కొడుకు ఫోజు చూసి.. బన్నీ విస్మయం! | I have to admit this gesture of Ayaan Surprised me | Sakshi
Sakshi News home page

కొడుకు ఫోజు చూసి.. బన్నీ విస్మయం!

Published Mon, Jun 12 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

కొడుకు ఫోజు చూసి.. బన్నీ విస్మయం!

కొడుకు ఫోజు చూసి.. బన్నీ విస్మయం!

బన్నీ తాజా సినిమా ‘డీజే దువ్వాడ జగన్నాథం’ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని..

బన్నీ తాజా సినిమా ‘డీజే దువ్వాడ జగన్నాథం’  కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్‌ మనవడు, బన్నీ కొడుకు అయాన్‌ , ‘దిల్‌’ రాజు మనవడు ఆరాన్ష్‌ కలిసి విడుదల చేశారు.

అట్టహాసంగా జరిగిన ఈ పాటల వేడుకలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ వేడుకలో అయాన్‌ జనాలను చూసి ఇచ్చిన ఓ పోజు తల్లిదండ్రులు అల్లు అర్జున్‌-స్నేహరెడ్డిలను ఆశ్చర్యంలో ముంచెత్తితే.. అక్కడే ఉన్న తాత అల్లు అరవింద్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించేసింది. ఇంతకూ బుజ్జీ అయాన్‌ ఏం చేశాడంటే.. ఆడియో వేడుకకు వచ్చిన అభిమానులు చూసి.. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడి రీతిలో అభివాదం చేశాడు. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోను బన్నీ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. కొడుకు జనాలకు అభివాదం చేస్తుంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయిన బన్నీ.. అవును అయాన్‌ తీరు చూసి నేనూ ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement