టూపీస్ ట్రిక్ సక్సెస్ | Madhurima Focus in Kannada movies | Sakshi
Sakshi News home page

టూపీస్ ట్రిక్ సక్సెస్

Aug 9 2015 3:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

టూపీస్ ట్రిక్ సక్సెస్ - Sakshi

టూపీస్ ట్రిక్ సక్సెస్

హీరో అయినా, హీరోయిన్ అయినా తొలి రోజుల్లో అవకాశాల కోసం పాట్లు పడక తప్పదు. అలాగే రకరకాల ఫీట్లు వేయాల్సింటుంది.

హీరో అయినా, హీరోయిన్ అయినా తొలి రోజుల్లో అవకాశాల కోసం పాట్లు పడక తప్పదు. అలాగే రకరకాల ఫీట్లు వేయాల్సింటుంది. ఇక నటి మధురిమ విషయానికోస్తే ఎలాంటి ట్రిక్ ప్లే చేసి అవకాశాన్ని పొందడంలో సక్సెస్ అయ్యిందో చూద్దాం. బాలీవుడ్, మాలీవుడ్ బ్యూటీస్ కోలీవుడ్ హవా కొనసాగిస్తున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. తమన్న, హన్సిక,శ్రీయ లాంటి బాలీవుడ్ భామలు దక్షిణాదిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలా అడుగెట్టిన మరో అమ్మడు నటి మధురిమ.
 
 ఈ బాలీవుడ్ భామ ఆ ఒక్కడు చిత్రంతో తెలుగులో రంగ ప్రవేశం చేసినా, అక్కడ పెద్దగా క్లిక్ కాలేదు.దీంతో కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని ప్రయత్నించింది. ఇక్కడా ఆంబళ, సేందు పోలామా లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేవీ ఈ ముద్దుగుమ్మ కేరీర్‌కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం కోలీవుడ్‌ను మాత్రమే నమ్ముకున్న మధురిమ అవకాశాలను రాబట్టుకోవడానికి తనకు తెలిసిన ట్రిక్‌ను ప్లే చేసింది. అదేంటంటే కుర్రకారుకు మతిపోయేలా టూపీస్ దుస్తులు ధరించిన ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. అవి పలు వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తున్నా, కోలీవుడ్‌లో ఎవరూ ఈ అమ్మడి అందాలారబోత ఫొటోలను పట్టించకోలేదు.
 
  స్టార్ హీరోలతో ఈమె జత కట్టకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు తమిళ చిత్ర వర్గాలు. అయితే మధురిమ టూపీస్ ట్రిక్ శాండిల్‌వుడ్‌లో పని చేసింది. ఇప్పుడామె కన్నడ చిత్ర పరిశ్రమ దృష్టిలో పడింది. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఇక అవకాశం కూడా తలుపుతట్టిందట. నంద కిషోర్ అనే దర్శకుడు మధురిమను తన తాజా చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారట. ఇక కన్నడ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానంటోది మధురిమ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement