అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్ | Madhuurima turns assistant director for 'Azhar' | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్

Published Wed, Jul 15 2015 11:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్

చెన్నై: హీరోయిన్ మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది. హిందీ సినిమా 'అజర్' కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటన్ లో నెలరోజుల పాటు జరగనున్న షూటింగ్ లో ఆమె పనిచేయనుంది.

'దర్శకుడు టోనీ డిసౌజాకు మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. టోనీ భార్య ఆమెకు మంచి ఫ్రెండ్ కావడంతో ఈ అవకాశం దక్కింద'ని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమా రూపకల్పన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందని వెల్లడించాయి.

'అజర్'  పాత్రను ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నారు. ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రీ, హ్యుమా ఖరేషీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సరదాగా కాసేపు, కొత్త జంట, షాడో, గ్రీన్ సిగ్నల్, దోచేయ్ తదితర సినిమాల్లో మధురిమ నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement