madhurima
-
బైక్‌పై తల్లీకూతురు..కేరళ To కాశ్మీర్
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు. కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్‌పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్‌పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది. మహిళల ప్రయాణం ‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా. వారం దాటాకే సమాచారం రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష. -
ఆ పేరుతో నన్ను పిలవొద్దు: హీరోయిన్
హీరోయిన్ మధురిమ పేరు మార్చుకుంది. ఇక నుంచి తన పేరు నిరా అని చెప్పింది. అవకాశాలు తగ్గడం వల్లే పేరు మార్చుకుందన్న వాదనలను ఆమె తోసిపుచ్చింది. తన పేరు మార్చుకోవడానికి గల కారణాలను వెల్లడించింది. 'నిరా అనేది నా ముద్దు పేరు. మధురిమ నా అఫీషియల్ నేమ్. తెరపై కూడా ఇదే పేరుతో నటించా. అయితే మధురిమ పేరుతో మరో నటి(తులి) ఉండడంతో గందరగోళం ఏర్పడింది. ఒకసారి నా ఇంటర్వ్యూను ఆమె ఫొటోలతో ప్రచురించారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్స్ ఉండడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో నా తెర పేరును మార్చుకోవాల్సి వచ్చింది. నా పాత పేరు మధురిమతో ఇక ఎటువంటి సంబంధం ఉండకూదని అనుకుంటున్నా. అందరూ నన్ను నిరా అని పిలవడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని మధురిమ వివరించింది. తెలుగులో తనకు సరైన విజయాలు దక్కలేదని తెలిపింది. అందుకే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నానని చెప్పింది. పేరు మార్పుతో కెరీర్ ఊపందుకుంటుందని భావిస్తున్నానని అంది. 'ఆ ఒక్కడు'తో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ సరదాగా కాసేపు, ఆరెంజ్, షాడో, వేట, కొత్త జంట, గ్రీన్ సిగ్నల్, టెంపర్, దోచయ్ తదితర సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన 'ఒన్ నైట్ స్టాండ్' సినిమా మే 6న విడుదలైంది. -
అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్
చెన్నై: హీరోయిన్ మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది. హిందీ సినిమా 'అజర్' కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటన్ లో నెలరోజుల పాటు జరగనున్న షూటింగ్ లో ఆమె పనిచేయనుంది. 'దర్శకుడు టోనీ డిసౌజాకు మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. టోనీ భార్య ఆమెకు మంచి ఫ్రెండ్ కావడంతో ఈ అవకాశం దక్కింద'ని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమా రూపకల్పన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందని వెల్లడించాయి. 'అజర్' పాత్రను ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నారు. ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రీ, హ్యుమా ఖరేషీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సరదాగా కాసేపు, కొత్త జంట, షాడో, గ్రీన్ సిగ్నల్, దోచేయ్ తదితర సినిమాల్లో మధురిమ నటించింది. -
జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన హీరోయిన్
-
మే 14న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మృణాల్ సేన్ (ఫిల్మ్ మేకర్), మధురిమ (నటి) ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 9. విద్యాసంబంధ విషయాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ఆగిపోయిన రిసెర్చి వర్క్ చకచకా ముందుకెళుతుంది. డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తారు. పోలీసులు, మిలిటరీ వాళ్లు తదితర యూనిఫాం ధరించే ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించి, అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంది. భూములు, భవనాలు కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఆస్తులను బాగా అభివృద్ధి చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. కుజుడి ప్రభావం వల్ల రకరకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలు ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 1,5,6,9, లక్కీ కలర్స్: గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్; లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్రవారాలు. సుదర్శన హోమం చేయించుకోవటం, తోబుట్టువులకు సాయం చేయటం, రక్తదానం చేయటం మంచిది. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
చిన్న పాత్ర అయినా చేస్తా
ప్లీజ్ ఒక్కవేషం ఇవ్వండి.. మొదట్లో ఏ హీరోయిన్ అయినా అనే మాటే ఇది. ఆ తరువాత ఒక్క చిత్రం క్లిక్ అయితే చాలు.. ముందు చేసేపని పారితోషికం పెంచేయడం. ఆ తరువాత తెలియందేముంది. పాత్ర బాగుండాలి. అది కావాలి, ఇది కావాలి అంటూ నిర్మాతలను పిండడం మొదలెడుతారు. ఇది ఏ ఒక్క హీరోయిన్ గురించో ప్రత్యేకంగా చెప్పడం కాదు. హీరోయిన్ల విషయంలో జరిగిన, జరుగుతున్న, జరగనున్న తంతే ఇది. ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే పెద్ద దర్శకుల చిత్రాల్లో చిన్న పాత్ర వచ్చినా చేయడానికైనా రెడీ అంటోంది నటి మధురిమ. పేరు ఎంత మధురమో ఆమె దంత అందాలు కూడా.. ఇంతకుముందు తమిళంలో ఈ భామ సేందు పోలామా, ఇపికో చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత ఏమైందో ఏమో కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు అవకాశాల కోసం వేట మొదలెట్టింది. రెండు చిత్రాల్లో మెరిసి మాయమైపోయారే అన్న ప్రశ్నకు మధురిమ బదులిస్తూ నిజం చెప్పాలంటే తన తొలి చిత్రం విడుదలకు ముందు పలు అవకాశాలు వచ్చాయని అంది. అయితే లా పూర్తి చేయాలన్న నిర్ణయంతో ఆ అవకాశాలను అంగీకరించలేకపోయానని వివరించింది. ప్రస్తుతం న్యాయవాదిగా పట్టా పొందాను.. ఇకపై పూర్తిగా నటనపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తనను వెతుక్కుంటూ వచ్చే ప్రతి అవకాశాన్నీ అందుకుంటానని అంది. సినిమాలో తన కల నెరవేరే వరకు నటిస్తూనే ఉంటానని పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నానని తెలిపింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. తన పాత్ర చిన్నదే అయినా పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుల చిత్రాల్లో చిన్న వేషం అయినా నటించడానికి తాను సిద్ధమని మధురిమ అంటోంది. ముందు రంగ ప్రవేశం చేస్తే ఆ తరువాత అల్లుకుపోతాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టుందీ బ్యూటీ. -
సమస్యలతో పోరు
నందు, మధునందన్, అభిషేక్ మహర్షి, మధురిమ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘క్లోజ్‌ఫ్రెండ్స్’. అరుణ్ పవార్ దర్శకుడు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత. మారుతి టీమ్ వర్క్స్, సినిమా లవర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రచార గీతాన్ని మారుతి చేతుల మీదుగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మలయాళ చిత్రానికి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం. అరుణ్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మారుతి తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న ప్రాణమిత్రులు... ఆ సమస్యలతో పోరు సాగించి, ఎలా బయటపడ్డారనేది ప్రధానాంశమనీ, పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. తన కెరీర్లోనే ఇదొక ప్రత్యేకమైన చిత్రమని నందు అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
శ్రీకాంత్, తరుణ్ 'వేట' మూవీ స్టిల్స్
-
తప్పు ఎవరిది?
వంశీ సినిమా ‘సరదాగా కాసేపు’ కథానాయిక మధురిమ గుర్తుంది కదూ! తను తాజాగా ‘సేందు పోలామ్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్ర దర్శక నిర్మాతలకు మధురిమకు మధ్య యుద్ధం నడుస్తోంది. ఆ కథ ఏంటంటే.. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించి న్యూజి ల్యాండ్‌లో 50 రోజుల పాటు భారీ షెడ్యూల్ చేశారు. ఈ షెడ్యూల్లో మధురిమ సకాలంలో షూటింగ్‌కి హాజరు కాకపోవడంతో ఇబ్బందులపాలయ్యామని దర్శకుడు అనిల్ కుమార్, నిర్మాత శశి ఆరోపిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే, ఆ సమయానికి రాకుండా తన ఇష్టం వచ్చినట్లు మధురిమ వచ్చేదని అనిల్ వాపోతున్నారు. న్యూజిల్యాండ్‌లో ఓ అధునాతన కెమెరాని అద్దెకి తీసుకున్నామని, అక్కడి టెక్నీషియన్ని నియమించుకున్నామని అనిల్ అన్నారు. అయితే, మధురిమ సహకరించకపోవడంవల్ల అనుకున్న రోజుల్లో పూర్తి చేయలేకపోయామని చెప్పారు. మధురిమ కథనం వేరేలా ఉంది. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా షూటింగ్స్‌కి వెళ్లనని, కానీ, వీసా వ్యవహారాలు చూసే వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన తల్లి న్యూజిల్యాండ్‌కి రాలేకపోయారని మధురిమ అన్నారు. ఒంటరిగా వెళ్లిన తనకు పర్సనల్ అసిస్టెంట్‌ని కూడా సమకూర్చలేదని, తన పారితోషికంలో పది శాతం అడ్వాన్స్ అయినా ఇవ్వలేదని మధురిమ తెలిపారు. ఈ చిత్రం కారణంగా తను కమిట్ అయిన వేరే చిత్రాలకు ఇబ్బంది ఏర్పడిందని, 90 శాతం సినిమా పూర్తయినా పారితోషికం గురించి మాట్లాడకపోవడంతో, ప్రశ్నించానని ఆమె పేర్కొన్నారు. పారితోషికం గురించి అడిగినందుకే తనను ‘క్రిమినల్’లా చిత్రిస్తున్నారని కూడా వాపోయారు. అనిల్ మాటలు వింటే అతనిదే కరెక్ట్ అనిపిస్తుంది. మధురిమ మాటలు వింటే తన వైపే న్యాయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి.. తప్పెవరిదో? -
ఐటమ్ సాంగ్ చేస్తోన్న మధురిమ