
చెన్నై-హైదరాబాద్ కు స్పైస్ జెట్ కొత్త నాన్ స్టాప్ ఫ్లైట్!
ఈ నెల 17 నుంచి సేవలు ప్రారంభం
చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సమ్మర్ హాలిడే సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని చెన్నై-హైదరాబాద్ మార్గంలో ఈ నెల 17 నుంచి నాల్గవ కొత్త నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను నడపనున్నది. దీని సేవలు శనివారం మినహా అన్ని రోజులు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.