జిల్లాలో పంట రుణాల మాఫీ లెక్కల అంశం కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా రూ.1035 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సిందిగా అధికారులు లెక్క తేల్చారు. మాఫీ ప్రక్రియతో జిల్లాలో 2.10లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
ఇందులో బంగారంపై రుణాలకు సంబంధించి రూ.101.3కోట్లు మాఫీ కానుంది. రుణమాఫీకి సంబంధించి మండలాల వారీగా వచ్చిన వివరాల ఆధారంగా జిల్లా స్థాయిలో జాబితాను క్రోడీకరించారు. ఈ క్రమంలో రూ.1035 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. అయితే జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ(డీసీసీ) ఆమోదం పొందిన అనంతరం ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం డీసీసీ ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
రుణమాఫీ రూ.1,035 కోట్లు
Published Wed, Sep 10 2014 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement