holiday season
-
USA:హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్
కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.అట్లాంటా,హూస్టన్లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా ఇయర్ ఎండింగ్లో అమెరికాలో కక్రిస్మస్తో పాటు న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. -
భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.ఎంజీ హెక్టర్ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.ఎంజీ విండ్సర్ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.హోండా సిటీరూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.రెనాల్ట్ కైగర్మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. -
సెలవులు ఎలా గడుపుతారు? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
సెలవులంటే ప్రతిఒక్కరికీ ఉత్సాహమే. ఒకప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్లి సెలవులను ఆస్వాదించేవారు. అయితే సెలవులను గడిపే తీరు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో మారిపోయింది. రానున్న క్రిస్మస్ సెలవుల సీజన్‌ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. న్యూఢిల్లీ: వినియోగదారులు గతంలో కంటే ఈ సెలవుల సీజన్లో ఎక్కువ అప్లికేషన్లు, డిజిటల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని సిస్కో నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో 85 శాతం మంది ప్రధానంగా బ్యాంకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ యాప్‌ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఉపయోగించుకుంటారని తెలిపింది. క్రిస్మస్, సెలవుల కాలంలో అప్లికేషన్లు, డిజిటల్ సేవల వినియోగాన్ని తెలుసుకోవడానికి యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్ సహా వివిధ దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 12,000 మంది పాలుపంచుకున్నారు. Cisco Survey: సిస్కో యాప్ డైనమిక్స్ సీజనల్ షాపింగ్ పల్స్ సర్వే ప్రకారం.. అప్లికేషన్లు, డిజిటల్ సేవలు ఇప్పుడు ఆనందదాయక సెలవులు/క్రిస్మస్లో ముఖ్యమైనవి అని 88 శాతం మంది అంగీకరిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్‌లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు. 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్ హోమ్ వంటి ఇంటర్నెట్తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్ యాప్‌లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా, వీడియో కాల్స్ సాధనాలను ఎంచుకున్నారు. చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్ యాప్‌లను, అదే నిష్పత్తిలో చివరి నిమిషంలో చెల్లింపులు, బదిలీలకై బ్యాంకింగ్, బీమా యాప్‌లను వాడతారు. 78 శాతం మంది వార్తలు, సమాచార–ఆధారిత యాప్‌లను, 88 శాతం మంది టేక్ అవే కోసం ఫుడ్ డెలివరీ సేవలను వినియోగిస్తారు’ అని సర్వేలో తేలింది. -
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ లో దేశీ సంస్థల హవా
-
రాహుల్ ఫారిన్ ట్రిప్.. కుష్బు కామెంట్స్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధానిలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్ని రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రం-రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేసింది. వ్యక్తగత పర్యటన నిమిత్తం రాహుల్ విదేశాలకు వెళ్లారు. ఆదివారం ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇటలీలోని మిలన్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రైతుల పట్ల కాంగ్రెస్ నాయకుడి ప్రేమ ఏపాటిదో స్పష్టంగా తెలుస్తోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు కుష్బు రాహుల్ విదేశీ పర్యటనపై మండి పడ్డారు. ఈ మేరకు కుష్బు ‘రైతుల ఉద్యమం గురించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుంటున్నారా.. నిజమా..? మీకు రైతుల పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు మాట్లాడతారు.. అదే నిజమైతే మీరు వారితో కలిసి వీధుల్లో ఉండాలి కానీ.. ఇలా విదేశాల్లో ఎంజాయ్ చేయడం ఏంటి?’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘రాహుల్ గాంధీ నుంచి నేను ఇంతకు మించి ఇంకేమైనా ఆశించగలనా.. ఖచ్చితంగా కాదు. అసలు నేను ఆయన వ్యక్తిగత విదేశి పర్యటన వార్త గురించే ఎదురు చూస్తున్నాను. ఆయన మాటలన్ని ఉత్తి డ్రామా. కొత్తగా ఏం లేదు.. అంతా పాతదే’ అంటూ ట్విట్టర్ వేదికగా కుష్బు రాహుల్ తీరును ఎండగట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకారం ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం కొద్ది రోజుల పాటు విదేశాల్లో గడిపేందుకు వెళ్లారు. So much of noise was made for farmers protest by the opp, where is #RG now? Short holiday? Seriously? If you are so concerned about the farmers, you should have been out there on the streets with them n not holidaying. #RGTumSeNaHoPaayega @CTRavi_BJP @BJP4India @blsanthosh — KhushbuSundar ❤️ (@khushsundar) December 27, 2020 Oh! Did I expect #RG do anything else? Definitely not. In fact I was looking forward to the news of his travel for a short holiday. All talks and only drama. Nothing new. Same old story. — KhushbuSundar ❤️ (@khushsundar) December 27, 2020 -
రికార్డు సృష్టించిన అమెజాన్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రికార్డు సృష్టించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి 2 బిలియన్ డాలర్ల లాభాలను(రూ.12,100 కోట్లు) ఆర్జించినట్టు అమెజాన్ రిపోర్టు చేసింది. హాలిడే సీజన్ నేపథ్యంలో తన ప్రైమ్ ఫాస్ట్-షిప్పింగ్ క్లబ్ ద్వారా మిలియన్ కొద్దీ కస్టమర్లను చేర్చుకోవడం, అమెరికా పన్ను చట్టం మార్పులు అమెజాన్‌కు సహకరించాయి. కంపెనీ రికార్డులు సృష్టించడంతో, షేర్లు సైతం లాభాలు వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది కొనుగోలు చేసిన హోల్ ఫుడ్స్ మార్కెట్లో ధరలు కోత, గ్రోసరీ విక్రయాలకు సహకరించినట్టు కూడా కంపెనీ పేర్కొంది. త్వరగా రవాణా, వెబ్సైట్ యూజర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా టెలివిజన్ షోలు, కొత్త టెక్నాలజీలు, ప్రైమ్ మెంబర్లను ఎక్కువ వెచ్చింపులకు ఆకర్షించడం వంటివీ కంపెనీకి సహకరించాయి. అలెక్సా డిజిటల్ అసిస్టెంట్ ప్రదర్శన అద్భుతంగా ఉందని కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. ఇతర కంపెనీలు, డెవలపర్లు అలెక్సాను స్వీకరించడం పెంచి తాము ఒక ముఖ్యమైన స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. కంపెనీ నికర ఆదాయం కూడా రెండింతలు పెరిగింది. డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో క్వార్టర్లో 1.86 బిలియన్ డాలర్ల(రూ.11,923 కోట్లు) నికర ఆదాయం ఆర్జించినట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్‌కు ఇది మరో సంచలన క్వార్టర్ అని జీబీహెచ్ ఇన్సైట్స్ విశ్లేషకుడు డేనియల్ ఐవ్స్ చెప్పారు. అన్ని ఈ-కామర్స్ హాలిడే సీజన్ సేల్స్‌లో సుమారు 50 శాతం సంపాదించినట్టు పేర్కొన్నారు. విక్రయాలు కూడా అంచనాలను బీట్ చేసి 38 శాతం పెరిగి 60.5 బిలియన్ డాలర్ల(రూ.3.8 లక్షల కోట్లు)కు పెరిగాయి. రెవెన్యూల పరంగా కూడా ఈ క్వార్టరే అత్యధికమని కంపెనీ తెలిపింది. ప్రైమ్‌కు గత క్వార్టర్లో వారంలో 4 మిలియన్లకు పైగా సైన్-అప్స్ వచ్చాయని, సబ్స్క్రిప్షన్ ఫీజులు కూడా 49 శాతం పెరిగి 3.2 బిలియన్ డాలర్లు(రూ.20,516 కోట్లు) వచ్చినట్టు అమెజాన్ పేర్కొంది. ఈ క్వార్టర్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని భావిస్తున్నామని, ఇటీవలే నెలవారీ ప్రైమ్ ప్లాన్స్ ఫీజులను అమెజాన్ పెంచిందని ఓ అనాలిస్ట్ చెప్పారు. 60 మిలియన్‌కు పైగా అమెరికన్ ప్రజలు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నట్టు అంచనావేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రకటనలు, ఇతర రెవెన్యూలు కూడా 62 శాతం పెరిగి 1.74 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కంపెనీ లాభాల మార్జిన్ పెరుగడానికి ప్రధాన కారణం అడ్వర్టైజింగ్లేనని అమెజాన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్స్కీ అన్నారు. -
చెన్నై-హైదరాబాద్ కు స్పైస్ జెట్ కొత్త నాన్ స్టాప్ ఫ్లైట్!
ఈ నెల 17 నుంచి సేవలు ప్రారంభం చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సమ్మర్ హాలిడే సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని చెన్నై-హైదరాబాద్ మార్గంలో ఈ నెల 17 నుంచి నాల్గవ కొత్త నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను నడపనున్నది. దీని సేవలు శనివారం మినహా అన్ని రోజులు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. -
ప్రేమమూర్తి.
జిల్లా అంతటా వేడుకలకు సన్నాహాలు వెలుగులు విరజిమ్ముతున్న చర్చిలు బుధవారం రాత్రి నుంచే ప్రార్థనలు మార్మోగుతున్న యేసు కీర్తనలు అంధకారం అలముకున్న లోకానికి ఆయన వేగుచుక్క అయ్యాడు. అమృత వాక్కులతో వెలుగులు ప్రసరింపజేశాడు. దీనులను లాలించి అక్కున చేర్చుకున్నాడు. తన ప్రాణాలకు హాని తలపెట్టిన వారికి సైతం ప్రేమను పంచాడు. దయామయుడైన దైవకుమారుడు కన్ను తెరిచిన క్రిస్మస్ పర్వదినం నేడు. ఆ కరుణామయుడిని పూజించేందుకు జిల్లాలోని అన్ని చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. - కాజీపేట క్రిస్మస్ సంబరాలకు జిల్లా సిద్ధమైంది. కరుణామయుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని పునీతులవ్వాలని క్రీస్తు ఆరాధకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే. ప్రతీ చర్చినీ అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు ఈ నెలంతా ‘హాలీడే సీజన్’, ‘సీజన్ ఆఫ్ గివింగ్’, ‘సీజన్ ఆఫ్ జాయ్’గా అభివర్ణిస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన ఆ మానవతామూర్తి వాక్కులు ఇచ్చే స్ఫూర్తిని హృదయాల్లో నింపుకుంటారు. దీన్ని ‘స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్’గా పిలుస్తారు. వెలుగులు నింపే క్రిస్మస్ ట్రీలు.. స్టార్లు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల ఇళ్లన్నీ క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో మెరిసిపోతున్నాయి. చర్చిల్లో పశువుల పాకలు ఏర్పాటు చేసి యేసు జన్మించిన దృశ్యాన్ని బొమ్మలతో అందంగా అలంకరిస్తున్నారు. జిల్లాలో మూడువేలకు పైగా పెద్ద చర్చిలు, ఆరువేల వరకు చిన్న, చిన్న చర్చిలు ఉంటాయని అంచనా. తొమ్మిదివేల మంది పాస్టర్లు జిల్లాలోని వివిధ చర్చిలను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా గురువారం జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. కెథడ్రల్, సెయింట్ జోసఫ్, బాప్టిస్టు, ఒమేగా అల్ఫా, బైబిల్ మిషన్, జాన్ మార్కండేయ తదితర శాఖల ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాజీపేటలోని కెథడ్రల్ చర్చి ఆవరణలో వరంగల్ మేత్రాసనం పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో రోమన్ కేథలిక్‌లు క్రిస్మస్ వేడుకలను భారీస్థాయిలో నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైన వేడుకల్లో గురువులు, బ్రదర్లు, సిస్టర్లు, పాస్టర్లు చర్చిల్లో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. బిషప్ డానియల్ కళ్యాణ్, ఫాదర్ ఏరువా చిన్నపరెడ్డి, జాన్మార్కండేయ, బ్రదర్ పాల్సన్రాజ్, ప్రకాష్‌రాజ్, కురియన్ల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్రిస్మస్ ఫీస్ట్ నిర్వహించారు. చర్చి సభ్యులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. సేవా కార్యక్రమాలు క్రిస్మస్ పండుగకు గుర్తుగా పేదలు, వికలాంగులు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంచిపెట్టారు. ఇక గురువారం చర్చిల్లో స్త్రీలు, చిన్నపిల్లలు, యువతకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల సంఘం అధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గురువారం జిల్లాలోని అన్ని చర్చిల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ఆరాధన నిర్వహించనున్నారు. -
హ్యాపీ ‘ఆన్లైన్’ షాపీ
పండగ సీజన్ వచ్చిందంటే దుస్తులు, ఇతర వస్తువులు కొనడానికి ఆపసోపాలు పడాల్సి వస్తుంది. షాపింగ్‌కి వెళ్లి, దుకాణాలన్నీ కాళ్లరిగేలా తిరగాలి. నచ్చిన వస్తువులు, దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కొనుక్కుని తిరిగి రావాలి. గ్రామీణులైతే షాపింగ్ కోసం దూరాభారమైనా, ఖర్చులు భరించి సమీపంలోని పట్టణాలకు వెళ్లాలి. ఈ కష్టాలన్నింటికీ ఇప్పుడు చక్కని పరిష్కారం దొరికింది. అదే ఆన్లైన్ షాపింగ్.. ముంగిట్లో వ్యాపార ప్రపంచం దర్శనం. పిఠాపురం :ఆన్లైన్ షాపింగ్‌పై ఇప్పుడు గ్రామీణులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్లల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ పొంది ఒక్క క్లిక్‌తో ప్రపంచంలోని ఏ వస్తువునైనా కొనేస్తున్నారు. గుండు సూది నుంచి గృహాల వరకు ఒకేచోట ప్రత్యక్షం కావడంతో కోరిన వస్తువును ఇంటికి తెచ్చుకుంటున్నారు. డబ్బు, శ్రమను ఆదాచేసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ విధానం పట్టణాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు గ్రామాల్లోనూ సెల్‌ఫోన్, కంప్యూటర్ల వినియోగదారులు పెరిగారు. సెల్‌ఫోన్లలోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో యువత ఎంచక్కా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. అలాగే పాత వస్తువులు అమ్ముకోవాలన్నా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనాలు ఆన్లైన్ షాపింగ్ వల్ల సమయం కలిసి వస్తుంది. దుకాణాల వెంట తిరగనక్కరలేదు. ప్రయాణ ఖర్చులు, అవస్థలూ తప్పుతాయి. ఇంటి వద్దే ఉండి కంప్యూటర్లోనో, సెలఫోన్లోనో నెట్ ఆన్‌చేసి వెబ్సైట్లలోని వస్తువులను చూసుకోవచ్చు. ఇంటిల్లిపాదీ చూసి నచ్చిన వస్తువును ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ శాతం కంపెనీలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. దీనివల్ల బహిరంగ మార్కెట్లో కంటే ఆన్లైన్లో వస్తువులు చౌకగా లభిస్తున్నాయి. క్రెడిట్, లేదా డెబిట్ కార్డులు ఉపయోగించి వస్తువులను కొనుక్కోవచ్చు. త్వరగా ఇంటికి వస్తాయి కూడా. కొన్ని కంపెనీలు ఉచిత డెలీవరి సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు వస్తువులో లోపాలు తలెత్తితే మార్చుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి. స్నాప్‌డీల్, ప్లిప్‌కార్ట్, అమోజన్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్లైన్ వ్యాపారంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అనర్థాలు లేకపోలేదు ఆన్లైన్ షాపింగ్‌పై అవగాహన ముఖ్యం. వాటి గురించి తెలి యకుండా షాపింగ్ చేస్తే డబ్బు వృథాగా పోతోంది. నాసిరక వస్తువులు ఇంటికి వస్తాయి. మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఆన్లైన్లో షాపింగ్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ముందుగా నమ్మకమైన సైట్‌ను ఎంచుకోవాలి. చిన్న వస్తువులు, తక్కువ ధర ఉండే వాటిని కొనడం ప్రారంభించాలి. అలవాటై ఆ కంపెనీపై నమ్మకం వచ్చే వరకు అప్రమత్తత అవసరం. కొనే వస్తువు పూర్తి వివరాలు చూసుకుని బయటి మార్కెట్లో ధరతో పోల్చి చూడాలి. వారంటీ, గ్యారంటీ వివరాల విషయంలో జాగ్రత్త పాటించాలి. వస్తువు కొనే ముందు ఒకటికి రెండుసార్లు కంపెనీ గురించి తెలుసు కోవాలి. మరమ్మతులకు గురైతే ఆ కంపెనీలు ఏయే చర్యలు తీసుకుంటాయో ముందుగా తెలుసుకోవాలి. కొన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత రిపేరైతే ఆ కంపెనీల షాపులు దగ్గరలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. మోసం జరుగుతున్నట్టు గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలి. -
దేశీ ఖర్చు.. విదేశీ టూరు
సెలవుల సీజన్లో విహారాల జోరు రెండుమూడు రోజులకు విదేశీ ప్యాకేజీలు స్థానిక టూర్ల బదులుగా వీటికే ఓటేస్తున్న తీరు ఏ టూరుకైనా ప్రయాణ బీమా ఉండాల్సిందే! ఇది సెలవుల సీజన్. క్రిస్మస్, న్యూ ఇయర్, ఆ వెంటే సంక్రాంతి అన్నీ వరసగా వచ్చేస్తున్నాయి. మరి సెలవులకు ఎక్కడికెళ్లాలి? సెలవులంటే మరీ ఎక్కువ రోజులేమీ ఉండవు కదా! ఈ చోటా బ్రేక్ ఎక్కడ తీసుకోవాలి? కాకపోతే సెలవుల కాన్సెప్ట్ ఇపుడు మారింది. 3-4 రోజులు దొరికితే... ఎంచక్కా విదేశాలకు చెక్కేసే ట్రెండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఎయిర్‌లైన్ సంస్థలూ డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. వీటి వివరాలే... ఈ వారం కథనం... ఇంతకుముందు సెలవులొచ్చాయంటే... కుటుంబాలకు సరదాగా గడపడానికి మొదట గుర్తుకొచ్చేవి ఊటీ, కేరళే. యువతీయువకులకైతే గోవా. కాకపోతే ఆదాయాలు గణనీయంగా పెరగటం, బడ్జెట్ ఎయిర్‌లైన్స్ రావటంతో... ఇపుడు అదే ఖర్చుతో థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాలు చుట్టివచ్చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విమానంలో కేరళ, గోవాలకు వెళ్లి రెండ్రోజులు ఉండాలంటే కనీసం రూ. 20 నుంచి రూ. 30 వేలదాకా ఖర్చవుతోంది. అదే ఖర్చుతో ఇప్పుడు బ్యాంకాక్‌లో నాలుగు రోజులు ఉండి వచ్చే వీలుండటంతో... రెండు మూడు రోజులు సెలవులు దొరికితే చాలు... విదేశాలను చుట్టి వచ్చేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ధర పెరిగితే... టూర్ తగ్గుతుంది డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణతతో విదేశీయానం కొద్దిగా భారమైనా విదేశాలకు వెళ్లడానికి యువత ఏ మాత్రం వెనకాడటం లేదు. అవసరమైతే రోజుల సంఖ్యను తగ్గించుకుంటామే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోబోమని వారు చెబుతున్నట్లు యాత్రా డాట్ కామ్ తన సర్వేలో పేర్కొంది. రూపాయి కోలుకునే దాకా ఆగే పరిస్థితి లేదని, గతంలో వారం రోజులు గడిపితే ఇప్పుడు నాలుగైదు రోజులు మాత్రమే విదేశాల్లో ఉంటామని వారు చెబుతున్నారు. అంతేకాదు! పెరిగిన భారాన్ని భర్తీ చేసుకోవడానికి ఫైవ్‌స్టార్ హోటల్‌కు బదులు త్రీస్టార్, బడ్జెట్ హోటల్స్‌లో దిగడం, షాపింగ్‌ను సాధ్యమైనంతవరకు తగ్గించడం వంటి పొదుపు చర్యలు చేపడుతున్నట్లు యాత్రా డాట్ కామ్ పేర్కొంది. ప్రత్యేక చోటా ప్యాకేజీలు... విదేశాలకు వెళ్లే టూరిస్టుల కోసం ఇపుడు రెండు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీలను కూడా ట్రావెల్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఎక్స్పీడియా అయితే రెండు రాత్రులు, మూడు రోజుల దుబాయ్ పర్యటనకు రూ. 28,000 నుంచే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అలాగే మేక్ మై ట్రిప్, యాత్రా డాట్ కామ్ వంటి ట్రావెల్సైట్స్ విమాన టిక్కెట్లతోపాటు, హోటల్ బుకింగ్స్ చేసుకుంటే 30 నుంచి 40 శాతందాకా డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా రెండు మూడు నెలలు ముందుగా బుక్ చేసుకునే టికెట్స్‌పై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రయాణ బీమా అవసరమా? అసలు విదేశాలకు విమాన ప్రయాణాలు చేసేటపుడు ప్రయాణ బీమా అవసరమా? ఇది చాలామందికి కలిగే సందేహం. నిజానికి బీమా మనకు రిస్క్ లేకుండా చేసేది. విదేశీ పర్యటనల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి... అక్కడ అనారోగ్యం తలెత్తినా, సామగ్రి పోయినా మనను ఆదుకునేది బీమానే కాబట్టి ఇది తప్పనిసరి. బీమా కంపెనీలిపుడు విదేశీ పర్యటనలకే కాకుండా దేశీయ పర్యటనలకూ బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఈ పాలసీలు చాలా తక్కువ ప్రీమియానికే అనేక ప్రయోజనాలనందిస్తాయి. విమానం ఆలస్యం కావటం నుంచి... మెడికల్, దొంగతనం వంటి అనేక అంశాలకు బీమా ఉంటుంది. ప్రయాణించే రోజులు, దేశాన్ని బట్టి ప్రీమియం మారుతుంది. సాధారణంగా వారం రోజుల పర్యటనకు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రీమియం వసూలు చేస్తారు. కవరేజీ దేనికి ఉంటుందంటే... చికిత్స వ్యయం: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. లేదా ప్రమాదం సంభవించి ఆసుపత్రిపాలు కావచ్చు. విదేశాల్లో చికిత్స మనం భరించే స్థాయిలో ఉండదు. అదే బీమా ఉంటే ఈ వ్యయాన్ని కంపెనీయే భరిస్తుంది. సామాన్లు పోతే: ప్రయాణంలో అప్పుడప్పుడు సామాన్లు పోగొట్టుకోవడం జరుగుతుంది. లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు బ్యాగేజీ మారిపోవడం వంటివి కూడా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో బ్యాగేజీ సరైన సమయానికి రాక కొత్త డ్రెస్సులు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీ అక్కరకు వస్తుంది. పర్యటన రద్దయితే...: దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని రిజర్వేషన్లు, హోటల్ గదులు వంటివి ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. ప్రతికూల వాతావరణం ఉంటే విమాన సర్వీసులు రద్దు, ప్రయాణం నిలిచిపోవడం లేదా కొంత ఆలస్యం కావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ముందుగా చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నష్టాన్ని బీమా కంపెనీయే భరిస్తుంది. ఆలస్యమయితే...: ఇటీవల విమానాలు, రైళ్లు షెడ్యూలు టైమ్ కన్నా ఆలస్యం కావడమనేది సాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాల్లో కూడా బీమా కంపెనీలు నష్టపరిహారాన్ని చెల్లిస్తాయి. విమానం అయిదారు గంటలు మించి ఆలస్యమైతే బీమా కంపెనీలు నష్టపరిహారం ఇస్తున్నాయి. వీసాపోతే...: విదేశాల్లో వీసా పోతే తిరిగి ఇండియా రావడానికి ఉండదు. అప్పటికప్పుడు మళ్లీ వీసా తీసుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఇలాం టి సమయాల్లో కూడా ట్రావెల్ బీమా ఉపయోగపడుతుంది. అలాగే ఏమైనా విలువైన వస్తువులు పోగొట్టుకుంటే వాటికి కూడా బీమా రక్షణను పొందవచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం