ఉద్యోగులకు రూ.160 కోట్లు చెల్లించిన స్పైస్‌జెట్ | Spicejet Settling Employees Rs 160 Crore PF | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు రూ.160 కోట్లు చెల్లించిన స్పైస్‌జెట్

Published Fri, Dec 13 2024 9:00 PM | Last Updated on Fri, Dec 13 2024 9:08 PM

Spicejet Settling Employees Rs 160 Crore PF

ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్లు స్పష్టం చేసింది. అనేక సంఘాలను ఎదుర్కొన్న తరువాత కంపెనీ రూ.3000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను ఉపయోగించి అన్ని రకాల పెండింగ్ బిల్లులకు సంస్థ క్లియర్ చేస్తోంది.

చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కంపెనీ చెల్లించడంతో.. సంస్థ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పిఎఫ్ బకాయిల క్లియరెన్స్‌ను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. స్పైస్‌జెట్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement