Allu Sneha Reddy Organised PicaBoo Exhibition At Hyderabad, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Allu Sneha Reddy PicaBoo Exhibition: స్నేహారెడ్డి ఏం బిజినెస్‌ చేస్తుందో తెలుసా? బన్నీకి ఏమాత్రం తీసిపోదు

Published Sat, Aug 5 2023 3:02 PM | Last Updated on Sat, Aug 5 2023 5:10 PM

Allu Sneha Reddy Organised Picaboo Exhibition At Hyderabad - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్‌ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోల, వీడియోలను తరచూ తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది స్నేహారెడ్డి. ఇక బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

2016లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్‌ ఎడిషన్‌ కోసం స్నేహారెడ్డి ఓ గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ డిజైనర్‌ బ్రాండ్స్‌ సందడి చేశాయి. ముఖ్యంగా మామ్‌ అండ్‌ కిడ్స్‌ కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌ కోసం స్నేహారెడ్డి కూతురు అర్హతో కలిసి హాజరయ్యింది.

ఈ సందర్భంగా స్టాల్స్‌ యజమానులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌తో కలిసి ఈవెంట్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి. భార్య ఈవెంట్‌ను సపోర్ట్‌ చేయడానికి బన్నీ రావడం ముచ్చటేస్తుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement