కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.
అట్లాంటా,హూస్టన్‌లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్‌లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.
కాగా ఇయర్ ఎండింగ్‌లో అమెరికాలో కక్రిస్‌మస్‌తో పాటు న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment