Madhuurima
-
ఆ పేరుతో నన్ను పిలవొద్దు: హీరోయిన్
హీరోయిన్ మధురిమ పేరు మార్చుకుంది. ఇక నుంచి తన పేరు నిరా అని చెప్పింది. అవకాశాలు తగ్గడం వల్లే పేరు మార్చుకుందన్న వాదనలను ఆమె తోసిపుచ్చింది. తన పేరు మార్చుకోవడానికి గల కారణాలను వెల్లడించింది. 'నిరా అనేది నా ముద్దు పేరు. మధురిమ నా అఫీషియల్ నేమ్. తెరపై కూడా ఇదే పేరుతో నటించా. అయితే మధురిమ పేరుతో మరో నటి(తులి) ఉండడంతో గందరగోళం ఏర్పడింది. ఒకసారి నా ఇంటర్వ్యూను ఆమె ఫొటోలతో ప్రచురించారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్స్ ఉండడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో నా తెర పేరును మార్చుకోవాల్సి వచ్చింది. నా పాత పేరు మధురిమతో ఇక ఎటువంటి సంబంధం ఉండకూదని అనుకుంటున్నా. అందరూ నన్ను నిరా అని పిలవడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని మధురిమ వివరించింది. తెలుగులో తనకు సరైన విజయాలు దక్కలేదని తెలిపింది. అందుకే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నానని చెప్పింది. పేరు మార్పుతో కెరీర్ ఊపందుకుంటుందని భావిస్తున్నానని అంది. 'ఆ ఒక్కడు'తో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ సరదాగా కాసేపు, ఆరెంజ్, షాడో, వేట, కొత్త జంట, గ్రీన్ సిగ్నల్, టెంపర్, దోచయ్ తదితర సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన 'ఒన్ నైట్ స్టాండ్' సినిమా మే 6న విడుదలైంది. -
టూపీస్ ట్రిక్ సక్సెస్
హీరో అయినా, హీరోయిన్ అయినా తొలి రోజుల్లో అవకాశాల కోసం పాట్లు పడక తప్పదు. అలాగే రకరకాల ఫీట్లు వేయాల్సింటుంది. ఇక నటి మధురిమ విషయానికోస్తే ఎలాంటి ట్రిక్ ప్లే చేసి అవకాశాన్ని పొందడంలో సక్సెస్ అయ్యిందో చూద్దాం. బాలీవుడ్, మాలీవుడ్ బ్యూటీస్ కోలీవుడ్ హవా కొనసాగిస్తున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. తమన్న, హన్సిక,శ్రీయ లాంటి బాలీవుడ్ భామలు దక్షిణాదిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలా అడుగెట్టిన మరో అమ్మడు నటి మధురిమ. ఈ బాలీవుడ్ భామ ఆ ఒక్కడు చిత్రంతో తెలుగులో రంగ ప్రవేశం చేసినా, అక్కడ పెద్దగా క్లిక్ కాలేదు.దీంతో కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని ప్రయత్నించింది. ఇక్కడా ఆంబళ, సేందు పోలామా లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేవీ ఈ ముద్దుగుమ్మ కేరీర్‌కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం కోలీవుడ్‌ను మాత్రమే నమ్ముకున్న మధురిమ అవకాశాలను రాబట్టుకోవడానికి తనకు తెలిసిన ట్రిక్‌ను ప్లే చేసింది. అదేంటంటే కుర్రకారుకు మతిపోయేలా టూపీస్ దుస్తులు ధరించిన ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. అవి పలు వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తున్నా, కోలీవుడ్‌లో ఎవరూ ఈ అమ్మడి అందాలారబోత ఫొటోలను పట్టించకోలేదు. స్టార్ హీరోలతో ఈమె జత కట్టకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు తమిళ చిత్ర వర్గాలు. అయితే మధురిమ టూపీస్ ట్రిక్ శాండిల్‌వుడ్‌లో పని చేసింది. ఇప్పుడామె కన్నడ చిత్ర పరిశ్రమ దృష్టిలో పడింది. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఇక అవకాశం కూడా తలుపుతట్టిందట. నంద కిషోర్ అనే దర్శకుడు మధురిమను తన తాజా చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారట. ఇక కన్నడ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానంటోది మధురిమ. -
అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హీరోయిన్
చెన్నై: హీరోయిన్ మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది. హిందీ సినిమా 'అజర్' కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటన్ లో నెలరోజుల పాటు జరగనున్న షూటింగ్ లో ఆమె పనిచేయనుంది. 'దర్శకుడు టోనీ డిసౌజాకు మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. టోనీ భార్య ఆమెకు మంచి ఫ్రెండ్ కావడంతో ఈ అవకాశం దక్కింద'ని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమా రూపకల్పన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిందని వెల్లడించాయి. 'అజర్' పాత్రను ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నారు. ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రీ, హ్యుమా ఖరేషీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సరదాగా కాసేపు, కొత్త జంట, షాడో, గ్రీన్ సిగ్నల్, దోచేయ్ తదితర సినిమాల్లో మధురిమ నటించింది.