Rescheduled
-
భారత్, వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు..!
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్యలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సఫారీ టూర్ అయ్యాక స్వదేశంలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ ఉదృతి పెరుగుతుండడంతో ఈ సిరీస్‌కు సంబంధించి వేదికలను మార్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వన్డే , టీ20 సిరీస్‌లు ఆరు వేర్వేరు వేదికల్లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆరు వేదికల్లో మ్యాచ్‌లు సురక్షితంగా కాదని, అందుకే ఆరు మ్యాచ్‌లను రెండు వేదికలకే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ , కోల్‌కతా నగరాల్లో విండీస్ టూర్ ముగించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు రెండు మ్యాచ్‌ల తేదీలను కూడా ఒక రోజు తేడాతో జరుపుతారని సమాచారం. ఫిబ్రవరి 12న జరగాల్సిన మూడో వన్డేను 13కు, 15న నిర్వహించాల్సిన తొలి టీ20ని 16కు పోస్ట్ పోన్ చేస్తారని తెలుస్తోంది. చదవండి: టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన ఐసీసీ -
Cyclone Gulab: పలు రైళ్ల మళ్లింపు, రీషెడ్యూల్
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు రెల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లించిన రైళ్లు ♦25వ తేదీన అగర్తలలో బయలుదేరిన అగర్తల–బెంగళూరు (05488) రైలు, 26న హౌరాలో బయలుదేరిన హౌరా–సికింద్రాబాద్ (02703, హౌరా–యశ్వంత్‌పూర్ (02245),హౌరా–హైదరాబాద్ (08645), హౌరా–చెన్నై (02543), హౌరా–తిరుపతి (02663), సంత్రాగచ్చిలో బయలుదేరిన సంత్రాగచ్చి– తిరుపతి (02609), టాటాలో బయలుదేరిన టాటా ఎర్నాకుళం (08189) రైళ్లు ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, బల్హార్షా మీదుగా ప్రయాణిస్తాయి. ♦26న భువనేశ్వర్‌లో బయలుదేరిన భువనేశ్వర్–ముంబై(01020) రైలు సంబల్పూర్, టిట్లాగఢ్ రాయ్‌పూర్ మీదుగా నడుస్తుంది. 25న అలప్పుజాలో బయలుదేరిన అలప్పుజా–ధన్‌బాద్ (03352), 26న చెన్నైలో బయలుదేరిన చెన్నై–హౌరా (02544) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ మీదుగా నడుస్తాయి. ♦25న యశ్వంత్‌పూర్‌లో బయలుదేరిన యశ్వంత్‌పూర్–పూరి (02064), 26న తిరుపతిలో బయలుదేరిన తిరుపతి–భువనేశ్వర్ (08480) రైళ్లు బల్హార్షా, సంబల్పూర్ మీదుగా ప్రయాణిస్తాయి. ♦25న త్రివేండ్రం సెంట్రల్లో బయలుదేరిన త్రివేండ్రం–షాలిమార్ (02641), 26న హైదరాబాద్‌లో బయలుదేరిన హైదరాబాద్–హౌరా (08646) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ, ఖరగ్‌పూర్ మీదుగా నడుస్తాయి. రీషెడ్యూల్ చేసిన రైళ్లు 26న పలు స్టేషన్లలో బయలుదేరే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశారు. పూరిలో బయలుదేరే పూరి–తిరుపతి (07480) 11 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ♦హౌరా నుంచి హౌరా–యశ్వంత్‌పూర్ (02873), హౌరా–పాండిచ్చేరి (02867) రైళ్లు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. ♦సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్–హౌరా (02704), యశ్వంత్‌పూర్‌లో యశ్వంత్‌పూర్–హౌరా (02246), యశ్వంత్‌పూర్–హౌరా (02874), తిరుపతిలో తిరుపతి–బిలాస్పూర్ (07481), తిరుపతి–హౌరా (08090) రైళ్లు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. -
రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్
మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసుల కారణంగా టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి(forfeit the match) సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. మాట మార్చిన ఈసీబీ -
ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఎస్ఈసీ రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ -
ఢిల్లీ.. కూల్‌కూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లో అతి చల్లని వాతావరణం నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా బుధవారం నమోదైంది.ఈ సీజన్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రతకంటే ఒక పాయింట్ అధికంగా ఉంది. ఉత్తర ప్రాంతంలో మంచు కారణంగా మొత్తం 18 రైళ్లను రద్దు చేయగా 6 రైళ్ల రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం 8.30 గంటలకు వాతావరణంలో తేమ 95 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈ సీజన్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 పాయింట్లు అధికం. -
కోళ్ల పరిశ్రమ రుణాల రీషెడ్యూల్!
బ్యాంకర్లతో సర్కారు సమాలోచనలు బర్డ్‌ఫ్లూతో చితికిపోయిన పౌల్ట్రీ రైతులు రూ.2,000 కోట్ల రుణభారం.. రీషెడ్యూలుకు విజ్ఞప్తి హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో కుదేలైన కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు ప్రారంభించింది. తెలంగాణలో ఉన్న కోళ్ల పరిశ్రమలపై దాదాపు రూ. 2,000 కోట్ల బ్యాంకు రుణాలున్నాయి. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో వీటిని తిరిగి చెల్లించ డం గుదిబండగా మారిందని పౌల్ట్రీ రైతులు తల్లడిల్లుతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమాలోచనలు జరిపారు. పౌల్ట్రీ రంగ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు, గుడ్లు, చికెన్ ధర పడిపోయిందని.. ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవటంతో అపార నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడేళ్లుగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలోనే ఉంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది రైతులు పౌల్ట్రీని నమ్ముకున్నారు. వీరిలో ఎనభై శాతం మంది రైతులు వరుస నష్టాలతో చితికిపోయారు. ఇటీవలి బర్డ్ ఫ్లూ దెబ్బకు చిన్న రైతులు మరింత విలవిలలాడిపోయారు.. కొత్త రుణాలు అందించి కుదేలైన పరిశ్రమకు చేయూతను అందించాలి’అని పౌల్ట్రీ ప్రతినిధులు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున.. పాత రుణాలను రీషెడ్యూలు చేయటంతో పాటు కొత్త రుణాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఆర్థిక మంత్రి సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో చర్చించారు. 2008లో పశ్చి మ బెంగాల్లో బర్డ్ ఫ్లూ సోకినప్పుడు అక్కడి పౌల్ట్రీ రుణాలను రీషెడ్యూలు చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఒక ఏడాది పాటు మారటోరియం విధించటంతో పాటు తదుపరి మూడేళ్లు రుణాలను చెల్లించేం దుకు వెసులుబాటు కల్పించిం ది. కొత్త రుణాల మంజూరీకి అనుమతించింది. రాష్ట్రంలోనూ కోళ్ల పరిశ్రమ విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున అదే తీరుగా రుణ భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. -
‘రుణ’ లక్ష్యంపై నిర్లక్ష్యం!
ప్రణాళిక అమలులో బ్యాంకర్ల నిర్లిప్తత - భారీ అంచనాలతో ప్రారంభం.. తుదకు కొర్రీలు - యేటా లక్ష్యాన్ని - సాధించలేకపోతున్న వైనం - గత యేడాది ప్రగతి 83.86 శాతమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: వార్షిక సంవత్సరం ప్రారంభంలో అట్టహాసంగా రూపొందించే రుణప్రణాళికలు.. గడువు ముగిసే నాటికి అబాసుపాలవుతున్నాయి. భారీతనం కోసం వేల కోట్లతో ప్రణాళికలు తయారుచేస్తున్న బ్యాంకర్లు.. ఏడాది ముగిసే నాటికి కొర్రీలు, నిబంధనలు సాకుగా చూపుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు. గతేడాది వార్షిక ప్రణాళిక లక్ష్యసాధనలో జిల్లా బ్యాంకుల పురోగతి అంతంత మాత్రం గానే ఉంది. రూ.4,558.95 కోట్ల రుణాల పంపిణీకి గాను రూ.3,823.14 కోట్లు రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపారు. మొత్తంగా 83.86శాతం పురోగతి సాధిం చినట్లు వెల్లడించారు. ఇవికాకుండా ఇతర కేటగిరీల్లో ఇచ్చిన రూ.657.51 కోట్లు కూడా లక్ష్యసాధనలో చూపి చేతులు దులుపుకున్నారు. లక్ష్యసాధన ఘనంగా ఉన్నట్లు పేర్కొంటూ.. ఈ ఏడాది ప్రణాళికలో మరో రూ.350.64 కోట్లు అదనంగా చేర్చి ఘనతను చాటారు. తిరగరాసిన లెక్కలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.714.66 కోట్ల పంటరుణాలిచ్చేలా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కరువు నేపథ్యంలో ఆయా సీజ న్లలో రైతులను ఇబ్బంది పెట్టొందంటూ పంటరుణాలను రీషెడ్యూల్ చేయాల్సిం దిగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాలో దాదాపు రూ.550 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేశారు. కానీ బ్యాంకులు మాత్రం ఈ మొత్తాన్ని లక్ష్యసాధనలో చూపాయి. అదేవిధంగా భూఅభివృద్ధి కోసం రూ.26.15 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం రూ. 17.57 కోట్లు మాత్రమే ఇచ్చారు. పాడి పరిశ్రమల, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం కోసం రూ.318.49 కోట్ల రుణాలివ్వాల్సిం దిగా ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ రూ.275.11 కోట్లు రుణాలిచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇలా అన్ని కేటగిరీల్లో లక్ష్యసాధన చివరకు మిగిలి పోయింది. ఇతర అనుభంధ రుణాలు రూ.50.38 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.708.34 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చూపారు. ఈ మొత్తాన్ని లక్ష్యసాధనకు జతచేయడంతో పురోగతిలో భారీ మా ర్పులు చోటుచేసుకోవడం గమనార్హం. -
అప్పుల ఆత్మహత్యలని తేలితేనే పరిహారం
అన్నదాతల ఆత్మహత్యలపై సీఎం చంద్రబాబు ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 93 శాతం మంది రైతులు రుణగ్రస్తులు గత ప్రభుత్వాల విధానాలే రైతుల అప్పులకు కారణం రూ. 50 వేల లోపు రుణం ఉన్న వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదు ఆ పైన ఉన్న రుణాలను ఐదు విడతలలో మాఫీ చేస్తాం ఈ లోగా రీషెడ్యూల్ చేసుకుంటే 4 శాతం వడ్డీనే పడుతుంది రుణ మాఫీ, కరువు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే ప్రతిపక్షం.. ఎర్రచందనం, బెరైటీస్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? శాసనసభలో చర్చకు సీఎం సమాధాన ప్రసంగంలో వ్యాఖ్యలు హైదరాబాద్: ఏపీలో 92.9 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చేసిన శాంపిల్ సర్వేలో తేలిందని.. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే రైతుల అప్పులకు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందిస్తామంటూనే.. అప్పుల బాధతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలితేనే సాయం అందిస్తామని షరతు విధించారు. కుటుంబ కలహాలు, ప్రేమ, మానసిక ఆందోళన.. తదితర కారణాలతో ఆత్మహత్యలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. రుణ మాఫీ, కరువు, రైతుల ఆత్మహత్యల మీద 344 నిబంధన కింద రాష్ట్ర శాసనసభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానం ఇచ్చారు. రుణ మాఫీలో.. రూ. 50 వేల వరకు రుణం తీసుకున్న వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదని, ఈ రుణాలను ఒకే దఫా మాఫీ చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేసిన తర్వాత రుణ మాఫీకి అర్హత మొత్తం రూ. 50 వేల లోపు ఉంటే ఒకే దఫా చెల్లించడానికి (వన్ టైం సెటిల్మెంట్) ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిగతా రుణాలను ఐదు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఈలోగా రుణాలను రీషెడ్యూలు చేసుకుంటే 4 శాతం వడ్డీనే పడుతుందని, తాను 10 శాతం ఇస్తాను కాబట్టి 6 శాతం లాభం రైతులకు మిగులుతుందని లెక్కలు చెప్పారు. బీమా పరిహారాన్ని రుణ మాఫీ కింద జమ చేసుకోవడం లేదని, రైతుల ఖాతాలకే ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తున్నామన్నారు. అనంతపురానికి హంద్రీ-నీవా నీళ్లు.. అనంతపురం జిల్లాలో 10 ఎకరాల వరకు బిం దు, తుంపర సేద్యానికి 90 శాతం రాయితీ ఇస్తున్నామని సీఎం చెప్పారు. గోదావరి మెట్ట ప్రాం తాల రైతులకూ ఈ రాయితీ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. హంద్రీ-నీనా సుజల స్రవంతి ద్వారా ఈ ఏడాది తాను 12 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తరలించానన్నారు. తుంగభద్ర హైలెవల్ కెనాల్‌కు సమాంతరంగా కొత్తగా కాలువ తవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించానని, ఆ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు దీన్ని అప్పగించిందన్నారు. ఇది సాకారమైతే అనంతపురం జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు. విద్యుత్ విషయంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయనే విషయాన్ని చెప్పడానికి ఏమీ లేదని, తాను పదేళ్లకు భవిష్యత్ ప్రణాళికలు తయారు చేశానని ఘనంగా ప్రకటించారు. తోటపల్లికి, వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే..: గోదావరిలో ఏటా 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, ఆ నీటిలో 70 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ కు లిఫ్ట్ చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని చెప్పారు. ఈమేరకు కృష్ణలో మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు విని యోగించుకుంటామన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసింది తానేనంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు తీసుకుందని విమర్శిం చారు. రుణ మాఫీ, కరవు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్షం.. ఎర్రచందనం, బెరైటీస్ గురించి ఎందుకు మా ట్లాడటం లేదని సీఎం ప్రశ్నించారు. ఆదర్శ రైతులకు వ్యవసాయం అంటే తెలీదని, అందు కే తొలగించామని బాబు పేర్కొన్నారు. అక్కడ పంటలు వేయకపోతే నీళ్లు మిగులుతాయి రాజధాని ప్రాంతంపై మండలిలో చంద్రబాబు వ్యాఖ్యలు రాష్ట్ర రాజధానిని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంతో విజయవాడ - గుంటూరు మధ్యన అనువైన ప్రాంతంగా నిర్ణయించి ఎంపిక చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగు పంటలు వచ్చే భూములను తీసుకుంటే ఎలా అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడుతున్నారంటూ.. అక్కడ పంటలు వేయకపోతే నీళ్లు మిగులుతాయని, వాటిని రాయలసీమకు తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏపీ రాజ ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు-2014ను మంగళవారం మండలిలో ప్రవేశపెట్టారు. బిల్లులో ఉన్న అనుమానాలు, లోటుపాట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో భవిష్యత్తులో భూకంపం వస్తుందని ప్రజల్లో భ యాందోళనలు కలిగించే రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ పార్టీల ప్రతిని ధుల అభిప్రాయాలు తీసుకోకుండా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారనే ఆరోపణల్లో అర్థం లేదన్నారు. -
కన్నీటి సేద్యం
చీరాల : బాబు పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగర్ జలాలపై ఆధారపడిన ఆయకట్టుదారులకు నీరు అందక..రుణమాఫీ మాట నమ్మి అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక రైతన్నలు వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతున్నారు. శనగల కొనుగోలు చేస్తామని ఇచ్చిన బాబు తరువాత ఆ ఊసే ఎత్తకపోవడంతో ఇరకాటంలో పడ్డారు. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా జిల్లాలోని రైతుల దుస్థితి ఏర్పడింది. అప్పులతో సతమతం... అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత అప్పులతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాలు పడడంతో రైతులంతా జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. రుణమాఫీ కాలేదు ... కనీసం రీషెడ్యూలు కూడా అమలు కాలేదు. బ్యాంకర్లు అన్నదాతలకు ఒక్క రూపాయి కూడా అప్పు ఇచ్చేదిలేదని మొండికేశారు. పెట్టుబడులు అత్యవసరం కావడంతో నూటికి రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీకి తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడిగా పెడుతున్నారు. బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు తీసుకుందామన్నా వీలుకాని పరిస్థితులు బాబు కల్పించిందని వాపోతున్నారు. ఎరువు బరువైంది... ఎరువు రైతులకు మోయలేని భారంగా మారింది. ఇప్పటికే కౌలు రేట్లు పెరిగాయి. కూలీ రేట్లు రెట్టింపయ్యాయి. విత్తనాల ధరలు గతంలోకంటే అధికమయ్యాయి. ఎరువులు, పురుగు మందులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. రూ.284లకు అమ్మాల్సిన యూరియా రూ.400కు అమ్ముతున్నారు. అది కూడా కాంప్లెక్స్ ఎరువులు కొంటే విత్తనాలు ఇస్తున్నారు. మరికొందరు పురుగుల మందులు కొన్నవారికే యూరియా ఇస్తున్నారు. పంటను కాపాడుకోవాలంటే తప్పని పరిస్థితుల్లో అధిక ధరలకు ఎరువులు, పురుగుముందుల కొనుగోలు చేయాల్సి వస్తోంది. ‘సాగర్’ వెతలు... నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు రాక రైతులు పోరాటాలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దంకి బ్రాంచ్ కెనాల్ నుంచి పర్చూరు డివిజన్లో కోటపాడు, ద్రోణాదుల, పమిడిపాడు, నూతలపాడు మేజర్ల ద్వారా మొత్తం 72 వేల ఎకరాలకు సాగు నీరు రావాల్సి ఉంది. దిగువ ప్రాంతాలకు సాగు నీరురాక మాగాణి భూములన్నీ బీడుగా మారిపోతున్నాయి. జిల్లాలో వరి పండించే రైతులు వరిసాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, అపరాలు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రెండో జోన్ పరిధిలో యద్దనపూడి బ్రాంచి కాలువ కింద ఐదు వేల ఎకరాల్లో పంట ప్రశ్నార్థకంగా మారింది. -
అర్హులందరికీ పంట రుణాలు
రేగోడ్: రుణమాఫీ పొందిన అర్హులైన రైతులందరికీ పంట రుణాలు రీషెడ్యూల్ చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీఏ) హుక్యానాయక్ తెలిపారు. మండలంలోని మేడికుంద గ్రామ శివారులో రైతులు సాగు చేసిన పత్తి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ.. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ త్రీజీ గుళికలను ఎకరాకు పది కిలోల చొప్పున పొలంలో చల్లుకోవాలని సూచిం చారు. పత్తిలో రసంపీల్చే పురుగు నివారణకు లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిపేట్ మ ందును పిచికారీ చేయాలని తె లిపారు. పత్తి గూడ రాలకుండా ఉండేందుకు మల్టీ కే మం దును స్ప్రే చేసుకోవాలని తెలిపారు. పచ్చ పురుగు నివారణకు లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ ముందును పిచి కారీ చేయాలని చెప్పారు. కందిలో ఆకుముడత పురుగు నివారణకు లీటరు నీటిలో ఒక గ్రాము ఎసిపేట్ మందును లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును కలుపుకుని పిచికారీ చేయాలని తెలిపారు. పంటల సాగులో క్రమం తప్పకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణాలను రీషెడ్యూల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని బ్యాంకర్లకు సూచించారు. వట్‌పల్లిలోని బ్యాంక్ అధికారులు తమకు రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆయనతో తెలిపారు. అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటానని జేడీఏ చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదాతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ ప్రసాద్, ఏఈఓ ఇంద్రయ్య, ఎంపీటీసీ అప్పారావ్, నాయకులు టి.శంకరప్ప, రైతులు ఉన్నారు. -
నా కల నెరవేరబోతోంది
పణజి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించాలనేది తన కలని బ్రిటిష్ నటి సమీరా మహ్మద్ అలీ తెలిపింది. త్వరలో విడుదల కానున్న ‘బీ పాజిటివ్’ సినిమాలో ఈ మోడల్ అమితాబ్‌తో నటిస్తోంది. ‘భారతీయ నటులందరిలోకి అమితాబ్ నా ఫేవరెట్. అద్భుతమైన నటుడు. దుబాయ్‌లో ఉన్న సమయంలో అవకాశమున్నంతవరకూ అమితాబ్ సినిమాలే చూస్తూ పెరిగా. నిజంగా అంత గొప్ప స్టార్ సరసన నటించడమంటే నిజంగా ఓ కలే’ అని అంది. 29 ఏళ్ల ఈ వయ్యారి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా గోవాలో ఉంది. ఈ సినిమాకు వె ంకటేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్, సమీరతోపాటు రాజ్ పురోహిత్, నివేదిత బిశ్వాస్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలో నటించడం ఇబ్బందికరంగా అనిపించడం లేదా అని ప్రశ్నించగా ఈ సినిమాని ఎంత బడ్జెట్‌తో తీస్తున్నారనేది విషయమే కాదంది. ఈ సినిమా కంటెంట్‌ను మాత్రమే తాను పరిగణనలోకి తీసుకున్నానంది. లండన్‌లో చిన్న బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తాయని పేర్కొంది. మూడు భాషల్లో తీస్తున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకర్షించిందంది. అయితే ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషిస్తోందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. స్టోరీలైన్ చెప్పగానే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని చెప్పింది. ఈ సినిమా స్టోరీ లైన్ తనకు ఎంతో ఆసక్తి కలిగించిందంది. అందువల్లనే ఈ సినిమా కోసం తన షెడ్యూల్‌ను మార్చేసుకున్నానంది. కాగా అరబ్, పోర్చుగీస్ జంటకు పుట్టిన సమీర తనకు భారతీయ సంప్రదాయంతో సంబంధముందంది. -
సీఎంగా చేసిన ప్రకటననూ తుంగలో తొక్కిన చంద్రబాబు
-
మరో దొంగ దెబ్బ
రైతుల రుణ మాఫీపై సీఎంగా చేసిన ప్రకటననూ తుంగలో తొక్కిన చంద్రబాబు ► ఈ ఏడాది మార్చి 31 వరకున్న రుణాలన్నీ మాఫీ అని జూన్ 21న సీఎం ప్రకటన ► మార్గదర్శకాల్లో మాత్రం గతేడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలకే వర్తింపు ► డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకు ఈ మార్చి వరకే వడ్డీ చెల్లింపంటూ మెలిక ► ఆయా రుణాలపై మార్చి 31వ తేదీ తరువాత పడే వడ్డీని రైతులే చెల్లించుకోవాలి ► ఈ జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాఫీ వర్తించదు ► ఆ కాలంలో రైతులు బంగారం కుదువపెట్టి ఎక్కువ రుణాలు తీసుకున్నందున కుదింపు ► లక్షల్లో రైతుల రుణ ఖాతాలను, వేల కోట్లలో మాఫీ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ ► నిజానికి ఎన్నికల ముందు గోల్డ్‌పై రుణాలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ప్రచారం ► ఇంటింటికి వెళ్లి మరీ ప్రోత్సాహం.. బంగారాన్ని బాబు విడిపిస్తారని నమ్మించారు ► అధికారంలోకి వచ్చాక ఆ రైతు కుటుంబాలను నట్టేట ముంచిన టీడీపీ సర్కారు హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటల బండారం మరోసారి బయటపడింది. నమ్మించి మోసం చేయటం ఆయన నైజమని మళ్లీ రుజువైంది. రైతుల వ్యవసాయ రుణాల మాఫీ హామీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దొంగ దెబ్బతీసింది. రుణ మాఫీని ఇప్పటికీ అమలు చేయకుండా అనేక సాకులు చెప్తూ.. ఆంక్షలు పెడుతూ నాన్చుతున్న చంద్రబాబు ఇటీవల సీఎం హోదాలో.. ఈ ఏడాది మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలను -తిరిగి చెల్లించని వారివి, చెల్లించిన వారివి కూడా- మాఫీ చేస్తామని స్వయంగా బాహాటంగా చెప్పిన మాటనూ తుంగలో తొక్కేశారు. గతేడాది డిసెంబర్ 31లోగా తీసుకున్న పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి తీసుకున్న పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మధ్యకాలిక రుణాలుగా మార్చిన రుణాలకే మాఫీ వర్తిస్తుందని ఆ తర్వాత జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు తమను నమ్మించి మరీ నిలువునా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో ఎన్నో పిల్లి మొగ్గలు... అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా రైతాంగానికి హామీ ఇవ్వడం తెలి సిందే. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణ మాఫీ అమలుపై విధివిధానాలకు కమిటీ అని, నిధుల సమీకరణకు కమిటీ అని, ఆర్బీఐ ద్వారా రీషెడ్యూల్ చేయిస్తానని.. అనేక పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చటం తెలిసిందే. ఈ లోగా రైతులు రుణాలు చెల్లించాల్సిన గడువు ముగిసిపోవడం, వారంతా డిఫాల్టర్లుగా మారారంటూ బ్యాంకర్లు రుణాల వసూళ్ల కోసం నోటీసులు ఇవ్వడం, ఆ రుణాలపై 13% వడ్డీ భారం పడటం, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు లభించకపోవడం, రైతాంగం పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం తెలిసిందే. మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలన్నీ అన్నారు... ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి నిరసనలు, ప్రతిపక్షం నుంచి ఒత్తిడులు పెరుగుతుండటంతో.. సీఎం చంద్రబాబు గత నెల (జూలై) 21వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి రుణ మాఫీ అమలుపై నిర్ణయం తీసుకున్నట్లు అనంతరం ఆయన స్వయంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలను, రుణాలు తీసుకుని చెల్లించిన వారి, చెల్లించని వారి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాల పర్యటనల్లో పలు బహిరంగ సభల్లోనూ.. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 31 వరకూ మాత్రమేనని మార్గదర్శకాలు... కానీ.. ఈ నెల 14న రుణ మాఫీపై జారీ చేసిన మార్గదర్శకాల్లో మాత్రం ఆ మాటకూ కట్టుబడకుండా దొంగ దెబ్బ తీశారు. గతేడాది డిసెంబర్ 31లోగా తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. అంతేకాదు.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించదని తేల్చిచెప్పారు. అంతే కాకుండా వ్యవసాయ రుణాలపై వడ్డీ చెల్లింపులో కూడా మరో మెలిక పెట్టారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలకు ఈ ఏడాది మార్చి వరకు అయ్యే వడ్డీని మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకువస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అంటే ఈ ఏడాది మార్చి తరువాత వడ్డీని ఆయా రైతులే భరించుకోవాల్సి ఉంది. అలాగే.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 1.50 లక్షల మేర మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, ఆయా కుటుంబానికి నిబంధనల ప్రకారం అర్హత మేరకు ఉన్న రుణానికి మాత్రమే ఈ మాఫీ ఉంటుందని.. అర్హతకు మించి ఉన్న రుణాలకు వర్తించదనీ నిబంధనలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ మార్గదర్శకాల్లో ఈ నిబంధనలు చేర్చడం ద్వారా.. లక్షలాది మంది రైతుల ఖాతాలను, వేల కోట్ల రూపాయల రుణ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యమని బ్యాంకుల అధికారులే స్వయంగా చెప్తున్నారు. మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలన్నిటినీ కూడా మాఫీ చేస్తామని చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక బహిరంగంగా చెప్పిన మాటకు కూడా కట్టుబడకుండా మోసం చేయడం సమజసం కాదనే అభిప్రాయాన్ని బ్యాంకు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. జనవరి తర్వాతే ఎక్కువ రుణాలు... వాస్తవానికి జనవరి నుంచి మార్చిలోగా ఎక్కువ మంది బంగారం కుదవ పెట్టి వ్యవసాయ పంట రుణాలు తీసుకున్నారని, ఆ రుణాలను మాఫీ చేయకూడదనే ఈ నిబంధన పెట్టారని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకోవాల్సిందిగా రైతులను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలేనని రైతాంగం వాపోతోంది. పంట రుణం తీసుకున్నప్పటికీ బంగారంపైన కూడా రుణం తీసుకోవాలని, బాబు అధికారంలోకి రాగానే రుణ మాఫీ ద్వారా బంగారం విడిపిస్తారని రైతులను నమ్మించింది టీడీపీ నాయకులేనని అధికారులు కూడా గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటకే కాదు.. ఎన్నికలయ్యాక ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చెప్పిన మాటకు విరుద్ధంగా కూడా చంద్రబాబు వ్యవహరించడాన్ని బట్టే ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్థమవుతోందని పరిశీల కులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అయ్యో రైతు
ఖమ్మం: శాస్త్రీయ సర్వేల పేరుతో కొండంత నష్టం జరిగితే గోరంతే జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు పంపారు. అప్పుడు ఆ అధికారులు చేసిన సర్వే పాపమే ఇప్పుడు జిల్లా రైతులకు శాపమైందని జిల్లాలోని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రిజర్వుబ్యాంక్ ప్రకటించిన రైతు రుణాల రీ షెడ్యూల్ జాబితాలో జిల్లా పేరు గల్లంతైందని అంటున్నారు. గత సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో వచ్చిన గోదావరి వరదలతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. వరదలతో జిల్లాలో 35వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, సుమారు రూ.13 కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని అంచనాలు వేశారు. కానీ ఈ పంటలు నాటు వేసే దశలోనే ఉన్నాయని, వీటికి నష్టపరిహారం రాదని వ్యవసాయశాఖ అధికారులు కొట్టిపారేశారు. అక్టోబర్ 22వ తేదీ నుండి ఎడతెరపి లేకుండా వారం రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాల పత్తి, 28 వేల ఎకరాల వరి, 15 వేల ఎకరాల మిర్చి, 22 వేల ఎకరాల మొక్కజొన్న, 20 వేల ఎకరాల కూరగాయ, ఇతర పంటలు మొత్తం 3.3 లక్షల ఎకరాలకు పైగా దెబ్బతిన్నాయని అధికారులు, రైతు సంఘాల నాయకులు ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. పంటనష్టం రూ. 430 కోట్లకు పైగా ఉంటుందని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో చెప్పారు. కానీ వ్యవసాయశాఖ అధికారులకు మాత్రం చలనం రాలేదు. నష్టం జరిగిన పదిహేను రోజులకు కానీ అంచనాలు వేసేందుకు వెళ్ళలేదని రైతులు ఆరోపిస్తున్నారు. శాస్త్రీయసర్వేలు, అంచనాలు పేరుతో పంటనష్టాన్ని కుదించారు. 50 శాతం కంటే ఎక్కువగా పంటనష్టం జరిగితేనే పరిహారం వస్తుందని చెప్పారు. ఈ లెక్కన జిల్లాలో కేవలం 76 వేల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు. ఇరత జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా పంటనష్టం అధికంగా ఉందని అందరూ ప్రకటించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడానికి జిల్లాకు వచ్చిన వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముందు రైతులు కన్నీరు పెట్టారు. జిల్లా పరిస్థితులు చూసిన ఆమె ఖమ్మం జిల్లా పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకున్న నాథుడే కరువయ్యాడు. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమన కల్గుతుందని రైతులు భావించారు. రిజర్వ్‌బ్యాంక్ రీషెడ్యూల్‌పై మెలిక పెట్టి గత సంవత్సరం కరువు, వరదల మూలంగా పంటనష్టం వాటిల్లిన జిల్లాలకే రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. ఇందులో మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పేర్లు మాత్రమే ప్రకటించారు. ఈ వార్త విన్న జిల్లా రైతాంగం ఒక్కసారిగి ఖంగుతిన్నది. నాడు వ్యవసాయశాఖ అధికారులు చేసిన పాపం మూలంగానే జిల్లాకు ఆర్బీఐ జాబితాలో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీషెడ్యూల్ అయితే ఊరట కల్గుతుందని భావించిన రైతులు నిరాశకు లోనవుతున్నారు. రుణమాఫీ వర్తిస్తుందో, లేదో అని ఆందోళన చెందుతున్నారు. -
ఆధార్..బేజార్!
శ్రీకాకుళం అగ్రికల్చర్, పాత బస్టాండ్: రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు గానీ.. రుణాలు మాఫీ కావాలన్నా, రీషెడ్యూల్ చేయాలన్నా బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందేనని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డులు లేని వారు వాటి కోసం కేంద్రాలకు పరుగులు తీస్తుంటే.. కార్డులు ఉన్న వారు వాటిని అనుసంధానం చేయించుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. లక్ష మందికి పైగా అవస్థలు జిల్లా జనాభా సుమారు 27 లక్షలు. వీరిలో సుమారు లక్ష మంది ఇంకా ఆధార్ ఫొటోలు దిగాల్సి ఉంది. జనవరి నుంచి ఆధార్ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆధార్ కేంద్రాలు తెరుస్తామని అధికారులు చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మీ సేవ కేంద్రాలకు ఆ బాధ్యతలు అప్పగించినా పలు కారణాల వల్ల అక్కడ ఆ ప్రక్రియ సజావుగా సాగడంలేదు. ఫొటోలు తీయించుకోనివారి కష్టాలు ఇలా ఉంటే.. గతంలోనే ఆధార్ చేయించుకున్న వారి కష్టాలు మరోలా ఉన్నాయి. వీరిలో చాలా మందికి ఇంతవరకు కార్డులు అందలేదు. కార్డు ల కోసం మీ-సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆధార్ కార్డులు, లేదా దానికి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని ప్రజలు చెబుతున్నారు. రైతులను చులకనగా చూస్తున్న బ్యాంకర్లు ఇదిలా ఉండగా సహకార, గ్రామీణ బ్యాంకులు మినహా వాణిజ్య బ్యాంకుల వద్దకు ఆధార్ కార్డులతో రైతులను వారు చులకనగా చూస్తున్నారు. ఖరీఫ్ సీజనులో వ్యవసాయ పనులు మానుకొని ఆధార్ కార్డులు పట్టుకొని వెళితే నెంబర్లు నమోదు చేసుకోవడానికి రేపు, మాపు అంటూ వాణిజ్య బ్యాంకుల సిబ్బంది తిప్పుతుండటంతోపాటు అడిగిన వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇదంతా పాలకుల నిర్వాకం ఫలితమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు తాళం మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకూ ఆధార్ గొళ్లెం పెట్టేశారు. గత నాలుగు నెలలుగా ఇళ్ల నిర్మాణాల బిల్లులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు వీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆధార్‌ను తెరపైకి తెచ్చింది. 2003 నుంచి లబ్ధిదారులందరికీ ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించడంతో గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు జాబితాలు పట్టుకొని లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ఒకే లబ్ధిదారుడు రెండుసార్లు ప్రయోజనం పొందకుండా అడ్డుకట్ట వేయవచ్చని, తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చన్న ప్రభుత్వ ఉద్దేశం. ఈ నెలాఖరునాటికి ఈ పని పూర్తి చేయాలని ఆదేశించడంతో వర్క్ ఇన్స్పెక్టర్లు మొదలుకొని ఏఈలు, డీఈ సైతం ఇందులోనే నిమగ్నమయ్యారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆధార్ అనుసంధానం సాధ్యమయ్యే పని కాదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త ఇళ్లు మంజూరయ్యే పరిస్థితి కన్పించడం లేదు, ఈ ఏడాది నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున జిల్లాలో 20 వేల ఇళ్లు నిర్మిం చాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు లబ్ధిదారుల ఎం పికే పూర్తి కాలేదు. గత ఏడాది 23 వేల ఇళ్ల నిర్మాణా లు లక్ష్యం కాగా 17 వేలు మాత్రమే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి రూ.14 కోట్ల బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. ఆ ఇల్లులో కొన్నింటికి నిర్మాణాలు పూర్తయ్యి బిల్లులు బకాయిలు 14 కోట్లు ఉన్నాయి. అప్పటి లబ్ధిదారులు ఎక్కడో? కాగా ఆధార్ అనుసంధానానికి 2003 సంవత్సరాన్ని ప్రతిపదికగా తీసుకోగా అప్పటి నుంచి 2007 వరకు సుమారు 42వేల ఇళ్లు నిర్మించారు. 2007 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ, తదితర పలు పథకాల కింద 3 లక్షల వరకు ఇళ్లు మంజూరయ్యాయి. వీటన్నింటికి ఆధార్ సిడింగ్ చేయాలి. దాంతో అప్పటి జాబితాలు పట్టుకొని సిబ్బంది కుస్తీ పడుతున్నారు. లబ్ధిదారుల్లో కొందరు మరణించగా, మరెంతో మంది స్థానికంగా లేరు. చాలా ఇళ్లు చేతులు మారిపోయాయి. దీంతో లబ్ధిదారులతోపాటు గృహనిర్మాణ సంస్థ సిబ్బంది ఆధార్ గుదిబండగా మారింది. -
ఇదేనా రుణమాఫీ!
అప్పుల ఊబిలో అన్నదాతలు రోజు రోజుకూ పెరుగుతున్న వడ్డీ భారం రీషెడ్యూల్ విషయంలో మభ్యపెడుతున్న ప్రభుత్వం ప్రజల ఆగ్రహం తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుచావండి అన్నట్టుంది ప్రభుత్వం పరిస్థితి. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించేసి చేతులు దులుపు కుంది. ప్రకటనొచ్చి నెల రోజులు గడిచినా ఏ ఒక్కరి రుణమూ మాఫీ కాలేదు. కొత్త రుణాలకు అన్నదాతలు నోచుకోకపోగా వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి పెంచారు. నోటీసుల జారీతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు జిల్లాకు వస్తున్న సీఎంను నిలదీసేందుకు రైతులు, మహిళలు సిద్ధమవుతున్నారు. విశాఖ రూరల్/ చోడవరం: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోగా రోజుకో తప్పుడు ప్రకటనతో రైతులను వంచించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ మాటలు నమ్మిన రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ కూడా జరగలేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు చేసి ఖరీఫ్ పంటలకు మదుపులు పెడుతున్నారు. ప్రకృతి కూడా సహకరించకపోవడంతో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. అనేక అనుమానాలు జిల్లాలో గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి రూ.1040 కోట్లు మేరకు రుణాలు ఇచ్చారు. గత ఖరీఫ్‌లో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు అందజేశారు. రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లలు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. అలాగే లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణా మాఫీ మొత్తంగా రూ.1040 కోట్లు కూడా రద్దవుతాయని రైతులు భావించారు. కాని మాఫీ కాకపోగా వాటిపై వడ్డీ భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. డ్వాక్రా రుణాల పరిస్థితి అంతే జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఇందులో లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 మాత్రమే ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా కేవలం లక్షలోపు రుణం తీసుకున్న సంఘానికే రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన సంఘాలు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పాత రుణాలు చెల్లించేంత వరకు కొత్త రుణాలు మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాస్తవానికి జూలై నెలాఖరు నాటికే రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.30 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. సీఎం స్పష్టత ఇవ్వాలి నాది బుచ్చెయ్యపేట మండలం. 2011లో భార్య నగలు తాకట్టు పెట్టి రాజాం బ్యాం కులో రూ. 35వేలు రుణం తీసుకున్నాను. లోన్ నంబరు 15938 4200 9672తో అసలు, వడ్డీ రూ.44, 356 కట్టాలని నోటీసు పంపారు. రుణాలు మా ఫీ చేశామని సీఎం చెబుతున్నప్పటికీ బ్యాం కులు నోటీసులు ఇవ్వడం ఏమిటో. - పోతి లక్ష్మణరావు అంతా అయోమయం నాది బుచ్చెయ్యపేట మండలం రాజాం. మూడు ఎకరాల పొలం ఉంది. 2013లో రాజాం కెనరా బ్యాంకులో రూ.50 వేలు అప్పు తీసుకున్నాను. లోన్ కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసు పంపారు. ఎన్నికలు ముందు నుంచి రుణాలు చెల్లించద్దని టీడీపీవారు చెప్పడంతో రుణం చెల్లించలేదు. -కంఠంరెడ్డి శ్రీను -
రైతు మెడపై కత్తి
సాక్షి, ఒంగోలు: రైతుకు కష్టకాలమొచ్చింది. రుణమో.. ‘చంద్రా’..! అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి అర్థిస్తున్నాడు. రుణవిముక్తి కల్పిస్తానని నమ్మబలికిన చంద్రబాబు..ఇప్పుడు మాటతప్పేలా వ్యవహరించడంపై జిల్లావ్యాప్తంగా అన్నదాతలు కసితో రగిలిపోతున్నారు. రైతుల ఆత్మాభిమానంతో ప్రభుత్వం ఆటలాడుతోందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులకు లక్షన్నర, డ్వాక్రాసంఘాలకు లక్ష చొప్పున అందజేస్తానన్న మ్యాచింగ్ గ్రాంట్ అందే అవకాశాలున్నాయా..? లేదా..? అనే ఆందోళనలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడి ప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు అసలు నైజం బోధపడుతోందని.. అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పినట్లు రైతులు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలు.. వాటి అమలు తాత్సారంపై ‘నరకాసుర వధ’ పేరిట రైతులు అన్నిచోట్లా రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల్ని సైతం తగులబెట్టి తమ నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డ్వాక్రా సంఘాలదీ అదే పరిస్థితి. ఠంచన్‌గా బ్యాంకుల్లో రుణ వాయిదాలు చెల్లించే సంఘాలను సైతం టీడీపీ అధినేతలు ఇప్పటికే అడ్డుకున్నారు. పూర్తి రుణాల మాఫీ జరుగుతోందని ఆశపెట్టారు. నేడు, సంఘానికి రూ.లక్ష కేటాయింపు అంటూ ప్రకటించినా.. సంఘ సభ్యుల అప్పులకు వడ్డీలు కట్టే నాథుడే కరువయ్యాడు. నోటీసులతో బెదిరింపులు.. రుణాల మాఫీపై విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం..బ్యాంకులకు మాత్రం మార్గదర్శకాలు పంపలేదు. దీంతో ఇదే అదునుగా పేరుకుపోయిన బకాయిల రికవరీ పేరుతో బ్యాంకర్లు నడుంబిగిస్తున్నారు. డ్వాక్రాసంఘాల వడ్డీ సొమ్మును పొదుపు ఖాతాల నుంచి మినహాయించుకుంటున్నారు. మరోవైపు రైతుల ఆస్తుల జప్తు, వేలానికి సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు. నెలాఖరులోగా బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సిందేనంటూ రైతుల మెడపై కత్తిపెడుతున్నారు. మూడ్రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లిస్తే.. కొత్తరుణాలు అందిస్తామంటున్నారు. బకాయిలు చెల్లించినంత మాత్రాన రుణమాఫీ వర్తించక పోదంటూ నమ్మబలుకుతున్నారు. గడువులోగా చెల్లించకుంటే ప్రభుత్వమిచ్చే మ్యాచింగ్‌గ్రాంట్‌ను వడ్డీకిందనే జమచేసుకోవాల్సి వస్తుందని బ్యాంకర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. వడ్డీరాయితీకి తిప్పలు జిల్లాలో ఐదు లక్షల మంది రైతులు జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకున్నారు. కిందటేడాది జిల్లాలోని రైతులకు రూ.5,800 కోట్లు పంటరుణాల్ని పంపిణీ చేస్తే.. ఈఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇంత వరకు ఒక్కరూపాయి అందివ్వలేదు. బ్యాంకుల్లో మొత్తం రూ.6,900 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి. వర్షాభావం, రుణమాఫీ సందిగ్థంతో కొత్త అప్పులు పుట్టక, రైతులు పంటల సాగుకు స్వస్తి చెబుతున్నారు. కొత్తరుణాల మంజూరు లేక సంఘాల అంతర్గత కార్యకలాపాలు నిలిచిపోవడంతో డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే వడ్డీరాయితీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు, మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రూ.6 నుంచి రూ.10 వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ప్రకటనలపై అయోమయం: రైతులకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష చొప్పున మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో బ్యాంకర్లకు మార్గదర్శకాలు అందలేదు. రైతు కుటుంబం యూనిట్‌గా రూ.లక్షన్నర మొత్తాన్ని నేరుగా బ్యాంకులకు చెల్లించి..ఆమేరకు తమ రుణాలను మాఫీ చేస్తారా..? లేదంటే, రీషెడ్యూల్‌తో ఆ భారం ప్రభుత్వం మోస్తుందా..? తమపై వేస్తుందా..? అనే సవాలక్ష ప్రశ్నలతో రైతులు అయోమయంలో పడుతున్నారు. రైతు రుణాలకు సంబంధించి పంట రుణాలకా..? బంగారంపై రుణాలకు ప్రాధాన్యమిస్తారా..? అనేది తేలాల్సిఉంది. డ్వాక్రాసంఘాలకు గరిష్టంగా ఇస్తామన్న రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పుడు, ఎలా, ఎన్ని విడతల్లో ఇస్తారనేది స్పష్టత లేదు. రీషెడ్యూల్ చేస్తే పేరుకుపోయిన బకాయిలపై 12.5 శాతం వరకు వడ్డీపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఏటా జూలైలో రిజర్వు బ్యాంకు రీషెడ్యూల్ అమలుపై మార్గదర్శకాలిస్తుందని.. అవి రుణమాఫీకి వర్తించవని బ్యాంకర్లు చెబుతున్నారు. తాజాగా ఆర్బీఐ కొర్రీలతో ప్రభుత్వానికి పంపిన లేఖ సారాంశం ప్రకారం రీషెడ్యూల్ అమలు కల్లేనని రైతులు, డ్వాక్రాసంఘాలు ఆందోళన పడుతున్నాయి. -
రుణమాఫీ మరింత జాప్యమా?
కర్నూలు(అగ్రికల్చర్) : రుణ మాఫీ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత వరకు దీనిపై ఎల్డీఎం(లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్)కు గాని, ఇతర బ్యాంకులకు గాని ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. అలాగే గతేడాది తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి వచ్చింది అంటూ ప్రకటనలు చేస్తున్నా.. ఆదేశాలు మాత్రం బ్యాంకులకు రాలేదు. కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు, మాఫీ చేస్తే మొత్తం బ్యాంకులకు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. రుణ మాఫీని మరింత జాప్యం చేయడానికి అన్నట్లు నిధుల సమీకరణకు మరో కమిటీ వేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఖరీఫ్ పంట రుణాల పంపిణీని బ్యాంకులు పూర్తిగా పక్కన బెట్టాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి జిల్లాలో పంట రుణాలు 4,02,952 అకౌంట్లకు సంబంధించి రూ.2560.47 కోట్లు, అలాగే బంగారంపై వ్యవసాయ రుణాలు 1,21,086 ఖాతాలకు సంబంధించి రూ.1042.83 కోట్లు బకాయిలుగా ఉండిపోయాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రైతులు పంట రుణాలు చెల్లించడం లేదు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు, మహిళల డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టమైన హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు తర్వాత మాఫీకి తూట్లు పొడవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నించారు. అధికారం చేపట్టింది మొదలు రుణమాఫీపై జాప్యం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి ఇటీవల కుటుంబానికి రూ.1.50 లక్షలు, డ్వాక్రా సంఘానికి రూ.లక్ష ప్రకారం మాత్రమే మాఫీ చేస్తామంటూ ప్రకటించారు. ఈ ప్రకటనపై ఒకవైపు రైతులు, మరోవైపు పొదుపు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి రుణ మాఫీ చేయాలని పోరుబాట పట్టారు. రీషెడ్యూల్‌తో అన్నదాతకు భారమే.. రుణ మాఫీని జాప్యం చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రీషెడ్యుల్ వైపు మొగ్గు చూపుతున్నారనే విమర్శలున్నాయి. రీ షెడ్యూల్ అంటే రైతులపై భారం మోపడమేనని బ్యాంకర్లే పేర్కొంటున్నారు. ఇప్పుడు బకాయి పడిన రుణాన్ని చెల్లించడాన్ని మూడేళ్ల పాటు వాయిదా వేయడమే రీ షెడ్యూల్. మూడేళ్ల తర్వాత వాయిదాల పద్ధతిలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంది. రీ షెడ్యూల్ చేసిన రోజు నుంచే 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. దీంతో వడ్డీ భారం పడుతుండటంతో రైతులు దీనికి ముందుకు వచ్చే పరిస్థితి లేదని బ్యాంకర్లే పేర్కొంటున్నారు. డీఫాల్టర్లుగా రైతులు.. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి రైతులను డిఫాల్టర్లు(ఎగవేతదారులు)గా మార్చింది. గతేడాది ఖరీఫ్‌లో తీసుకున్న రునాలను మార్చిలోగా చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించకపోయినా జూన్ వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ లోగా రుణాలు చెల్లిస్తే డీఫాల్టర్లుగా మారే అవకాశం ఉండదు. రుణమాఫీపై నాన్చివేత ధోరణి అవలంబిస్తుండటం, కుటుంబానికి రూ.1.50 లక్షలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా అది ఎప్పటి నుంచి అమలయ్యేది స్పష్టం చేయలేదు. దీంతో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. ప్రభుత్వం వైఖరితో రైతులు ఇన్సెంటివ్‌లకు దూరమయ్యారు. ఇప్పుడు డీఫాల్టర్లుగా మిగిలారు. మార్గదర్శకాలు రాలేదు - నరసింహరావు, ఎల్డీఎం రుణ మాఫీకి సంబంధించి ఇంతవరకు మార్గదర్శకాలు రాలేదు. శుక్రవారం రిజర్వు బ్యాంకు అధికారులు కర్నూలుకు వస్తున్నారు. కలెక్టర్ దగ్గర ప్రత్యేక సమావేశం ఉంది. అందులో రుణ మాఫీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రుణ మాఫీపై స్పష్టత లేనందున ఇంతవరకు జిల్లాలో పంట రుణాల పంపిణీ మొదలు కాలేదు. -
అనుకున్నదొక్కటి.. అవుతోందొక్కటి!
అంతా గందరగోళం! రుణమాఫీ, రీషెడ్యూల్, కొత్త రుణాలపై కొరవడిన స్పష్టత రైతు జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం అనంతపురం అగ్రికల్చర్ : ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రుణమాఫీ.. రీషెడ్యూల్, కొత్త రుణాల అనంతపురం అర్బన్ : మంజూరుపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ వ్యవసాయ రుణాలు రద్దవుతాయని రైతులు ఆశించారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం నుంచి రోజుకోమాట వెలువడుతుండటంతో ‘అనంత’ రైతులకు దిక్కుతోచడం లేదు. రుణమాఫీపై నెలరోజులుగా కసరత్తు కొనసాగిస్తున్నా కొలిక్కి రాకపోవడంతో సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు రీషెడ్యూల్‌పై దృష్టి సారించారు. రీషెడ్యూల్ చేసినా దానికి కూడా పరిమితులు విధించి అమలు చేసే పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది. మొండిబకాయిలతో పాటు గతేడాది రెన్యూవల్ చేసుకున్న రుణాలు, కొత్త రుణాలు అన్నింటినీ చేస్తారా...? లేదంటే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారా అనేది తేలడం లేదు. ఇక బంగారు నగలు కుదువ పెట్టి తీసుకున్న రుణాలు, టర్మ్లోన్లు గురించి ప్రస్తావనే లేకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రీషెడ్యూల్ కు జవాబుదారీ వహించాల్సి ఉండటంతో భవిష్యత్తులో పరిస్థితి ఏమిటనే ప్రశ్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రీషెడ్యూల్ చేయడం వల్ల ఏడాది తరువాత పంట రుణాల నుంచి టర్మ్లోన్లుగా మార్పు చేస్తారు. దాని వల్ల రైతులపై అదనపు వడ్డీ భారం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ప్రభుత్వం వద్ద స్పష్టమైన విధానం లేకపోవడంతో అటు రైతులు ఇటు బ్యాంకర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ చేసి ఉంటే 10,24,577 మందికి లబ్ధి చంద్రబాబునాయుడు బేషరతుగా రుణమాఫీ చేసి ఉంటే జిల్లాలో 10,24,577 మందికి ప్రయోజనం కలిగి ఉండేది. ఏకంగా రూ.6,817.61 కోట్ల రుణాలు రద్దు అయ్యే పరిస్థితి ఉండేది. అందులో పంట రుణాల కింద 6,08,874 మంది రైతులకు సంబంధించి రూ.3,093.06 కోట్లు, బంగారు నగలు కుదవ పెట్టి 2,12,057 మంది తీసుకున్న రూ.1,851.18 కోట్లు, వ్యవసాయానుబంధ రుణాలు, టర్మ్లోన్లు కింద 2,03,646 మందికి చెందిన రూ.1,873.61 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండేది. అది జరిగివుంటే జిల్లాలోని రైతు కుటుంబాలు రుణ విముక్తులయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. రీ షెడ్యూల్ చేస్తే 5,33,841 మందికి ప్రయోజనం గత ఏడాది (2013-14) రుణాలు రెన్యువల్ చేసుకున్న వారికి, కొత్త రుణాలకు రీ షెడ్యూల్ చేస్తే 5,33,841 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రూ.2,289.33 కోట్ల రుణాలకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 2,12,057 మంది రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ.1,851.18 కోట్లు ఉండగా... అందులో కేవలం గతేడాది 1,39,595 మంది రైతులు రూ.986.42 కోట్లు రుణాలు తీసుకున్నారు. రీషెడ్యూల్ చేస్తే బంగారు నగలకు తీసుకున్న రుణాల పరిస్థితి అయోమయంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జిల్లాలోని 63 మండలాలను కరువు జాబితాలో ప్రకటించిన ఫలితంగా పూర్తిస్థాయిలో రీషెడ్యూల్ జరిగే పరిస్థితి నెలకొంది. బోసిపోయిన బ్యాంకులు ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర అవుతున్నా రుణమాఫీ లేక, రీషెడ్యూల్ చేయక, రెన్యువల్, కొత్త రుణాలు అందక, వాతావరణ బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితులో ‘అనంత’ రైతులు దర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఈ సమయంలో రైతులతో కిక్కిరిసివుండాల్సిన బ్యాంకులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆర్బీఐ నుంచి ఉత్తర్వులు విడుదల అయితే కొంతవరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. -
రుణమాఫీ అమలుపై తాజా ప్రతిపాదన
సాక్షి, ఒంగోలు: రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కగా మారింది. బ్యాంకుల రుణాలు చెల్లించొద్దని చెప్పినవారే.. నేడు నెత్తిన బండ మోపుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేతగాదంటూ చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా రోజుకో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ‘తొలిసంతకం’ అమల్లోకి రాకపోవడంపై అంతటా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఆయన రాష్ర్ట బ్యాంకర్లతో సమావేశమైనా.. ఆర్బీఐకి లేఖలు రాసి అనుకూల స్పందన రాలేదు. ఈక్రమంలో మెడపై కత్తిని కొంతకాలం దూరంపెట్టేందుకే రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదన తెచ్చినట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే, ఏదో ఒక కారణం లేనిదే రీషెడ్యూల్ చేయడం కుదరదని ఆర్బీఐ చెప్పడంతో కిందటేడాది తుపాను, కరువును తెరమీదికి తెచ్చారు. మొత్తానికి రుణాల మాఫీ హామీ దాటవేతకు ముఖ్యమంత్రి రైతులను తిమ్మినిబమ్మిని చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సరిగ్గా పదేళ్ల కిందట టీడీపీ అధికారంలో ఉండగా, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తుపాను ప్రభావిత మండలాల్లో పర్యటిస్తూ.. ‘వ్యవసాయం దండగ మారిదని...’ వ్యాఖ్యానించిన విషయం రాష్ట్రవ్యాప్త సంచలనమైంది. అప్పట్నుంచి రైతువ్యతిరేకి అనే అపనిందను తొలగించుకునేందుకు టీడీపీ పాట్లు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం రుణాలమాఫీ ఆచరణ కాదంటూ.. రీషెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో బాబు గతకాలపు ఏలుబడిని రైతులు మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కొత్తప్రభుత్వం పాతరుణాలు మాఫీతో కొత్తగా ఖరీఫ్సాగు పెట్టుబడులొస్తాయని ఆశించిన రైతన్నకు భవిష్యత్ అగమ్యగోచరమైంది. జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల విలువైన రైతు రుణాలు మాఫీకావాల్సి ఉంది. జిల్లాలో 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే మరో రూ.488.67 కోట్ల మేరకు మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ ప్రకటనల నాటినుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని.. బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత రుణాలు రైతుపేరు మీదే.. రుణాల రీషెడ్యూల్ అమలుపై సోమవారం ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే, ఈవిధానాన్ని కూడా జిల్లామొత్తం వర్తించకుండా.. కేవలం కొన్ని మండలాలకే పరిమితం చేస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కిందటేడాది ఎక్కడైతే తుపాను, కరవు సంభవించినట్లు ప్రభుత్వం గుర్తించిందో.. అక్కడి రైతులకే రుణాల రీషెడ్యూల్ చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆమేరకు జిల్లాలో 45 తుపాను ప్రభావిత మండలాలు, నాలుగు కరువుపీడిత మండలాలంటూ ఈఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. గడువు మీరిన బకాయిలన్నీ రైతులపేరు మీదనే ఉండి.. రుణం తీసుకున్న నాటినుంచి ఇవ్పటి వరకు వడ్డీ 11.75 శాతంను అసలు మొత్తంతో కలిపి లెక్కించి బకాయిగా రికార్డులో నమోదు చేయనున్నారు. కొత్తగా ప్రస్తుతం రుణాలిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే, జిల్లాలోని 5 లక్షల మంది రైతుల్లో 49 మండలాల రైతులకే రీషెడ్యూల్ వర్తిస్తే.. మిగతా వారి రుణాల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా. పైగా, బ్యాంకరు రైతు వద్దనున్న అన్ని ఆధార ధ్రువీకరణలు, పొలం పుస్తకాలు చూసిన తర్వాతనే రుణాలిస్తారని... ఆధార్‌కార్డు వంటి షరతులు పెట్టి ప్రభుత్వం రైతులను అనుమానించే ప్రయత్నం చేస్తోందని రైతుసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రీషెడ్యూల్ వర్తించే మండలాలివే.. ప్రభుత్వం తుపాను, కరవు మండలాల రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ కుదురుతోందని ప్రకటించనుంది. ఈమేరకు జిల్లాలో 45 మండలాలు తుపాను ప్రభావితం కాగా.. ఒంగోలు డివిజన్ పరిధిలో అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జే.పంగులూరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మద్దిపాడు, మార్టూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పర్చూరు. సంతమాగులూరు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలున్నాయి. కందుకూరు డివిజన్లో దర్శి, దొనకొండ, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, కందుకూరు, కొండపి, కురిచేడు, మర్రిపూడి, ముండ్లమూరు, పొదిలి, సింగరాయకొండ, తాళ్లూరు, తర్లుపాడు మండలాలున్నాయి. మార్కాపురం డివిజన్లో అర్థవీడు, బేస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం మండలాల రైతులకే రీ షెడ్యూల్ వర్తించనుంది. -
అప్పుడే మొదలు
రుణమాఫీపై కొరవడిన స్పష్టత రీషెడ్యూల్పైనా అయోమయం బకాయిలు చెల్లించాలంటున్న బ్యాంకర్లు ప్రైవేటు అప్పుల కోసం రైతుల అగచాట్లు వరుణుడు కరుణించినా.. ప్రభుత్వం మాత్రం అన్నదాతలతో పరిహాసమాడుతూనే ఉంది. కురుస్తున్న వర్షాలు కొత్త ఆశలు చిగురింపచేస్తున్నా.. చేతిలో చిల్లి గవ్వ లేక రైతు దిక్కులు చూస్తున్నాడు. రుణ మాఫీ పేరుతో వంచించిన ప్రభుత్వం తాజాగా రీ షెడ్యూల్ ప్రకటన తెరపైకి తెచ్చింది. అయితే అన్నదాతలు బ్యాంకులకు వెళితే తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ సిబ్బంది తిప్పి పంపుతున్నారు. దాంతో ఖరీఫ్ మదుపుల కోసం అంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్ : తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు హామీలు కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విషయాన్ని తేల్చలేదు. రుణాలు రీషెడ్యూల్కు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు బ్యాంకర్లకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. రీషెడ్యూల్ కారణంగా వడ్డీ భారమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు ప్రస్తుత అధికార పార్టీ రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఈ ఖరీఫ్‌లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే ఇవ్వాలన్నది లక్ష్యం. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 1668 మంది రైతులకు కేవలం 3.03 కోట్లు రుణాలు మాత్రమే అందజేశారు. మిగిలిన వారు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వలేక పంటలు వేయలేని దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణాలు అందించే విషయంలో సత్వరం చర్యలు తీసుకోని పక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. బ్యాంకర్లు... మరో‘సారీ’ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు దాటినా ఇంతవరకు రుణ మాఫీపై స్పష్టత లేకుండా పోయింది. దీనికై సీఎం వేసిన ప్రత్యేక కమిటీ నేటికీ నివేదిక ఇవ్వలేదు. దీంతో ఇటీవల రుణ మాఫీ స్థానే రీ షెడ్యూల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానాన్ని ప్రకటించి రోజులు గడుస్తున్నా దీనికి సంబంధించిన విధి విధానాలపై బ్యాంకర్లకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు వారు ఇదే విషయాన్ని చెప్పి తిరిగి పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అడపా, దడపా చినుకులు పడుతుండడంతో రైతులు సాగు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పులు చేయక తప్పదంటూ ఆవేదన చెందుతున్నారు. రుణాలు ఇస్తేనే... నాది గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ ద్వారకానగర్. ఏటా 6 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేస్తాను. ప్రస్తుతం అడపాదడపా వర్షా లు పడుతున్నాయి. బ్యాంకర్లు అప్పులిస్తారన్నఆశతో గ్రామం లోని పెద్దల వద్ద చేబదులుగా కొంత నగదు తెచ్చి విత్తనాలు జల్లాను. ఉబాలు, నాట్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు మరి కొంత అవసరం ఉంటుంది. రుణం విషయమై బ్యాంకర్లు నోరు మెదపకపోవడంతో ప్రైవే టు అప్పుల కోసం తిరుగుతున్నాను. - సుర్ల సన్యాసిపాత్రుడు, రైతు, పాత మల్లంపేట ప్రైవేటు అప్పులే దిక్కు నాది గొలుగొండ మండలం జోగుంపేట. నాకున్న ఐదెకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యాను. గతేడాది పంట కలిసిరాకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించలేకపోయాను. ఈ ఏడాది రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్లు కొత్త అప్పులిచ్చేందుకు వెనుకంజవేస్తున్నారు. ఇలా అయితే ప్రైవేటు అప్పులతో బాగా నష్టపోవడం తప్పదు. - కె.రామకృష్ణ, రైతు,జోగుంపేట. -
అటకెక్కిన రుణ మాఫీ!
రీషెడ్యూల్కు ఆర్బీఐ సూత్రప్రాయంగాఅంగీకరించింది: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రీషెడ్యూల్ ఎన్నేళ్లు, ఎవరికి వర్తిస్తుంది, ఎవరు కట్టాలి, ఎలా కట్టాలో తర్వాత ఆలోచిస్తారట! హైదరాబాద్: వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. దాన్నిప్పుడు అటకెక్కించినట్టే కన్పిస్తోంది. మాఫీ సంగతి పక్కనపెట్టి రుణాల రీషెడ్యూల్‌మీదే దృష్టి సారిస్తోంది. పైగా దీన్నే పెద్ద ఘనతగా చూపుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి రీషెడ్యూలు చేయడం వల్ల రైతుల రుణాలు వారి పేరుతోనే ఉంటాయి. పైగా వడ్డీ భారీగా పెరిగి తడిసి మోపెడవుతుంది. వ్యవసాయ రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ గవర్నర్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు ఒకటీ రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నెల పూర్తయిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రీషెడ్యూల్ ఐదేళ్లా, ఏడేళ్లా, విధివిధానాలేమిటి వంటివి ఉత్తర్వుల్లో స్పష్టమవుతాయన్నారు. రీషెడ్యూల్ ఎంతమందికి వర్తిస్తుందో విధివిధానాలు వచ్చాకే చెప్తామన్నారు. రుణ మాఫీ ఎప్పుడంటే మాత్రం స్పష్టతనివ్వలేకపోయారు. ‘‘ప్రస్తుతానికి రీషెడ్యూల్కు ఆర్బీఐ అంగీకరించింది. రీషెడ్యూల్ అవడం వల్ల రైతులకు ఈ ఖరీఫ్‌కు కొత్త రుణాలు అందుకునే అవకాశం దొరుకుతుంది. రుణమాఫీనా, రీషెడ్యూలా, ఏదైతేనేం.. రైతుల కోసం మేం అన్నిరకాలుగా ఆలోచిస్తున్నాం. తరవాత రుణ బకాయిలు ఎవరు కట్టాలో ఎలా కట్టాలో ఆలోచిస్తాం. రైతులపై మాత్రం భారం పడనీయం’’ అని చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుందా? లేదా? కరువు, తుపాను ప్రభావిత మండలాల జాబితాలో లేని 86 మండలాలకూ రీషెడ్యూల్ వర్తిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా, ఆర్బీఐ రెండు రోజుల్లో విధివిధానాలు పంపిస్తుందని, దాని ప్రకారం ఎవరికి ఎలా వర్తింపచేయాలో చెప్తామని దాటవేశారు. రైతుపై మరింత భారం రీషెడ్యూల్ యోచనపై బ్యాంకర్లు హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల బ్యాంకర్లు మండిపడుతున్నారు. ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారో చెప్పకుండా నాన్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫలానా తేదీవరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని, ఇప్పటికే రుణాలు కట్టిన వారుంటే వాటికి కూడా మాఫీ వర్తింపజేస్తామని జీవో జారీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇలా జీవో జారీ చేస్తే రైతులు చాలా మంది రుణాలను చెల్లించి, కొత్తవి తీసుకుంటారని, తరువాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగానో, లేదా మరో తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పకపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులపై 12 శాతం మేరకు వడ్డీ భారం పడుతుంది తప్ప, వారికి ఊరట లభించదనే బ్యాంకర్లు అంటున్నారు.