రుణమాఫీపై బిగ్‌ ట్విస్ట్‌.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల | Telangana Govt Released Guidelines Over Crop Loans | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై బిగ్‌ ట్విస్ట్‌.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

Published Mon, Jul 15 2024 3:42 PM | Last Updated on Mon, Jul 15 2024 4:37 PM

Telangana Govt Released Guidelines Over Crop Loans

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ‍క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, రైతుల రుణమాఫీపై తెలంగాణ సర్కార్‌ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రతీ ‍యూనిట్‌లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ అమలుకు రేషన్‌ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. 

అలాగే.. రెండు లక్షల పైబడి ఉన్నా రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. ఇక, 12 డిసెంబర్‌ 2018 నుంచి 9 డిసెంబర్‌ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు. ఇక, ఒకవేళ తప్పుగా ఎవరైనా రుణమాఫీ తీసుకుని ఉంటే వారికి డబ్బులు చెల్లించినట్టు అయితే, మళ్లీ డబ్బులను వారి వద్ద నుంచి ప్రభుత్వం తీసుకోనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement