రేగోడ్: రుణమాఫీ పొందిన అర్హులైన రైతులందరికీ పంట రుణాలు రీషెడ్యూల్ చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీఏ) హుక్యానాయక్ తెలిపారు. మండలంలోని మేడికుంద గ్రామ శివారులో రైతులు సాగు చేసిన పత్తి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ.. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ త్రీజీ గుళికలను ఎకరాకు పది కిలోల చొప్పున పొలంలో చల్లుకోవాలని సూచిం చారు. పత్తిలో రసంపీల్చే పురుగు నివారణకు లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిపేట్ మ ందును పిచికారీ చేయాలని తె లిపారు.
పత్తి గూడ రాలకుండా ఉండేందుకు మల్టీ కే మం దును స్ప్రే చేసుకోవాలని తెలిపారు. పచ్చ పురుగు నివారణకు లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ ముందును పిచి కారీ చేయాలని చెప్పారు. కందిలో ఆకుముడత పురుగు నివారణకు లీటరు నీటిలో ఒక గ్రాము ఎసిపేట్ మందును లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును కలుపుకుని పిచికారీ చేయాలని తెలిపారు. పంటల సాగులో క్రమం తప్పకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణాలను రీషెడ్యూల్‌లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని బ్యాంకర్లకు సూచించారు.
వట్‌పల్లిలోని బ్యాంక్ అధికారులు తమకు రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆయనతో తెలిపారు. అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటానని జేడీఏ చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదాతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ ప్రసాద్, ఏఈఓ ఇంద్రయ్య, ఎంపీటీసీ అప్పారావ్, నాయకులు టి.శంకరప్ప, రైతులు ఉన్నారు.
అర్హులందరికీ పంట రుణాలు
Published Wed, Sep 24 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement