త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఎంజీ హెక్టర్
ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.
ఎంజీ విండ్సర్
ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
హోండా సిటీ
రూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.
రెనాల్ట్ కైగర్
మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
మహీంద్రా స్కార్పియో ఎన్
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment