long drive
-
భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.ఎంజీ హెక్టర్ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.ఎంజీ విండ్సర్ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.హోండా సిటీరూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.రెనాల్ట్ కైగర్మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. -
పాత బస్తీ.. బైకర్స్ మస్తీ..
చార్మినార్ సమీపంలో జనసంచారం అరకొరగా ఉండే ప్లేస్‌ను వెదకాలంటే.. అది కేవలం అర్ధరాత్రుళ్లు తప్ప అసాధ్యం. అందుకే సిటీ బైకర్స్ తమ చిట్‌చాట్‌కు అదే టైమ్‌ను ఎంచుకుంటున్నారు. పబ్స్, కేఫ్స్‌లో చిల్ అవుట్ అవడం ఎలా ఉన్నా ఓల్డ్ సిటీలో నైట్ అవుట్ మజాయే వేరు అంటున్నారీ బైకర్స్. నగరంలో విభిన్న రకాల పేర్లతో పదుల సంఖ్యలో బైకర్స్ క్లబ్స్ ఉన్నాయి. జాయ్ రైడ్స్ నుంచి లాంగ్రైడ్స్కు, ప్రత్యేక సందర్భాల్లో సందేశాత్మక రైడ్స్‌కు సైతం పేరొందిన ఈ క్లబ్స్.. తరచూ తమ ఓల్డ్‌సిటీని చుట్టి వస్తుంటారు. ‘ఓల్డ్ సిటీలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం అనేది నగరంలోని బైకర్స్‌కు ఒక సంప్రదాయంగా మారుతోంది. దీనికి తొలిసారి నగరంలో ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన క్లబ్స్ కారణం’అంటూ చెప్పారు నగరంలోని ఓ బైకర్స్ క్లబ్‌కు చెందిన శ్రీకాంత్.గరమ్ చాయ్.. బన్ మస్కా..సిటీలో ఎక్కడ చాయ్ తాగినా రాని కిక్ ఓల్డ్ సిటీలో ముచ్చట్లతో కలిపి పంచుకుంటే వస్తుందంటారు వాండరర్స్ క్లబ్‌కి చెందిన లలిత్ జైన్. నగరంలోని అత్యంత పాత క్లబ్స్‌లో ఒకటైన వాండరర్స్ తరపున పర్యాటక రంగ ప్రమోషన్స్ కోసం పాత బస్తీలో తరచూ రైడ్స్ నిర్వహిస్తుంటామని చెప్పారాయన. చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా వంటివి ఓల్డ్‌సిటీకి మాత్రమే ఫేమస్ అయిన పలు హైదరాబాదీ ఫుడ్ ఐటమ్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రద్దీ లేని వేళల్లో రైడ్స్ వేస్తుంటారు బైకర్స్. వెజ్, నాన్ వెజ్రైడర్స్ అందరూ ఎంజాయ్ చేసేందుకు అవసరమైన ఫుడ్ అక్కడ దొరుకుతుందని, దీంతో ఓల్డ్ సిటీ రైడ్ అంటే రైట్ అంటామని బైకర్ సిద్ధు చెబుతున్నాడు.ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత బస్తీ అనేది ప్రతి హైదరాబాదీకి ఒక ఎమోషన్ అంటారు రాజ్‌దూత్ బైక్ మీద రైడ్స్ చేసే నగరవాసి ఛటర్జీ. సాధారణ సమయాల్లో విపరీతమైన రద్దీ వల్ల ఆ ప్రాంతాన్ని సరిగా ఆస్వాదించలేమని, అదే బాగా పొద్దుపోయాక వెళితే.. బైక్ లైట్స్ వెలుగులో మిలమిల మెరిసే చార్మినార్ పరిసరాల్ని వదిలి రాలేమని అంటున్నారాయన. ఆయన లాగే అనేక మంది నగరానికి చెందిన మధ్య వయసు్కలు తమ యుక్త వయసులోని పిల్లల్ని తీసుకుని మరీ రాత్రుళ్లు.. బైక్స్ మీద ఓల్డ్ సిటీ టూర్ వేస్తుండడం సర్వసాధారణం.అతిథి దేవోభవ..దేశ విదేశాల్లో పర్యటించే బైకర్స్.. కొన్ని నగరాలు, ప్రాంతాలకు తాము వస్తున్న సమాచారాన్ని తరచూ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో, ఊర్లలో ఉన్న బైకర్స్ వెంటనే వారికి ఎదురేగి స్వాగతాలు పలకడం, తమ ప్రాంత విశేషాలను గురించి వారికి వివరించడం చేస్తుంటారు. అదే క్రమంలో నగరానికి వచ్చే ఇతర ప్రాంతాల బైకర్స్‌కు తప్పకుండా సందర్శనీయ స్థలం పాత బస్తీయే అవుతుంటుంది. అలా తరచూ వచ్చే బైకర్స్‌ను స్వాగతించి వారు కోరిన విందు విహారాలతో అతిథి మర్యాదలకు స్థానిక బైకర్స్ పాత బస్తీనే ఎంచుకుంటారు.తెల్లవారు ఝాము దాకా.. అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారుఝామున బ్రేక్‌ఫాస్ట్‌తో ముగించడం దాకా అక్కడే గడిపే బైకర్స్ కూడా ఉన్నారు.. బిర్యానీ, క్యారామెల్ పుడ్డింగ్, జఫ్రాన్ టీ వంటి వెరైటీలకు పేరొందిన నయాబ్ హోటల్, మసాలా బ్లాక్ టీ, జిందా తిలిస్మాత్ బ్లాక్ టీలు లభించే చౌక్ ఏరియాలోని డికాక్షన్ పాయింట్, నిహారీ, పాయా, షోర్బాలకు పేరొందిన చౌహాముల్లా ప్యాలెస్ సమీపంలోని అల్హాముదులైలాహ్ హోటల్, జ్యూస్‌లు, సలాడ్స్ అంటే గుర్తొచ్చే చారి్మనార్ దగ్గర్లోని మిలాన్ జ్యూస్ సెంటర్, సిద్ధి అంబర్ బజార్లో ఇడ్లీ దోశలతో ఆహా్వనించే ప్రహ్లాద్, అన్నపూర్ణ టిఫిన్స్.. ఇంకేం కావాలి చెప్పండి అంటున్న బైకర్స్‌కు ఆయా హోటల్స్ యజమానులు అంతా చిరపరిచితులే. దీంతో కాస్త ముందుగా చెబితే చాలు వచ్చేవారి సంఖ్యకు తగ్గట్టు ఐటమ్స్ రెడీ చేసేస్తారు.నురానీ కేఫ్ నుంచి నాసిక్ హైవేకి.. రాత్రి 12 దాటిన తర్వాత పాతబస్తీలోని నురానీ కేఫ్‌లో చాయ్ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం రొటీన్. మరింత లాంగ్‌రైడ్ కోసం అక్కడ నుంచి నాసిక్ హైవే పై 100 నుంచి 120 కిమీ, అలాగే అక్కడి నిమ్రా కేఫ్ కూడా తరచూ మా మీటింగ్ పాయింట్ అవుతుంటుంది. రాత్రి పూట బైక్ మీద చారి్మనార్‌కు అత్యంత సమీపానికి వెళ్లడం, అక్కడి చాయ్, చాట్ ఆస్వాదించడం బాగుంటుంది. బయట నుంచి వచి్చన బైకర్స్‌ను తప్పకుండా పాత బస్తీకి తీసుకువెళతాం. – అమర్, హిందూస్థాన్ రాయల్స్ బుల్లెటీర్స్ క్లబ్స్అడ్వెంచర్ ఫీల్ కోసం.. రైడ్స్ మధురమైన జ్ఞాపకాలను పోగు చేసుకోడానికే. అందులో రాత్రి పూట రైడ్స్ ప్రత్యేకమైనవి. నైట్ రైడ్ అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. మా వాండరర్స్ తరచూ ఫుడ్ రైడ్స్ నిర్వహిస్తుంటాం. రాత్రి పూట హైవే మీది దాబాల లాగే పాత బస్తీలో వెరైటీ ఫుడ్ అందించే ప్రాంతాల్లో రైడ్స్ వేస్తుంటాం. నగరం మీదుగా పర్యటించే బైకర్స్ గురించి తెలుసుకుని ఆహా్వనిస్తాం. పాతబస్తీ చరిత్రతో పాటు ఆహారాన్ని రుచిచూపిస్తాం. మళ్లీ మళ్లీ ఓల్డ్‌సిటీకి రావాలని అనిపిస్తుందంటారు. – రాహుల్.వాండరర్స్ క్లబ్ -
‘థార్’పై సవారీకి పెరుగుతున్న క్రేజ్
కట్టిపడేసే ఆకృతి.. ఉట్టిపడే రాజసంతో ‘థార్’ వెహికిల్ ఆకట్టుకుంటోంది. ఇది మధ్యతరగతి నుంచి సంపన్న వర్గాల వరకు అందరి మనసూ దోచుకుంటోంది. ‘థార్’పై సవారీకి చాలామంది ఆసక్తి చూపుతుండడంతో జిల్లాలోనూ ఈ వాహనాల సంఖ్య పెరుగుతోంది. జిల్లా రోడ్లపై రయ్యిరయ్యిమంటూ దూసుకుపోతున్న ‘థార్’పై సండే స్పెషల్.. సాక్షి, కామారెడ్డి: కరోనా వ్యాప్తి తర్వాత చాలామంది కార్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో కార్ల సంఖ్య పెరుగుతోంంది. ఆర్థికశక్తి కూడా పెరగడంతో లగ్జరీ కార్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. మహీంద్ర కంపెనీ తయారు చేసిన ‘థార్’ మోడల్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు. రాజకీయ నాయకులు తమ కాన్వాయ్‌లో థార్లు ఉంచుకుంటున్నారు. వ్యాపారులూ ఈ వా హనంపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన వాళ్లు హుందాతనం కోసం థార్ మీద సవారీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేశారు. దీంతో ‘థార్’ వాహనాలు జిల్లా రోడ్లపై రయ్యిమంటూ పరుగులు తీస్తున్నాయి. లాంగ్ డ్రైవ్‌కు అనుకూలం.. చాలామంది లాంగ్ డ్రైవ్కోసం థార్‌ను ఎంచుకుంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వాహనంలో విహార యాత్రలకు వెళ్లివస్తున్నా రు. కూర్చునేందుకు అనువుగా సీట్ల అమరిక ఉండడంతో ఇందులో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ధరతోపాటు మెయింటెనెన్స్ ఖర్చు కాస్త ఎక్కువే అయినా థార్‌ను కలిగి ఉండడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తుండడంతో జిల్లాలో వాహనాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందకుపైగా థార్లు ఉన్నట్లు తెలుస్తోంది. హుందాగా ఉంటుంది.. థార్‌లో వెళ్తే ఎంతో హుందాగా ఉంటుంది. ఎటైనా ఇదే వాహనంలో వెళ్తున్నా. మట్టి రోడ్లపై ప్రయాణించినా, గుట్టల మీదికి వెళ్లినా సౌకర్యవంతంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. – సురేందర్‌రెడ్డి, కామారెడ్డి పార్ట్‌నర్స్‌తో కలిసి.. వ్యాపార భాగస్వాములం కలిసి థార్‌ను కొనుగోలు చేశాం. ఇటీవల ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాను. ఫ్యామిలీతో వెళ్లడానికి ఈ వాహనం బాగుంటుంది. ఎంత ఎత్తు ప్రదేశమైనా ఎక్కడానికి ఉపయోగపడుతుంది. – రాజు పాటిల్, దేవునిపల్లి, కామారెడ్డి ఆకట్టుకునేలా.. థార్ మోడల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంది. రెగ్యులర్‌గా ఇందులోనే తిరుగుతున్నాం. – పత్తి శ్రీనివాస్, పిట్లం సౌకర్యవంతంగా ఉంటుంది మహీంద్ర థార్ మోడల్ ఆకర్షణీయంగా కనిపి స్తుంది. కుటుంబంతో కలిసి ఎలాంటి రోడ్లపైనైనా ప్రయాణించడా నికి ఈ వాహనం సౌకర్యంగా ఉంటుంది. – అంజద్‌ఖాన్, సీతాయిపల్లి, గాంధారి మండలం థార్ కొనాలన్నది నా కల థార్ మోడల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ మోడల్‌ను కొనాలన్నది నా కల. దానిని నెరవేర్చుకున్నాను. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకూ ఇందులోనే వెళ్తా. – సిద్ధి శ్రీధర్, ఎల్లారెడ్డి పిల్లలూ ఇష్టపడతారు నేను హైదరాబాద్‌లో ఉంటాను. పదిపదిహేను రోజులకు ఒకసా రి స్వగ్రామం బిచ్కుందకు వస్తుంటా. ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుని తిరిగి వెళ్తా. ఫ్యామిలీతో కలిసి వచ్చి వెళ్తుంటాం. ఇందులో ప్రయాణాన్ని పిల్లలూ ఎంజాయ్ చేస్తారు. – నాలం శ్రీధర్, బిచ్కుంద ఎటు వెళ్లాలన్నా.. థార్ వాహనం బాగుందని నేను కొనుగోలు చేశాను. కుటుంబ సభ్యులతో కలిసి ఎటు వెళ్లాలన్నా ఇందులోనే ప్రయాణిస్తున్నాం. సేఫ్ జర్నీకి ఇలాంటి వాహన అవసరం. – భీంరెడ్డి, తిప్పాపూర్, భిక్కనూరు మండలం -
అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు!
అలా సరదాగా పిక్నిక్ కు వెళ్లి.. ఆరుబయట ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వేడివేడిగా భోజనం తింటే ఎంత ఆనందంగా ఉంటుంది? చిన్నప్పుడు ఊళ్లలో వంటలకని వెళ్లేవాళ్లు. అక్కడే దొరికే కర్రముక్కలతో వంట పొయ్యి చేసి కుండల మీద వండి భోజనాన్ని సిద్ధం చేసుకునేవారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం. మరేం చేయాలి? ఇదిగో మా దగ్గర జవాబు ఉందంటున్నాయి కంపెనీలు. క్యాంపింగ్స్, పిక్నిక్స్, లాంగ్ డ్రైవ్స్ లాంటివి మెమొరీస్‌గా నిలిచిపోవాలంటే.. అక్కడ పరిసరాలతో పాటు చక్కటి ఆహారం దొరకాలి. లేదంటే ఆరోగ్యం చెడి.. ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఆనందాన్ని మిస్ అవుతాం. అందుకే చాలా మంది.. మంచి కుక్వేర్ని వెంట తీసుకెళ్తుంటారు. చిత్రంలోని కుక్వేర్ అలాంటిదే. ఈ పరికరాన్ని చేత్తో సులభంగా పట్టుకెళ్లొచ్చు. దీని హ్యాండిల్స్ డివైస్‌కి ఇరువైపులా బల్ల మాదిరిగా ఉండి.. స్టోరేజ్‌కి ఉపయోగపడతాయి. outdoor cooking - something healthy & fresh ... my daughters volunteered to cook 👌 mahimahi slices, baigani tavu & roasted corn 🤙 pic.twitter.com/3yLBwMMTnr— Moira Vilsoni-Raduva (@mvilsoni_fj) July 8, 2023 గ్స్ కూడా ఫోల్డ్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. కిందవైపు సొరుగుల్లో చెక్కముక్కలు లేదా బొగ్గులు వేసుకుని నిప్పు రాజేసుకోవాలి. దానికి ప్రత్యేకమైన డోర్ ఉంటుంది. పొగవాసన బయటికి పోవడానికి వెనుకవైపు ప్రత్యేమైన గొట్టాన్ని అమర్చుకోవచ్చు. దీన్ని వేరుచేసి డివైస్ లోపల సొరుగులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరంపై అన్ని రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందుకు తగ్గ పాత్రలను మార్చుకోవచ్చు. లాంగ్‌డ్రైవ్‌లో చక్కగా ఉండటమేగాక హాయిగా ఇంటి భోజనం చేశామన్నా సంతృప్తి దొరకుతుంది కదా!. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరీ. (చదవండి: ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..) ఔట్ డోర్ లో సులభంగా వండే 30 వంటలు 30 Picnic Recipes (and 6 Complete Menus) for a Perfect Outdoor Feast. Picnic as single person with my walker??? Not really, I cook/eat at home only.https://t.co/cTcHwkzWif pic.twitter.com/CAyMhdHqBE— Marion Friedl #ForUkraine #Boostered #PostVac (@marillion13) July 15, 2023 -
బుల్లెట్: రూ. 1.5 లక్ష నుంచి రూ. 3.5 లక్షల వరకు.. నాడు మిలిట్రీ బైక్, కానీ.. నే
వైరారూరల్ (ఖమ్మం): బుల్లెట్.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుంచి వచ్చే ఫైరింగ్.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్.. రయ్.. మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్నవారు, రాజకీయంగా మంచి పట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. మార్కెట్లోకి ఇలా.. ఈ బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని 1955లో ఇండియాన్ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. అనంతరం 1960 నుంచి స్పేర్ పార్ట్స్‌ను ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఇండియాలోనే బుల్లెట్ ద్విచక్రవాహనాన్ని ఫిటింగ్ చేసే వారు. ఇవన్నీ గతంలో పెట్రోల్‌తో నడిచేవి. దాని తర్వాత కొన్నేళ్ల పాటు కొంత మంది మెకానిక్‌లు పెట్రోల్ ఇంజన్ తొలగించి డీజిల్ ఇంజన్‌తో రీమోడలింగ్ చేసి మార్కెట్లో విక్రయించేవారు. ఆ సమయంలో డీజిల్ బుల్లెట్లకు భారీ డిమాండ్ ఉండేది. అనంతరం 1994–2000 వరకు బుల్లెట్ కంపెనీ వారే డీజిల్ బుల్లెట్‌ను విడుదల చేశారు. కాలక్రమేణా పొల్యూషన్ కారణంగా 2000 సంవత్సరంలో డీజిల్ బుల్లెట్ వాహనాలు పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యాయి. దాని తర్వాత పలు రకాల బుల్లెట్ ద్విక్రవాహనాలు కొత్త వర్షన్ మోడల్స్‌తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్లో కాస్ట్‌ఐరన్ స్టాండర్డ్, ఎలక్ట్రా, క్లాసిక్, థండర్బాడ్, ఇంటర్‌స్పెక్టర్, కాంటినంటల్ జీటీ, హిమాలయం, హంటర్ వంటి మోడల్స్ వాహనాలు మార్కెట్లోకి విడుదలై యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులను సైతం ఆకర్షిస్తున్నాయి. (చదవండి: సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?) బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్న యువకులు సీసీలపై యువత మోజు.. ప్రస్తుతం మార్కెట్లో 100 నుంచి 180 సీసీ గల ద్విచక్రవాహనాలే అధిక శాతం ఉన్నాయి. ఇటువంటి ద్విచక్రవాహనాలపై మక్కువ లేని యువత బుల్లెట్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బుల్లెట్ వాహనం ఒక్కొక్క మోడల్ ఒక్కో విధంగా సీసీ కలిగి ఉంటుంది. బుల్లెట్ వాహనాలలో 350, 411, 500, 650 సీసీ సామర్థ్యంతో కూడినవి దొరుకుతున్న నేపథ్యంలో.. వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా బుల్లెట్ వాహనానికి అనుగుణంగా ఉండేందుకు షోరూంతో వచ్చిన సైలెన్సర్‌ను తొలగించి బుల్లెట్‌పై ఉన్న మోజుతో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్ అమర్చుకోని ప్రయాణిస్తూ బుల్లెట్ బైక్‌లను ఆస్వాదిస్తున్నారు. ధర లెక్కచేయకుండా.. బుల్లెట్ ధరతో కారు కొనుగోలు చేయవచ్చు. కానీ యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులు సైతం కారుపై ఆసక్తి కనబర్చకుండా బుల్లెట్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. బుల్లెట్ బండ్ల ధరలు మోడల్‌ను బట్టి వాటి ధర ఉంటుంది. రూ. 1.50 లక్ష నుంచి రూ. 3.50 లక్షల వరకు బుల్లెట్ బైకుల ధరలు ఉన్నాయి. ఇంతటి ధరను కూడా లెక్క చేయకుండా యువత ఈ బుల్లెట్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారంటే.. వీటి క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులోనే బుల్లెట్ ధర రూ. 3.50 లక్షలు వరకు ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో వీటి ధర కొంత శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ బుల్లెట్ కొనుగోలుపై యువత వెనుకడుగు వేయకపోవడం కొసమెరుపు. బుల్లెట్ రైడ్.. బుల్లెట్ ద్విచక్రవాహనాలు గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న విహారయాత్రలకు ఈ బుల్లెట్ వాహనాలపై ప్రయాణాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. రవాణా సౌకర్యార్థం బుల్లెట్ బండ్లు అనుకూలంగా ఉండడం వలన అధికశాతం మంది బుల్లెట్‌ను కొనుగోలు చేసుకుంటూ.. వీటిపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. (చదవండి: వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’) -
డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..
You can enjoy your New Year's eve in these best possible ways కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు చివరి రోజు కూడా వచ్చేసింది. ఐతే న్యూ ఇయర్ రోజును ఎలా జరుపుకోవాలబ్బా? అని ప్రతి ఒక్కరూ బుర్రలు గోక్కుంటున్నారు కదా! మీ కోసం మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. అవేంటంటే.. హౌస్ పార్టీ మీ ఇంటి టెర్రస్ పై కానీ, ఇంట్లోనైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సరదాగా చేసుకోవచ్చు. టెర్రస్ పై ప్లాన్ చేస్తే చలి కాలం కాబట్టి చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇష్టమొచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారా మరి? టాప్ రేటెడ్ హోటల్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పార్టీ ఇది. ఐతే స్పెషల్ అకేషన్‌ను ఇంకా స్పెషల్‌గా జరుగుకోవాలనే వారికోసం న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. లగ్జరియస్ డ్రింక్స్, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. మీ నూతన సంవత్సరాన్ని రాయల్‌గా ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఇటువంటి హోటల్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకుంటే సరి. పార్టీ ప్లాన్ రెడీ అయిపోయినట్టే! రెస్టారెంట్ ట్రీట్ భోజన ప్రియులకు ఇది బెస్ట్ ఐడియా. న్యూ ఇయర్ సందర్భంగా చాలా రెస్టారెంట్లు బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బఫెట్ డిన్నర్లో రకరకాల డిసర్ట్ను మీ ప్లేట్ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు. ఐతే టేబుల్ ముందే బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే! లాంగ్ డ్రైవ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఇది కూడా మంచి ఐడియానే. సొంత వెహికల్లో, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ, మీకిష్టమైన వారితో అలా.. లాంగ్ డ్రైవ్ కెళ్లారంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా! ఐతే ఇద్దరు, ముగ్గురు సన్నిహితులతోనే ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది సుమా! బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకునే వారు ఓపెన్ ప్లేస్ (బహిరంగ ప్రదేశాలకు)లకు వెళ్లడం ఉత్తమం. మ్యూజిక్ ఎంత సౌండ్‌తో విన్నా మిమ్మల్ని వారించేవారెవ్వరూ ఉండరు. లగ్జరీ డెకరేషన్, లైట్ల వెలుగులో సన్నిహితులతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఐడియా. బార్బెక్యూ డిన్నర్ కూడా మంచి ఎంపికే. పై మార్గాల్లో మీకు నచ్చిన ఐడియాని ఫాలో అవ్వండి. చెప్పనలవి కానంత ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఐతే గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు! చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వల.. లాంగ్ డ్రైవ్ పేరుతో కిడ్నాప్
రాజమహేంద్రవరం: ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి, పథకం ప్రకారం బయటకు తీసుకువెళ్లి కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఓ యువతితో భీమవరం సమీపంలోని కొత్త పూసలమర్రుకు చెందిన మోకా ఫణీంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 15న లాంగ్ డ్రైవ్‌కి తీసుకువెళ్తానని చెప్పి ఫణీంద్ర.. రాజానగరం వచ్చాడు. ఆ యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని, భీమవరం సమీపంలోని బలుసుమూడి 31వ వార్డులోని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బంగారు చైన్, చెవి దిద్దులు తీసుకున్నాడు. తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి గాయపర్చాడు. అనంతరం ఆమె తండ్రికి ఫోన్ చేశాడు. అతడి కూతురిని కిడ్నాప్ చేశానని, రూ.5 లక్షలు ఇస్తేనే వదిలిపెడతానని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు వెంటనే రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అప్రమత్తమై ఎనిమిది బృందాలుగా ఏర్పడి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతిని కిడ్నాపర్ ఫణీంద్ర అదే ఇంట్లో ఉంచి ఈ నెల 16న తాళం వేసి, బయటకు వెళ్లిపోయాడు. ఇంట్లోనే బందీగా ఉన్న ఆ యువతి ఇంటి తలుపును గట్టిగా బాదింది. దీనిని గమనించిన స్థానికులు బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీసు గంగాభవానీకి సమాచారం అందించారు. ఆమె ఈ విషయాన్ని అక్కడి టూ టౌన్ పోలీసులకు తెలపడంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించి, యువతిని రక్షించారు. రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో వారు కిడ్నాపర్ ఫణీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీస్ గంగాభవానీని ఎస్పీ ప్రశంసాపత్రం, నగదు, మెమెంటో, శాలువాతో సత్కరించారు. -
బైక్‌పై తల్లీకూతురు..కేరళ To కాశ్మీర్
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు. కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్‌పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్‌పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది. మహిళల ప్రయాణం ‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా. వారం దాటాకే సమాచారం రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష. -
తీగల వంతెనపై బన్నీ ఫ్యామిలీ.. వైరల్ వీడియో
Allu Arjun Long Drive : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ వెదర్‌ను ఎంజాయ్ చేస్తూ బన్నీ, పిల్లలతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో బన్నీ స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. దుర్గం చెరువు వద్ద ఉన్న ఆకర్షనీయమైన లైట్స్‌ను అయాన్, అర్హ ఎంజాయ్ చేస్తుండటం వీడియోలో చూడొచ్చు. కాగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్.. సరదాగా ఫ్యామిలీతో హైదరాబాద్ రోడ్లపై షికారు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
కరోనాకి అంత సీన్ లేదు!
పాప్ గాయని మడోన్నాకు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందట. అందుకే కరోనా నన్ను ఏమీ చేయలేదు.. నా విషయంలో కరోనాకి అంత సీన్ లేదంటున్నారామె. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ జరిగిన విషయాలను ‘‘క్వారంటైన్ డైరీ’’ పేరుతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంటున్నారామె. ఇటీవలే కరోనా గురించి ఓ అప్ డేట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు మడోన్నా. ‘‘ఈ మధ్యే కరోనాకి సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను. కరోనాను ఎదిరించే యాంటీబాడీస్ నా శరీరంలో తగినన్ని ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. రేపు ఉదయమే కారు తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్లబోతున్నాను. దారిలో కారు అద్దాలు దించి కోవిడ్ గాలి కూడా పీలుస్తాను. అందర్నీ ఇలా చేయమని చెప్పను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి’’ అని పేర్కొన్నారు మడోన్నా. -
లాంగ్ డ్రైవ్ కు వెళ్లి.. ప్రమాదానికి గురై..
♦ టిప్పర్‌ను ఢీకొన్న కారు ♦ ఒకరి దుర్మరణం ♦ మరో ఆరుగురికి తీవ్రగాయాలు మేడ్చల్: మద్యం మత్తులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన యుువకులు రోడ్డు ప్రవూదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వుండలం గాజులరావూరం వూర్కండేయునగర్కు చెందిన త్యాగాల వీరబాబు(22)క్యాబ్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్లు సారుుబాబు, శ్రీకాంత్, ప్రవీణ్, షణ్ముఖ, నారాయుణ, నవీన్ అతడికి స్నేహితులయ్యారు. వీరంతా సోవువారం అర్ధరాత్రి మద్యం తాగిన అనంతరం లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని భావించి సారుుబాబుకు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు (టీఎస్ 07 యుూబీ 6935)లో బయలుదేరారు. మేడ్చల్ మీదుగా శామీర్‌పేట్ వైపు వెళ్తున్నారు. మేడ్చల్-శామీర్‌పేట్ రోడ్డులో కారులో అతివేగంగా వెళ్తుండగా వుండల పరిధిలోని కిష్టాపూర్ వద్ద ఉన్న వులుపులో మేడ్చల్ నుంచి శామీర్‌పేట్ వైపు వెళ్తున్న టిప్పర్ (ఏపీ 28 టీడీ 7453) బ్రేక్ వేయుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు దానిని ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న వీరబాబు(23) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కారు వెనుక భాగంలో కూర్చున్న షణ్ముఖ తలకు తీవ్రగాయూలు కావడంతో ఆయున పరిస్థితి విషవుంగా ఉంది. డ్రైవింగ్ చేస్తున్న సారుుబాబుతోపాటు వాహనంలో ఉన్న శ్రీకాంత్, ప్రవీణ్, నారాయుణ, నవీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వుృతదేహానికి మేడ్చల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిరమ్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దదిక్కును కోల్పోరుున కుటుంబం.. ప్రవూదంలో వుృతి చెందిన వీరబాబు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ. అతడి తండ్రి సత్తిబాబు టైలర్. సత్తిబాబు దంపతులకు ఓ కువూర్తెతో పాటు వీరబాబు సంతానం. వయసు పైబడిన వీరబాబు దంపతులు కుమారుడిపైనే ఆధారపడ్డారు. వీరబాబు పదేళ్లుగా నగరంలో ఉంటూ డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. -
వేడి వేడి పకోడి... భలే టేస్ట్ గురూ!
‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన.. ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’ అంటూ ఎండలకు విసిగిపోయిన ప్రతి ఒక్కరూ ‘వర్షం’లో త్రిష పాడుకున్నట్లుగా పాడుకుంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వానకు రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాటను గుర్తు చేసుకున్నారు. బయట కురుస్తున్న వానను చూస్తూ, వేడి వేడి పకోడీలు లాగించేస్తే ఎంత బాగుండు అనుకున్నారు. పాపం పకోడీలు తయారు చేయడం రాదు కదా. అందుకే తన తల్లిని గుర్తు చేసుకున్నారు. ‘‘మా అమ్మగారు చేసే పకోడీలు భలే టేస్టీగా ఉంటాయి. ప్చ్... ఇప్పుడామె హైదరాబాద్‌లో లేరు’’ అని రకుల్ అన్నారు. వర్షంలో లాంగ్ డ్రైవ్ వెళ్లడం ఇష్టమట. అది తీరే అవకాశం లేదు కాబట్టి జస్ట్ వాన చూస్తూ, ఎంజాయ్ చేసేశానని ఈ బ్యూటీ అన్నారు. -
అద్దెరి పోయే షికారు
సినిమాలో హీరోహీరోయిన్ జంటగా లాంగ్ డ్రైవ్‌కి దూసుకుపోవడం చూస్తుంటే.. అబ్బ అలాంటి కార్లు, బైక్‌లలో ఒక్కసారైనా రయ్‌మని రైడ్‌కి వెళ్లాలని కలల్లో తేలిపోతారు. అయితే, ఆ కల సాకారం చేసుకోవాలంటే రూ.లక్షలు, కోట్లలో పని. అందుకే అది మధ్య తరగతి మనిషికి తీరని కలగానే ఉండిపోతోంది. కానీ ఇప్పుడు ఆ కలను నిజం చేయడానికి నగరంలో ఓ అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. కార్లు, బైక్‌లు అద్దెకివ్వడమనేది కొత్త విషయం కాదు. అయితే అరుదైన, అత్యంత ఖరీదైన విదేశీ వాహనాలు సైతం అద్దెకు అందుబాటులోకి రావడం మాత్రం సిటీజనులకు కొత్తగా పరిచయమైంది. ఇటీవల గచ్చిబౌలిలో ఏర్పాటైన ‘డ్రైవ్ ఇన్ కేఫ్’ సిటీజనుల ఖరీదైన కలల రైడ్‌ను సాకారం చేస్తోంది. దేశంలోనే ఇది మొట్టమొదటి ఆటో మొబైల్ కేఫ్ అని నిర్వాహకులు చెబుతున్నారు. కార్లు, బైక్‌లు, సైకిళ్లూ... ఈ కేఫ్‌లో రూ.కోట్లు విలువ చేసే కార్లతో పాటు రూ.లక్షలు విలువ చేసే సైకిళ్లూ అద్దెకిస్తున్నారు. గంట, రోజుల చొప్పున కూడా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. ఆడీ, బీఎండబ్ల్యూ, బెంజ్, ఫెరారీ, ఓపెన్ టాప్.. లాంటి హైప్రొఫైల్ లగ్జరీ కార్లు అద్దెకివ్వడం ఇక్కడి విశేషం. టాటా నానో కార్ మొదలుకొని రెండు కోట్లు విలువ చేసే పార్చీ కెరేరా వరకు వీరి జాబితాలో ఉన్నాయి. అద్దెలు రోజుకి రూ.300 నుంచి రూ.30,000 వరకు ఉన్నాయి. అలాగే యాక్టివా బైక్ నుంచి ట్రయంఫ్ రాకెట్ వరకు రూ.300 నుంచి రూ.12 వేల అద్దెల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ.75,000 నుంచి రూ.3 లక్షలు ఖరీదున్న సైకిళ్లు సైతం అద్దెకిస్తున్నారు. త్వరలో విశాఖ, విజయవాడల్లోనూ.. వాహనం అద్దెకిచ్చే ముందు సెక్యూరిటీ కోసం లెసైన్స్, ఆధార్, క్రెడిట్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వాహనం నడిపే విధానం, ఇక్కడి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎలా నడపాలి.? ఇలా అన్ని నేర్పిస్తారు. బైక్ నడపడానికి తగ్గ జాకెట్, హెల్మెట్లు సైతం ఇస్తారు. త్వరలోనే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఈ కేఫ్ ప్రారంభించనున్నామని దీని ప్రమోటర్స్ అశ్విన్జైన్, ఖరార్ తాహెర్, నబెల్ హుస్సేన్, హుస్సేర్లు తెలిపారు. అంతే కాకుండా ఢిల్లీ, గోవా, బెంగళూర్, చెన్నై, జైపూర్, సిమ్లా, కోల్‌కతా నగరాల్లోనూ సైతం మూడు వేల కార్లు, 1500 బైక్‌లతో విస్తరిస్తున్నామన్నారు. ఎవరి బర్త్‌డేకి అయినా డోర్ తెరవగానే ఇంటి ముందు రేసింగ్ బైక్ లేదా ఫెరారీ కార్ ఉండి, దానిపై ఫ్లవర్ బొకే, కేక్‌తో సహా సినిమాల్లో లాగా సెట్ చేసి ఆశ్చర్యపరిచే గిఫ్ట్స్ కూడా వీరు అందుబాటులో ఉంచారు. తమకు కాల్ చేసి కాన్సెప్ట్, డేట్, టైం చెప్తే సరి.. వారు అనుకున్న ప్రకారం ఆశ్చర్యపరిచే గిఫ్ట్స్ పంపే అవకాశాలూ అందుబాటులో ఉన్నాయని దీని ప్రమోటర్స్ చెప్పారు. - శిరీష చల్లపల్లి -
'గర్ల్‌ఫ్రెండ్ కోసం కార్లు చోరీ చేశాడు'
న్యూఢిల్లీ : ప్రేయసి కోరితే ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధం అంటూ సినిమాలో హీరోలు డైలాగులు చెబుతుంటారు. అయితే నిజ జీవితంలో మనవాడు ప్రాణం కాదు కానీ... ప్రయాణం వరకైతే ఓకే అనుకున్నాడేమో, ప్రియురాలిని లాంగ్‌డ్రైవ్‌కి తీసుకెళ్లేందుకు ఏకంగా 21 కార్లు చోరీ చేశాడు. అదీ కేవలం రెండు నెలల వ్యవధిలోనే. దొంగతనాలతో ప్రేయసి మనసు దోచుకున్న ఈ ఢిల్లీ దొంగ చివరకు కటకటాల పాలుకాక తప్పలేదు. నిందితుడిని కీర్తినగర్కి చెందిన రవిత్యాగిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మొత్తం 21 కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ జిల్లా డీసీపీ రణ్వీర్ సింగ్ తెలిపారు. గత నెల 28న పోలీసు బృందం రమేశ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పికెట్ ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తుండగా హోండా సిటీ కారులో వెళుతున్న రవిత్యాగిపై అనుమానం వచ్చిందని, కారు కాగితాలు చూపించాల్సిందిగా కోరారని, అయితే వాటిని ఇవ్వకపోవటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గత నెల ఒకేరోజు మూడు కార్లు చోరీ చేసినట్టు అంగీకరించాడని చెప్పారు.