నా కల నెరవేరబోతోంది | It's my dream to work with Amitabh Bachchan: British model Samira Mohamed Ali | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరబోతోంది

Published Thu, Sep 18 2014 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నా కల నెరవేరబోతోంది - Sakshi

నా కల నెరవేరబోతోంది

 పణజి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించాలనేది తన కలని బ్రిటిష్  నటి సమీరా మహ్మద్ అలీ తెలిపింది. త్వరలో విడుదల కానున్న ‘బీ పాజిటివ్’ సినిమాలో ఈ మోడల్ అమితాబ్‌తో నటిస్తోంది. ‘భారతీయ నటులందరిలోకి అమితాబ్ నా ఫేవరెట్. అద్భుతమైన  నటుడు. దుబాయ్‌లో ఉన్న సమయంలో అవకాశమున్నంతవరకూ అమితాబ్ సినిమాలే చూస్తూ పెరిగా. నిజంగా అంత గొప్ప స్టార్ సరసన నటించడమంటే నిజంగా ఓ కలే’ అని అంది. 29 ఏళ్ల ఈ వయ్యారి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా గోవాలో ఉంది. ఈ సినిమాకు వె ంకటేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తక్కువ బడ్జెట్‌తో  ఈ సినిమా కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్, సమీరతోపాటు రాజ్ పురోహిత్, నివేదిత బిశ్వాస్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలో నటించడం ఇబ్బందికరంగా అనిపించడం లేదా అని ప్రశ్నించగా ఈ సినిమాని ఎంత బడ్జెట్‌తో తీస్తున్నారనేది విషయమే కాదంది. ఈ సినిమా కంటెంట్‌ను మాత్రమే తాను పరిగణనలోకి తీసుకున్నానంది. లండన్‌లో చిన్న బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తాయని పేర్కొంది.

మూడు భాషల్లో తీస్తున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకర్షించిందంది. అయితే ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషిస్తోందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. స్టోరీలైన్ చెప్పగానే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని చెప్పింది. ఈ సినిమా స్టోరీ లైన్ తనకు ఎంతో ఆసక్తి కలిగించిందంది. అందువల్లనే ఈ సినిమా కోసం తన షెడ్యూల్‌ను మార్చేసుకున్నానంది. కాగా అరబ్, పోర్చుగీస్ జంటకు పుట్టిన సమీర తనకు భారతీయ సంప్రదాయంతో సంబంధముందంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement