లాంగ్ డ్రైవ్ కు వెళ్లి.. ప్రమాదానికి గురై..
♦ టిప్పర్‌ను ఢీకొన్న కారు
♦ ఒకరి దుర్మరణం
♦ మరో ఆరుగురికి తీవ్రగాయాలు
మేడ్చల్: మద్యం మత్తులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన యుువకులు రోడ్డు ప్రవూదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వుండలం గాజులరావూరం వూర్కండేయునగర్‌కు చెందిన త్యాగాల వీరబాబు(22)క్యాబ్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్లు సారుుబాబు, శ్రీకాంత్, ప్రవీణ్, షణ్ముఖ, నారాయుణ, నవీన్ అతడికి స్నేహితులయ్యారు. వీరంతా సోవువారం అర్ధరాత్రి మద్యం తాగిన అనంతరం లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని భావించి సారుుబాబుకు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు (టీఎస్ 07 యుూబీ 6935)లో బయలుదేరారు.
మేడ్చల్ మీదుగా శామీర్‌పేట్ వైపు వెళ్తున్నారు. మేడ్చల్-శామీర్‌పేట్ రోడ్డులో కారులో అతివేగంగా వెళ్తుండగా వుండల పరిధిలోని కిష్టాపూర్ వద్ద ఉన్న వులుపులో మేడ్చల్ నుంచి శామీర్‌పేట్ వైపు వెళ్తున్న టిప్పర్ (ఏపీ 28 టీడీ 7453) బ్రేక్ వేయుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు దానిని ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న వీరబాబు(23) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కారు వెనుక భాగంలో కూర్చున్న షణ్ముఖ తలకు తీవ్రగాయూలు కావడంతో ఆయున పరిస్థితి విషవుంగా ఉంది. డ్రైవింగ్ చేస్తున్న సారుుబాబుతోపాటు వాహనంలో ఉన్న శ్రీకాంత్, ప్రవీణ్, నారాయుణ, నవీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వుృతదేహానికి మేడ్చల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిరమ్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దదిక్కును కోల్పోరుున కుటుంబం..
ప్రవూదంలో వుృతి చెందిన వీరబాబు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ. అతడి తండ్రి సత్తిబాబు టైలర్. సత్తిబాబు దంపతులకు ఓ కువూర్తెతో పాటు వీరబాబు సంతానం. వయసు పైబడిన వీరబాబు దంపతులు కుమారుడిపైనే ఆధారపడ్డారు. వీరబాబు పదేళ్లుగా నగరంలో ఉంటూ డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు.