కలర్ దుస్తులలో శాంటాక్లాజ్ డ్రస్‌తో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా బన్నీ తన కుమారుడిని శాంటాక్లాజ్‌గా ముస్తాబు చేసి ఫోటో తీశాడు. ఈ ఫోటోను తన ఫేస్బుక్లో అప్ చేయటం... చిన్నోడికి లైక్‌ల మీద లైక్‌లు వస్తున్నాయి. మరి అల్లువారి మనవడా...మజాకానా. -
బుల్లి చాచాజీ
ఇక్కడున్న బోసి నవ్వుల చాచాజీని చూశారా? ఎంత ముద్దొస్తున్నాడో కదూ. ఈ బుడ్డోడి వయసులో నెహ్రూజీ కూడా ఇలాగే ఉండేవారేమో! బాలల దినోత్సవ శోభంతా వీడి బోసి నవ్వులోనే కనిపిస్తోంది. ఇంతకీ ముద్దులమూట ఎవరనుకున్నారు? మన అల్లు అర్జున్ గారాల పట్టి అయాన్. చిల్ట్రన్స్ డే సందర్భంగా కొడుకుకి ఇలా చాచాజీ గెటప్ వేసి, ఆ స్టిల్‌ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు బన్నీ. ఇప్పట్నుంచే కొడుక్కి ఇలా గెటప్పుల్ని అలవాటు చేస్తున్నాడన్నమాట. అంటే... భవిష్యత్తులో ఈ చిన్నోడు ఇంకెన్ని గెటప్పుల్లో దర్శనమిస్తాడో చూడాలి. -
పేస్ బుక్‌లో 'చోటా జులాయి' హల్చల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్‌లో హల్చల్ చేస్తున్నాడు. అయాన్ జన్మించి ఆరునెలల అయింది. ఈ నేపథ్యంలో అయాన్ తాజా ఫొటోలను అల్లు అర్జున్ తన వ్యక్తిగత ఫేసు బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో ఫేసు బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే దాదాపు లక్షల లైకులు వచ్చాయి. ఆ లైకులు ఇంకా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. అయాన్ పుట్టిన తర్వాత అల్లు అర్జున్ తన కుటుంబంతో మరింత ఎక్కువ కాలం గడుపుతున్నారు. -
అల్లు వారి బుల్లోడు
ఇంతలో ఎంత మార్పు... జీవితమంటే అదేనేమో!‘మనిషికి తోడుగా తానుండలేడు కాబట్టే... తనకు బదులుగా అమ్మను సృష్టించాడు దేవుడు’ అంటుంటారు భావుకులు. ఇది అందమైన, భావోద్వేగ పూరితమైన కల్పిత భావన అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే... ఇందులో నిజం లేకపోలేదు. ఎలాగంటారా! ఇక్కడ దేవుడంటే ఎవరో కాదు.. నాన్నే. కుటుంబ పోషణ తలకెత్తుకున్న నాన్నకు ఎల్లకాలం బిడ్డలతోనే ఉండటం కుదరదు. అందుకే... తనకు ప్రతిరూపమైన అమ్మను బిడ్డలకు తోడు చేస్తాడు. తానెక్కడున్నా.. ఎలా ఉన్నా.. కుటుంబం గురించే ఆలోచిస్తాడు, వారి అభ్యున్నతినే ఆకాంక్షిస్తాడు. ఆ విధంగా ఆ భావుకులు చెప్పిన ఆ దేవుడు నాన్నే అన్నమాట. ఈ రోజు ఫాదర్స్‌డే కాదే... మరి ఈ నాన్న స్మరణేంటి? అనుకుంటున్నారా! ఇక్కడున్న తండ్రీకొడుకుల్ని చూస్తే.. ఎవరికైనా నాన్నను కాసేపు స్మరించుకోవాలనిపిస్తుంది. బిడ్డలపై తండ్రికి ఉండే ఆపేక్షకు నిలువెత్తు సాక్ష్యం ఈ స్టిల్స్. మొన్నటిదాకా తాను ఓ తండ్రి కొడుకు... ఇప్పుడు తానే ఓ బిడ్డ తండ్రి. ఇంతలో ఎంత మార్పు.తన రీసెంట్ హిట్ ‘రేసుగుర్రం’ బాక్సాఫీస్ వద్ద టాప్ 4 స్థానంలో నిలిచినవేళ అభిమానులకు ఏదైనా ప్రత్యేక కానుక ఇవ్వాలనుకున్నారాయన. అందుకే తన ముద్దుల తనయుడు అల్లు అయాన్ని చూడాలని గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం... శనివారం అయాన్ స్టిల్స్ మీడియాకు విడుదల చేసి, వారి కోరిక తీర్చేశారు. ఇదిగో వీడే.. అల్లు వారి బుల్లాడు. బాగున్నాడు కదూ! -
అల్లు వారసుడి పేరు అయాన్
వైవాహిక బంధానికి అసలైన అర్థం బిడ్డ పుట్టిన తర్వాతే తెలుస్తుందని ఇటీవల తండ్రయిన సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కాకముందు, ఆలుమగలు ఏదో డేటింగ్ చేస్తున్నట్లుగా ఉంటుందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తన ముద్దుల తనయుడికి ‘అయాన్’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ పేరుకి ఇస్లామ్‌లో ‘దేవుడి బహుమతి’ అని, సంస్కృతంలో ‘పవిత్రం’ అని, పెర్షియన్లో ‘గుర్తుంచుకోదగ్గవాడు’ అని, హెబ్రూలో ‘ప్రశాంతం’ అని అర్థం అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.