సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో భవిష్య నిధి (పీఎఫ్) ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక వెసులుబాటను హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 57,445 మంది వినియోగించుకున్నారని పీఎఫ్ కమిషనర్ వీకే శర్మ తెలిపారు. ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోజన కింద తెలంగాణలో 11 వేల సంస్థలు వస్తాయని పేర్కొన్నారు. అందులోని ఉద్యోగుల పీఎఫ్.. కంపెనీ తరఫున మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిచేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 4805 కంపెనీల ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 15 వేల లోపు జీతం కలిగి100 మంది లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీల, ఉద్యోగుల తరఫున పీఎఫ్ మొత్తం కేంద్రమే వేస్తోందని చెప్పారు.
మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నగదు
పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిస్కరిస్తున్నామని, పీఎఫ్ దరఖాస్తు చేసుకున్నవారికి మూడు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తున్నామని పీఎఫ్ కమిషనర్ చంద్రశేఖర్(హైదరాబాద్) వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేల 647 మంది ఉద్యోగులు పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని. వారికి 258 కోట్ల రూపాయల అకౌంట్ లో వేశామన్నారు. పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసినవారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment