కుమార్తె మధురిమతో అనీష
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు.
కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్‌పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్‌పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది.
మహిళల ప్రయాణం
‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా.
వారం దాటాకే సమాచారం
రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు.
భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష.
Comments
Please login to add a commentAdd a comment