
Allu Arjun Long Drive : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ వెదర్‌ను ఎంజాయ్ చేస్తూ బన్నీ, పిల్లలతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో బన్నీ స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. దుర్గం చెరువు వద్ద ఉన్న ఆకర్షనీయమైన లైట్స్‌ను అయాన్, అర్హ ఎంజాయ్ చేస్తుండటం వీడియోలో చూడొచ్చు.
కాగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్.. సరదాగా ఫ్యామిలీతో హైదరాబాద్ రోడ్లపై షికారు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment