runa mafi
-
రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా చేయలేదు: మంత్రి పొంగులేటి
సాక్షి,హైదరాబాద్: ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ధరణి సమస్యలు ఎక్కువగా వచ్చాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై పొంగులేటి బుధవారం(నవంబర్ 13) మీడియాతో మాట్లాడారు.‘భూములున్న వారిని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది.గ్రామ సభలో ఇంధిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.పైరవీలు అవసరం లేదు.కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.అసెంబ్లీలో కొత్త భూ చట్టం వివరాలు వెల్లడిస్తాం.ప్రతిపక్ష నేతల సలహాలు కూడా కొత్త చట్టం లో తీసుకుంటాం.ఇటీవల ధరణి బాధ్యతలు ఎన్ఐసికి ఇచ్చాం. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతు భరోసా కూడా ఇస్తాం’అని పొంగులేటి తెలిపారు.ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డికి లిక్కర్ అమ్మకాలపై ప్రేమ ఎక్కువైంది: హరీశ్‌రావు -
కోతల రుణమాఫీతో కుటుంబాల్లో చిచ్చు: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: అన్నదాత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది పచ్చి మోసమని, తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం(సెప్టెంబర్8) తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘మేడ్చల్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్‌రెడ్డికి ఏపీజీవీబీలో అప్పు ఉంది. సురేందర్ రెడ్డి తల్లికి లక్షా 15 వేలు ,సురేందర్ రెడ్డికి లక్షా 92 వేలు అప్పు ఉంది. బ్యాంకు మేనేజర్‌ను అడిగితే కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్‌రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్‌రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. రేవంత్‌రెడ్డిది పూటకో మాట. ఆయన వైఖరి పొద్దు తిరుగుడు కంటే వేగంగా మారుతోంది. రుణమాఫీకి రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పావ్. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ ఉన్నదని నిరూపితం అయ్యింది. రేవంత్ పాలనకు సురేందర్‌రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిది.రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారు. కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్ఛిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. సిద్దిపేటలో నియోజకవర్గంలో జక్కాపూర్ గ్రామంలో గురజాల బాల్‌రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉంది. వారికి ఆరు లక్షల అప్పు ఉంటె కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం ,దగా కాదా ?రైతు రుణ మాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోంది. నారాయణ్‌పేట గ్రామంలో నల్ల మణెమ్మ అనే రైతుకు లక్ష రూపాయల అప్పు ఉంది. ఆమె భర్త 2010 లో మరణించారు. ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణ మాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2010లో ఆధార్ కార్డు ఇవ్వనప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారు ? కుంభాల సిద్ధారెడ్డి ,చాట్ల హరీష్ అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తెమ్మంటున్నారు. వారికి పెళ్లిళ్లే కాలేదు. భార్యల ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారు ? ఇలాంటి వాళ్ళు ఎంత మందో ఉన్నారు. రుణ మాఫీ కోసం వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాలా ? 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణ మాఫి అయ్యింది. 21 లక్షల రైతుల మందికి ఇంకా కావాలి. రుణ మాఫీ అయ్యింది నన్ను బావిలో దూకమని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు ఎవరు బావిలో దూకాలి. కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్. ఇది కటింగ్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే కోతలు అన్నట్టుగా తయారైంది ..ఎన్నికలపుడు కట్టు కథలు చెప్పారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయి. సురేందర్‌రెడ్డిని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఆత్మహత్య కాదు. ప్రభుత్వం చేసిన ఆత్మహత్య. 2 లక్షల రుణం పైన ఉన్న వారు మిగతా డబ్బు బ్యాంకులకు కట్టాలి అంటున్నారు. ఎందుకు కట్టాలి. మోకాలికి బోడి గుండుకు ఎందుకు లింక్ పెడుతున్నారు ?కేసీఆర్ హయాంలో ఇలాంటి నిబంధనలు ఏవైనా ఉన్నాయా ?వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు? రైతుల ఆత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు ? ఇప్పటిదాకా 470మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు భరోసా అనేది బ్రహ్మ పదార్థం అయ్యింది. పెట్టుబడి సాయం అర్థం తెలుసా ? కేసీఆర్ పదకొండు విడతలుగా రైతు బంధు ఇచ్చారు. యాసంగి పంట వేసే టైం వస్తోంది.. వానా కాలం రైతు బంధు ఇవ్వరా ? వడ్లకు బోనస్ బోగస్‌గా మారింది. సన్న వడ్లకే బోనస్ అని సన్నాసులే అంటారు. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయనందుకు రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాట్లాడాను .ఇది వాస్తవం కాదా ? రేవంత్ పాలనలో మత కలహాలు పెరిగి పోయింది నిజం కాదా? తొమ్మిది నెలల రేవంత్ పాలన లో 247 ఇల్లీగల్ వెపన్ కేసులు నమోదవలేదా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
TG: ప్రభుత్వ ఆఫీసులో రైతు ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్‌జిల్లా: రుణమాఫీ కాలేదని మేడ్చల్ జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌లో నివాసం ఉండే రైతు సురేందర్ రెడ్డి(52) తనకు రుణమాఫీ కాలేదని శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రైతు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేవంతే బీజేపీలోకి.. ఆ మాట అనలేదా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తాం. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తాం. కలెక్టర్లలకు, సీఎస్‌కు డేటా ఇస్తాం. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే మేము డేటా ఇస్తున్నాం. మా హరీష్ రావు ఆఫీసుపై దాడి చేశారు. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారు. ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తాం. 973 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లో మా చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు.. వారి నుంచి వివరాలు సేకరిస్తాం. మొదట వినతిపత్రాలు ఇస్తాం.. రాజకీయం చేయకుండా ముందు రిప్రజెంటేషన్ ఇస్తాం. సాక్షి పత్రిక చాలా చక్కటి వార్త రాసింది. 50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22 లక్షల రైతులకే పరిమితం చేశారు. కేవలం 40 శాతం మాత్రమే రుణ మాఫీ అయ్యింది. ఇంకా సుమారు 28 లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు. క్షేత్ర స్థాయిలో రిపోర్టులు సేకరించి కలెక్టర్లకు ఇస్తాం.. ఆ తర్వాత సచివాలయంలో ఇస్తాం. హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి మీద దాడి చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు. ముఖ్యమంత్రికి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఒక ఐపీఎస్ అధికారిని కొట్టినంత పని చేశారు. ఫాక్స్ కాన్ సంస్థలో లక్ష ఉద్యోగులు కల్పిస్తామని గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఫాక్స్ కాన్ సంస్థ ఒక దశ పూర్తి అయ్యింది. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన రాబోతుంది. సీతారామ ప్రాజెక్టు మాదిరిగా ఫాక్స్ కాన్ రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెబుతారు. మాకు కేంద్ర మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు.రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి..‘ప్రధానమంత్రి మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం. నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి?. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.మహిళా కమిషన్ నోటీసులపై..నాకు మహిళా కమిషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు వెళ్తా. చట్టాన్ని గౌరవిస్తాను. 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, బాధితుల వివరాలు అన్ని తీసుకొని వెళ్తా. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతా. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తాను’’ అని అన్నారు. -
రాజీనామాకు సిద్ధమా హరీష్?: రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, వైరా: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం. హరీష్‌రావు సవాల్ ప్రకారం.. రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యిందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, సీఎం రేవంత్ వైరాలో రైతు రుణమాఫీ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రుణమాఫీని భట్టి విక్రమార్క సవాల్‌గా తీసుకున్నారు. విక్రమార్క.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టడానికి లెక్కలు వేసి హామీని నెరవేర్చారు. రుణమాఫీ చేస్తే.. హరీష్‌రావు రాజీనామా చేస్తాను అన్నాడు. సిగ్గు, శరం ఉంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలి. ఎంత మంది అడ్డుపడినా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. సవాల్ చేసిన మాట ప్రకారం.. హరీష్ రావు రాజీనామా చేయాలి. సిద్దిపేటకు పట్టిన పీడ విరగడవుతుంది. హారీష్‌రావు.. అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గాడిద గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి. బీఆర్ఎస్ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
రుణమాఫీపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.కాగా, రైతుల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రతీ యూనిట్లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. అలాగే.. రెండు లక్షల పైబడి ఉన్నా రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. ఇక, 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు. ఇక, ఒకవేళ తప్పుగా ఎవరైనా రుణమాఫీ తీసుకుని ఉంటే వారికి డబ్బులు చెల్లించినట్టు అయితే, మళ్లీ డబ్బులను వారి వద్ద నుంచి ప్రభుత్వం తీసుకోనుంది. -
ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీతోపాటు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. -
రైతులకు గుడ్‌న్యూస్.. రైతుభరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ చెప్పారు.కాగా, ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఎన్నికల వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త అందించారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే, ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా ఏడు లక్షల 60 వేల మందికి ఇప్పటికే వేశాం. మిగిలిన నాలుగు లక్షల మందికి వేస్తాం’ అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్..‘ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచి. కేసీఆర్ నామా నాగేశ్వరరావును బకరాను చేస్తున్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తారు. నామాకు సూచన చేస్తున్నాను. కేసీఆర్ మాటలు వినకు. గత డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు సెమీ ఫైనల్స్. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫైనల్ తీర్పు రాబోతుంది. గుజరాత్ టీమ్‌ను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సీఎం రేవంత్ ఇలాంటి ప్రకటన చేయడం కోడ్ ఉల్లంఘనకు కిందకు వస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమే రేవంత్ ఇలాంటి కామెంట్స్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా, సింగరేణికి బొగ్గు బావులు తవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది.సింగరేణి పరిసరాల్లోని బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెప్పపాటుసేపు కూడా కరెంటు పోవడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోయే ప్రసక్తే లేదు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కామెంట్స్ చేశారు. -
‘రుణమాఫీ ప్రకటించకపోతే.. సచివాలయాన్ని ముట్టడిస్తాం: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులను ఆదుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే లక్షలాది రైతులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని, రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదని ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదని దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి 100 పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. చదవండి: హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, వరి పంటకు క్వింలాటల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామమని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ప్రకటించాలని, లేదంటే రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. ‘నిన్నటి వరంగల్ పర్యటన లో రైతుల కన్నీళ్ళు కష్టాలు కనిపించాయి. అక్కడ కొంత మంది ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు రావటం లేదని, లక్షలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కనీసం మా తాండాల్లో తాగు నీరు కూడా రావటం లేదని ఆవేదన చెప్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఓ సమీక్ష లేదు, పరామర్శ లేదు. అటెన్షన్ డైవర్షన్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది ప్రభుత్వం. చేరికల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. పంటలు ఎండిపోయి, రైతుబంధు రాక, వడగళ్ల వానతో పంటలు నష్టపోతుంటే అప్పులు కట్టాలని బ్యాంకులు రైతులను వేధిస్తున్నారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పులు కట్టొద్దు.. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అధికారులు వేధిస్తే.. మా దృష్టికి తీసుకొస్తే మీకు అండంగా ఉంటాం. రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది. రేపటి నుంచి బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు రైతుల పంట పొలాలకు వెళ్లి పంట నష్టం, రైతుల కష్టాలు రిపోర్ట్ తయారు చేసి పార్టీ కార్యాలయానికి పంపండి. రైతుల గోస ప్రభుత్వానికి తెలియజేయాలి’ అని పేర్కొన్నారు. -
ఫలితాలిస్తోన్న డ్వాక్రా సున్నా వడ్డీ పథకం
-
తెలంగాణలో నేటి నుంచి రైతు రుణమాఫీ
-
రైతుల ఇళ్లకు నోటీసులు !
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు అన్నదాతలకు నోటీసులు పంపుతున్నాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య అన్నారు. సోమవారం వర్ధన్నపేటలో అఖిలపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈరెల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్‌తో కలిసి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. లక్ష వరకు రుణ మాఫీ కోసం రూ.21,557 కోట్లు అవసరమని వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు తేల్చి చెప్పారన్నారు. రూ.37 వేల వరకు ఉన్న 5,42,609 మంది రైతులకు రుణం రూ.1206 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. 31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.20.35 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలున్న 20 లక్షల మంది రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్ల జాబితా లో చేర్చడంతో వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. రుణమాఫీ అమలులో జాప్యం చేయడంతో అసలు వడ్డీ కలిపి అన్నదాతలకు మోయలేని భారంగా మారిందన్నారు. రెన్యువల్ చేయకపోవడంతో రైతులు కొత్తగా సాగు కోసం అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను సంప్రదించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు - నరుకుడు వెంకటయ్య -
ఇదేందయ్యా ఇది లోకేష్ బాబూ.. మైండ్ బ్లాంక్?
శింగనమల/గార్లదిన్నె: టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారని ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్‌ను పలువురు రైతులు ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నె కొట్టాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కాగా, అక్కడకు టీడీపీ శ్రేణులు రైతులను బతిమాలి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘మీ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారు’ అని రాసి అక్కడ ఉంచిన ప్రశ్నోత్తరాల బాక్స్‌లో వేయగా.. వాటి గురించి లోకేశ్ సమాధానం చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానిస్తామని, బటన్ నొక్కగానే వ్యవసాయ యంత్ర పరికరాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. -
పాతది మాఫీ కాక..కొత్త రుణం రాక.. తెలంగాణ రైతుల అరిగోస
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుంటే, ఆ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. రుణాలు రెన్యువల్ కాని వారు డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు పెరిగిపోయాయని పేర్కొంటూ కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రైతుల లక్షలోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రూ.37 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.38 వేల వరకున్న రుణాలతో ఒక బిల్లు, రూ.38 వేల నుంచి రూ. 39 వేల వరకున్న రుణాలతో మరో బిల్లును వ్యవసాయ శాఖ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపించింది. అయితే రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో సొ మ్ము మంజూరు కాలేదని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. సర్కారు సూచన పట్టించుకోని బ్యాంకర్లు రుణమాఫీని ప్రభుత్వం విడతల వారీగా చేస్తోంది. ఈ విధంగా లక్షలోపు రుణమాఫీలో కేవలం రూ.37 వేల వరకు రుణాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మిగతా వారికి రెన్యువల్ సమస్య వచ్చింది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకులు ప్రభుత్వ సూచనను పట్టించుకోకుండా రైతుబంధు సొమ్మును రుణమాఫీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో కొందరి రుణాలు రెన్యువల్ అవుతున్నా, అధిక సంఖ్యలో రైతులు రెన్యువల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని సూచించింది. కొందరు రైతులు అలా చెల్లించగా, కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. రుణమాఫీకి అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈసారి బడ్జెట్లో అయినా రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సొమ్ము కేటాయించి విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రూ.20,164.20కోట్లు కేటాయించినా.. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా 36.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. 2020లో రూ.25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు పంట పెట్టుబడి కోసం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నా. దిగుబడి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంతోషపడ్డా. లక్ష రూపాయలు మాఫీ అయిపోతాయని ఆశగా ఎదురుచూశా. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా వడ్డీ లక్షకు పెరిగింది. ఇప్పుడు యాసంగి సాగుకు బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుని 4.26 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశా. - కముటం స్వామి రైతు, కేసముద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా -
రుణమాఫీపై హామీ నిలబెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ప్రతి వరిగింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రం లోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగలేఖ రాశారు. -
6 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశించింది. ఆ సొమ్మును పూర్తిగా పంట రుణమాఫీ కిందే జమ చేయాలని స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఇదే అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు. అదే రోజు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్లు జమ అవుతాయన్నారు. రుణమాఫీ సొమ్ము జమ కాగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని.. ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనా లని సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరవేయాలని కోరారు. -
స్వేదం చిందిస్తే..కన్నీరే మిగిలే !
సాక్షి, మచిలీపట్నం : ‘నింగి వెన్నపూస వాడు.. నేల వెన్నుపూస నువ్వు’ అంటూ సినీకవి సుద్దాల అభిమానంగా రాసుకున్నా, ‘వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు / కానీ వానికి భుక్తి లేదు’ అంటూ జాషువా పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేసినా, ‘పొలాలనన్నీ / హలాల దున్నీ / ఇలాతలంలో/ హేమంపిండే’ అంటూ శ్రీశ్రీ మొత్తుకున్నా అదంతా నాగలి పట్టి భూమాతను నమ్ముకున్న కర్షకుల స్వేదయాగం గురించే. నారు వేసిన నాటి నుంచి ధాన్యం ఇంటికి చేరే వరకు రైతన్న జీవితమంతా నమ్మకం మీదనే సాగుతుంది. అసలు భూమికి–రైతుకి ఓ విడదీయలేని బంధమే ఉంటుంది. అయితే ప్రకృతి చేసే ప్రకోపానికి, పాలకులు చేసే అకృత్యాలకు చేష్టలుడిగిపోవడం మినహా వీరికి మరో గత్యంతరం కనపడటం లేదు. అరచేతిలో గీతలు అరిగిపోయేదాకా అరకతిప్పినా గుప్పెడు గింజలు ఇంటికి రాలేని పరిస్థితి నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతన్నది. ఇక పాలుతాగుతున్న పొత్తిళ్ల బిడ్డ నీట మునిగితే మాతృమూర్తి ఎలా తల్లడిల్లుతుందో తుపానులు అదే తరహాలో రైతన్న గుండెను పిండేశాయి. పొలం నుంచి పళ్లెంలోకి.. అక్కడి నుంచి నోటి వరకు చేర్చడంలో రైతన్న పడే ప్రయాస పచ్చపాలకుల కళ్లకు కానరాలేదు ఈ ఐదేళ్లలో. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన ఏలికలు పత్తా లేకపోతే కనిపించిన చోటల్లా చేసింది అప్పులే. రుణమాఫీ, పంటల బీమా అంటూ ఏవోవో పేర్లు పెట్టేసి ఆపద కాలంలో నాలుగు చల్లటి మాటలు చెప్పి ఊరడించిన పాలకులు ఆ తరువాత తమ ముఖం చూడకపోతే రైతు బిక్కం ముఖం వేయక ఇంకేం చేస్తాడు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపిన నిర్లక్ష్యాన్ని ఓ మారు రైతుకు గుర్తు చేస్తే కస్సుమంటున్నాడు.తమకేం చేశారో చెప్పాలంటూ నిగ్గదీస్తున్నాడు. పంట సాగుకు అనువైన సమయంలో ప్రభుత్వం సాగునీటిని విడుదల జాప్యం చేయడం.. ధాన్యానికి మద్దతు ధర లేకపోవడం.. పంట చేతికొచ్చే సమయంలో పెథాయ్ తుపాను దెబ్బతీయడం.. పూర్తిస్థాయిలో పంట నష్ట పరిహారం అందక, రుణమాఫీకి నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నష్టాన్ని రబీలోనైనా పూడ్చుకుందామనుకుంటే దాళ్వా సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో ఐదేళ్ల పాటు కర్షకులకు కన్నీళ్లు తప్పలేదు. జిల్లాలో ఇదీ దుస్థితి జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్‌లో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి, మిరప, చెరకు, పసుపు తదితర పంటలు సాగవుతాయి. ఖరీఫ్ సాగు సాధారణ సాగు విస్తీర్ణం 3.23 లక్షల హెక్టార్లు కాగా.. ఏటా 3.28 నుంచి 3.48 లక్షల హెక్టార్ల వరకు సాగవుతోంది. రబీలో సైతం లక్ష హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. కలగానే నీటి విడుదల జిల్లా వ్యాప్తంగా సాగునీరందించేందుకు ప్రధానంగా మూడు కాలువలున్నాయి. కేఈబీ, బందరు కాలువ, ఏలూరు, రైవస్ కాలువలకు కలిపి రోజుకు 10,000 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం 5,300 క్యూసెక్కుల మాత్రమే విడుదల చేశారు. ఈ పరిణామం పంటలపై పడింది. నీరందక ఎండుముఖం పట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. నత్తనడకన ధాన్యం సేకరణ 2.47 లక్షల హెక్టార్లకు 13.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 323 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 7.40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. దీంతో చేసేది లేక రైతులు ధన్యాన్ని తక్కువ ధరకు బహిరంగ విపణిలో దళారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పెరిగిన పెట్టుబడి వ్యయం వరిసాగుకు రైతులకు ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. కోత దశకు వచ్చే సమయానికి ఎకరానికి రూ.35,000 వరకు పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు కోత కూలీ, కుప్పలు వేసేందుకు కూలీ, పురుగు మందుల ధరలు ఇలా మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. ఎకరానికి సగటున రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. తుపాను కల్లోలం వరి కోత సమయంలో రైతులను పెథాయ్ తుపాను కల్లోలం సృష్టించింది. మూడు రోజుల పాటు కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 47,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రూ.27 కోట్లు నష్టం వాటిల్లిందని తొలుత అధికారులు అంచనాలు రూపొందించారు. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి రూ.525 కోట్లు పంట, గొర్రెలు, రహదారులు నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారులు కేంద్రానికి నివేదించారు. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.14 కోట్ల మేర బీమా మంజూరు చేశారు. నష్టపరిహా రంలో మాత్రం నయాపైసా విడుదల చేయలేదు. రుణమాఫీ ఊసేదీ? జిల్లాలో రుణమాఫీ పరిస్థితి దారుణంగా తయారైంది. రుణమాఫీకి 4,44,972 మంది రైతులు అర్హత సాధించారు. మొత్తం రూ.1507 కోట్లు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా రూ.577 కోట్లు, రెండో విడతగా రూ.232, మూడో విడతగా రూ.232 కోట్లు విడుదల చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా మూడో విడత రుణామాఫీనే ఇప్పటికీ 30 శాతం మంది రైతులకు అందలేదు. ఇక నాలుగో విడత, ఐదో విడత అందడమన్నది పెరుమాళ్లకెరుక. ఐదేళ్లలో 48 మంది మృతి! టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 48 మంది రైతులు వ్యవసాయంలో నష్టాలు రావటంతో పంటసాగు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. జీఓ నెంబర్ 421 ప్రకారం అప్పులబాధ తాళలేక చేసుకున్న ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగా గుర్తించాలి. కానీ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టి మరికొంత మందిని ఈ జాబితాలోకి చేర్చకపోవడంతో రైతు కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేస్తే.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. కానీ ఇందులో సింహభాగం కుటుంబాలకు ఇప్పటికే అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస మద్దతు ధర లేదు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దత ధర లభించడం లేదు. ధాన్యం అమ్మిన సొమ్ము కోసం అధికా రులు చుట్టూ తిరగడమే సరిపోయింది. నాకు ఉన్న నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని అమ్ముకున్నా. ధాన్యం ఒకరు తీసుకున్నారు. సొమ్ములకు మరొకరిని కలవమంటున్నారు. రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. కాళ్లు అరుగు తున్నాయి తప్ప కనికరించే వారు కరువయ్యారు. వెళ్లిన ప్రతిసారి అధికారులకు విన్నవించినా పట్టించుకోని పరిస్థితి ఉంది. వ్యవసాయానికి చేసిన అప్పులుకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడ్డాం. అప్పులు ఎలా తీర్చాలి, ఇంట్లో ఎలా తినాలి. – సగ్గుర్తి నాగభూషణం, పుల్లూరు, మైలవరం -
రుణమాఫీ ఒట్టిమాటే..
‘అన్నదాతలను ఆదుకుంటా. రుణమాఫీ చేస్తా.’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో కొండంత రాగం తీసి గద్దెనెక్కాక వేలాది మందికి గోరంత సాయం కూడా చేయలేదు. రుణమాఫీ హామీ ఒట్టిమాటే అని తేలిపోయింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని రైతులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి, దొరవారిసత్రం (నెల్లూరు): ఉమ్మడి రాష్ట్రంలో ఏకాలంలో రైతు రుణమాఫీ చేసి అన్నదాతలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఆయన మరణానంతరం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి వారిని నట్టేట ముంచారు. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రుణ ఉపశమన అర్హత పత్రాలు పొందిన రైతులకు కూడా ఇంకా బ్యాంకుల్లో మాఫీ నగదు పూర్తిస్థాయిలో జమ కాలేదు. అన్నదాతలు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం మాది రైతు ప్రభుత్వం అంటూ అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇదీ పరిస్థితి సూళ్లూరుపేట సబ్ డివిజన్ పరిధిలోని దొరవారిసత్రం, తడ, సూళ్లూరుపేట మండలాల్లో ఇప్పటివరకు మూడు విడతల్లో 38,198 (కుటుంబాలు 4,270) మంది రైతులకు, నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో పెళ్లకూరు, ఓజిలి, నాయుడుపేట మండలాల్లో మూడు విడతల్లో 51,702 (కుటుంబాలు 4,500 పైబడి) మందికి మాఫీ జరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా తొలి, మలి విడతల్లో ఎంతోమంది రైతుల అకౌంట్లలో నగదు జమ కాలేదు. కొందరికి మాత్రమే కొంత మొత్తంలో నగదు జమచేసి మిగిలిన వారి గురించి పట్టించుకోలేదు. దీంతో వారు నేటికీ బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా వారికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. బ్యాంక్ అధికారులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారని రుణ ఉపశమన పత్రాలు పొందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాఫీ చేయకుండానే ఐదు సంవత్సరాలు మాటలతో మాయ చేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద.. తెలుగుదేశం పార్టీ హయాంలో మోసపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో వరాలు ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 రెండో ఏడాది నుంచి నాలుగేళ్లపాటు ఇస్తామని చెప్పారు. ♦ బీమా ప్రీమియం మొత్తం చెల్లింపు. ♦ వడ్డీలేని పంట రుణాలివ్వడం. ♦ ఉచితంగా బోర్లు వేయించడం. ♦ వ్యవసాయానికి పగటిపూటే ఉచితంగా 9 గంటల కరెంట్ ఇవ్వడం. ♦ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ♦ రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు. ♦ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు. ఈయన పేరు కర్లపూడి చంద్రయ్య. దొరవారిసత్రం మండలంలోని మైలాంగం ఎస్సీ కాలనీ వాసి. ఇతనికి నేలపట్టు రెవెన్యూ గ్రూపు పరిధిలో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బ్యాంకులో రూ.20 వేల వరకు పంటపై రుణం తీసుకున్నాడు. రుణం మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. అయితే అనేకమంది అధికారుల చుట్టూ తిరిగినా రుణ మాఫీ కాలేదు. ఏమి చేయాలో తెలియడంలేదని చంద్రయ్య వాపోతున్నాడు. ఈయన పేరు నాయుడు దయాకర్‌రెడ్డి. దొరవారిసత్రం మండలంలోని తుంగమడుగు గ్రామ వాసి. ఇతనికి వెదురుపట్టు రెవెన్యూ పరిధిలోని 2–11, 5–4, 5–5 సర్వే నంబర్లలో నాలుగెకరాల సాగు భూమి ఉంది. రుణమాఫీకి అర్హుడు. కానీ ఒక్క రూపాయి కూడా వర్తించలేదు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగాడు. నెల్లూరులో ఏర్పాటుచేసిన రైతు సాధికార సంస్థ వద్దకు అనేకసార్లు వెళ్లి వినతిపత్రాలు అందజేశాడు. అయినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. -
బాబు... నీకో దండం
‘‘అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం. బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి చేరుస్తాం.’’ తేనె పూసిన మాటలతో ఎన్నికల ముందు రైతుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన చంద్రబాబు.. ఐదేళ్లు గడిచినా మాట నిలుపుకోలేకపోయారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను, రైతులను టీడీపీ ప్రభుత్వం అప్పుల పాలు చేసి రోడ్డున నిలిపింది. అరకొర రుణమాఫీ వడ్డీలకూ సరిపడక.. తాకట్టులోని బంగారం విడిపించుకునే దారి కనిపించక చుక్కలు చూస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు.. పత్రికల్లో వేలం ప్రకటనలతో అవమాన భారం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టే రోజుకు జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల్లో 10.24లక్షల ఖాతాలకు సంబంధించి రూ.6,817.85 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారం 8.20లక్షల ఖాతాలు రుణమాఫీకి అర్హత సాధించాయి. ఈ లెక్కన రూ.4,944కోట్ల రుణమాఫీ కావాలి. అంటే.. రూ.3,093.06కోట్ల పంట రుణాలు, రూ.1851.18కోట్ల బంగారు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పంట, బంగారు రుణాలు కలిపి కేవలం రూ.2,956కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇదీ ‘బంగారు’ అప్పుల లెక్క జిల్లా వ్యాప్తంగా 2.12లక్షల మంది రైతులు బంగారం తనఖా పెట్టి రూ.1851.18కోట్లు రుణంగా తీసుకున్నారు. సర్కారు లెక్క ప్రకారం ఇవన్నీ మాఫీ కావాలి. అయితే ప్రభుత్వం కేవలం 1.32లక్షల ఖాతాల్లో రూ.905.12కోట్ల బంగారం రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో తక్కిన 79,939 ఖాతాల్లోని రూ.946.06కోట్లు మాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది. అంతటితో ఆగలేదు. మాఫీ చేస్తామని ప్రకటించిన మొత్తంలో కూడా రూ.218.42కోట్లను మాత్రమే మాఫీ చేసింది. ఇదేంటని విపక్షాలు ప్రశ్నిస్తే మొదటి విడత మాఫీ అని, తక్కిన బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని బుకాయించారు. దాదాపు ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. తిరిగి ఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకూ బంగారం రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయింది. అంటే మొత్తంగా జిల్లాలో రైతులకు రూ.1851.18కోట్ల బంగారం రుణాలు ఉంటే ప్రభుత్వం రూ.218.42కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఈ వంచనతో రైతులకు చెందిన రూ.1632.76కోట్ల బకాయి మిగిలింది. మాఫీ చేసిన సొమ్మును.. మాఫీ చేయాల్సిన సొమ్ముకు వడ్డీని ఈ ఐదేళ్లకు లెక్కిస్తే ఏ మూలకూ సరిపోని పరిస్థితి. బంగారం వేలం వేస్తామని నోటీసులు బంగారం రుణాలపై ప్రభుత్వ వ్యవహార శైలిని బ్యాంకర్లు గమనించారు. రుణమాఫీ విధానంపై లోతుగా అధ్యయనం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏటా 20 శాతం రుణమాఫీ చేసినా.. వడ్డీనే 14–18శాతం అవుతుంది. అంటే ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం వడ్డీ కూడా మాఫీ చేయలేని పరిస్థితి. దీంతో తీసుకున్న రుణమాఫీతో సంబంధం లేకుండా తీసుకున్న రుణాలను గడువులోపు చెల్లించాలని బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. ఇవి కాకుండా రైతుల పేర్లు, తీసుకున్న రుణం, వేలం తేదీలను పత్రికల్లో రోజూ పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చారు. రెండేళ్ల పాటు బ్యాంకర్ల నుంచి ఇదే వేధింపులు కొనసాగాయి. పత్రికల్లో వేలం ప్రకటనలు, ఇంటికి నోటీసులు చూసి రైతులు తీవ్ర అవమానానికి లోనయ్యారు. వరుస కరువులతో కుదేలవుతున్న జిల్లా రైతులు పూటగడవటమే కష్టమైన తరుణంలో కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. సత్తువ లేని రైతులు భిక్షాటనకు సిద్ధపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ నోటీసు ఇస్తే తామేం రుణాలు చెల్లిస్తామని రైతులు బంగారాన్ని వదిలేసిన ఘటనలు కోకొల్లలు. ఇంకొందరు అప్పులు చెల్లించలేక, వేలం వేస్తారనే అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలకు తెగించారు. ఇలా గడిచిన 58 నెలల్లో 273 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబాలతో పాటు అప్పులపాలైన లక్షలాది రైతు కుటుంబాల వేదనకు ప్రత్యక్షంగా చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది. రైతులకు అండగా నిలిచిన జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ‘అనంత’ను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలి. ఇక్కడి వ్యవసాయ పరిస్థితులు, కరువు ప్రభావం మరే ప్రాంతంతో పోల్చలేనిది. పైగా ఇక్కడ రెండు పార్లమెంటు స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను జిల్లావాసులు టీడీపీకి కట్టబెట్టారు. అప్పుల బాధ తాళలేక గత ఐదేళ్లలో వందలాది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది. రైతుకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లా పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా విఫలమయ్యారు. కానీ విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఆత్మహత్య చేసుకున్న 82 రైతు కుటుంబాల ఇళ్లకు నేరుగా వెళ్లి భరోసా కల్పించారు. రుణమాఫీ నగదు వడ్డీకి జమ గ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. వేరుశనగతో పాటు రాగి, వరి పంటలు సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో పొలంలో బోరుబావి తవ్విచ్చేందుకు 2013లో అగళి కర్ణాటక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష అప్పుగా తీసుకున్నాం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలను పూర్తిగా విశ్వసించాం. ఆ తర్వాత ఆయన మాట మార్చడం, నగలు వేలం వేస్తామని బ్యాంకోళ్లు నోటీసులు ఇవ్వడంతో ప్రయివేట్‌గా వడ్డీకి తీసుకొచ్చి విడిపించుకున్నా. వచ్చిన అరకొర రుణమాఫీ సొమ్ము వడ్డీకే జమేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం. – విజయ్‌కుమార్, కె.బ్యాడిగెర గ్రామం, రొళ్ల మండలం -
చివరిలో తూచ్..!
రైతుల రుణమాఫీపై తొలినాళ్ల నుంచి టీడీపీ ప్రభుత్వం ఎగవేత ధోరణి ప్రదర్శించింది. గత ఎన్నికల్లో ఈ అంశంపై ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత తర్వాత అమలులో చూపలేదు. ఆరంభంలోనే సవాలక్ష ఆంక్షలు విధించి అర్హుల జాబితాను వడపోసి కుదించింది. తర్వాత మాఫీ ఒక్కసారిగా కాదు అయిదు విడతలని ప్రకటించింది. ఊరించి ఊరించి ఈ అయిదేళ్లలో మూడు విడతలుగా మాఫీ నిధులు విదిల్చింది. నాలుగో విడతకు కాలం కాస్తా ముగిసిపోయింది. ఐదో విడతదీ అదే పరిస్థితి. నాలుగు నెలలుగా అదిగో ఇదిగో అంటూ సర్కారు మాయమాటలు చెబుతోంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటన విడుదలకు ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలింది. దీంతో అసలు సర్కారు మాఫీకి సంబంధించి నిధులు ఇస్తుందా లేదా అన్న అనుమానం రైతులను వెంటాడుతోంది. కొందరైతే ఆశలే వదులుకున్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది. సాక్షి కడప : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే రుణమాఫీ అవుతుందని అన్నదాతలు భావించారు. కానీ వెంటనే దీని ప్రస్తావన తేలేదు. కసరత్తు పేరిట కాలహరణం చేశారు. తర్వాత అనేక రకాల ఆంక్షలు.. నిబంధనలను రూపొందించారు. అర్హులైన అన్నదాతల జాబితాను కుదించారు. బాబు హయాంలో ఇప్పటి వరకూ నాన్చుతూ మూడు విడతల సొమ్ము మాత్రమే విడుదల చేసింది. ఇంకా రెండున్నర లక్షల మంది రైతులకు నాలుగు ..ఐదు విడతల మాఫీ నిధులు విడుదల చేయాల్సి ఉంది. సర్కార్ నాలుగో ఏడాదిలోనే మాఫీ సొమ్ముకు సంబంధించిన మొత్తాలను అందిస్తామని గొప్పలు చెప్పింది. ఇప్పటివరకు రైతుల ఖాతాలకు జమ కాకపోవడంతో మంత్రుల నుంచి ఇతర నేతల వరకు సమాధానం చెప్పలేకపోతున్నారు. వారం వారం రైతులు సోమవారం అధికారులను కలిసి అర్జీలిస్తున్నారు. ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో రుణమాఫీ సొమ్ము ఖాతాలో ఎప్పుడు వేస్తారనని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నందున ఈ అంశంపై ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవల్సి వస్తుందని టీడీపీ నాయకులు కూడా బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది. ఎన్నికల ముందు గిమ్మిక్కులు ఎన్నికల ముందు సర్కార్ గిమ్మిక్కులకు తెర తీస్తుంది. రుణమాఫీ సొమ్ము ఇప్పటివరకు అందించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు ప్రకటించింది.విడతల వారీగా పంపిణీ చేసి ఓట్లకు గాలం వేయాలనేది సర్కారు వ్యూహం. అదే తరహాలోనే రుణమాఫీ సొమ్మును చివరిలో ఖాతాల్లో వేసి ఓట్లు దండుకోవాలనే పన్నాగం పడుతోందని కూడా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. చిత్తశుద్ది ఉంటే ముందస్తుగానే పంపిణీ చేసి నిజాయితీ చాటుకోవాలని విపక్షనాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ సర్కారు ఎన్నికలకు సమీపంలో మాఫీని మమ అనిపించి ఓట్లకు స్కెచ్ వేయాలని చూస్తుండడంపై పలుచోట్ల చర్చ జరుగుతోంది. ఏదీ ఆ ప్రస్తావన జిల్లాలో సుమారు 33 బ్యాంకులకు సంబంధించి 330కి పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. తొలి విడత రుణమాఫీ నాటికి దాదాపు 4.50 లక్షల ఖాతాలుండగా, నాల్గవ విడతకు వచ్చేనాటికి 2.50 లక్షలకు పరిమితమయ్యాయి. బంగారు, పంట రుణాలు తీసుకున్న మాఫీ లబ్దిదారులు రోజూ బ్యాంకుల వద్దకు వెళ్లి విచారిస్తున్నారు. మాఫీ సొమ్ము ఎప్పుడు పడుతుందని బ్యాంకర్లను వాకబు చేసి నిరాశగా ఇంటిముఖం పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తాకిడి అధికంగానే కనిపిస్తోంది. నాలుగు, ఐదు విడతలకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కులు అందిస్తారా? లేక డైరెక్టుగా అకౌంట్లలో జమ చేస్తారా? అన్నది ఇంతవరకు తెలియడం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మాఫీ సొమ్ము ఇప్పటికిప్పుడు రైతులకు అందించడం సాధ్యమా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. తాజా క్యాబినెట్ సమావేశంలో కూడా మాఫీపై చర్చ లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అనుమానంగా ఉంది నా పేరు బోవిళ్ల తిరుపాల్‌రెడ్డి. అట్లూరు మండలంలోని కొండూరు. రూ.1.50లక్షలకు సంబంధించి తొలి విడత, రెండవ విడత కలిపి రూ. 60 వేలు అందించారు. మూడవ విడత సొమ్ము అందలేదు. నాలుగు, ఐదు విడతలు కూడా వస్తాయో, రావోనన్న అనుమానం ఉంది. బాండ్లు ఇచ్చినా మాఫీ సొమ్ము పడలేదు. -
చెక్కు.. చిక్కు!
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళలు ఉరవకొండ మండలం షేక్షానుపల్లి గ్రామానికి చెందిన రామలింగేశ్వర మహిళా సంఘం సభ్యులు. వీరికి ప్రభుత్వం ‘పసుపు–కుంకుమ’ కింద ఇచ్చిన చెక్కును ఉరవకొండ స్టేట్‌బ్యాంకులో గురువారం వేశారు. డబ్బులివ్వాల్సిన బ్యాంకు సిబ్బంది మాత్రం సంఘానికి సంబంధించి రూ.లక్ష వరకు పాత బకాయి ఉందనీ, ఈ చెక్కును అప్పు కింద జమ చేసుకుంటున్నామని చెప్పారు. చెక్కులు తీసుకుపోతే డబ్బులిస్తారని సీఎం చంద్రబాబే చెప్పారని సంఘం లీడర్ చెప్పగా...ఆయన రుణమాఫీ చేయకపోవడం వల్లే ఇప్పుడు జమ చేసుకుంటున్నామని బ్యాంకు మేనేజర్ తెలిపారు. దీంతో కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన మహిళలు ఉత్తి చేతులతో వెనుదిరిగారు. ఉరవకొండ : చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’.. చెల్లని చెక్కుగా మారింది. ప్రభుత్వం చెక్కులిచ్చినా.. వాటిని తీసుకువెళ్తున్న మహిళలకు బ్యాంకు సిబ్బంది డబ్బులివ్వడం లేదు. పాత బకాయికి జమ చేసుకున్నాం.. వెళ్లిరండి అని చెబుతున్నారు. దీంతో సర్కార్ చేసిన మోసాన్ని గ్రహించిన మహిళలు మండిపడుతున్నారు. రుణమాఫీ మోసంతోనే... ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలల్లో ప్రభుత్వం ఇచ్చిన ‘పుసుపు– కుంకుమ’ చెక్కులను వివిధ బ్యాంకుల్లో మహిళలు జమ చేసుకుంటున్నారు. అయితే డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం...వడ్డీలతో కలిపి బకాయి రెండింతలు కావడంతో బ్యాంకు సిబ్బంది ఈ చెక్కులను పాత అప్పులకు జమ చేసుకుంటున్నారు. దీంతో మహిళలు తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 300 సంఘాలకు సంబంధించిన ‘పసుపు–కుంకుమ’ చెక్కులు అప్పుల కింద జమ చేసినట్లు తెలిసింది. రుణ ఎగవేతదారులుగా ముద్ర ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలకు మహిళలు బలయ్యారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో రుణం మాఫీ అవుతుందన్న దీమాతో మహిళలు బ్యాంకులకు కంతులు కట్టలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోగా...వాటి వసూలుకు ఉరవకొండ పట్టణంలోని వందలాది సంఘాలకు బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. దీంతో మహిళలు పుస్తెల తాడు, బంగారు వస్తువులు అమ్మి రుణాలు తీర్చారు. మరికొందరు అప్పు తీర్చే స్థోమత లేక రుణ ఎగవేతదారులుగా అపకీర్తి మూటగట్టుకున్నారు. -
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
చండూరు (మునుగోడు): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా చండూరులో దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సభలో ఆయన రాజ్యసభ సభ్యుడు వాయలార్ రవితో కలసి పాల్గొన్నారు. పాల్వాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. గతంలోనూ కాంగ్రెస్ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నాలుగు విడతలుగా మాఫీ చేసిందన్నారు. నాలుగు విడతల్లో రుణమాఫీ చేయడంతో రైతులు అధిక వడ్డీ భరించాల్సి వచ్చిందన్నారు. ఆ వడ్డీని కూడా ప్రభుత్వం భరిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించి.. చివరకు మాట తప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాగా, తమ ప్రభుత్వం వస్తే పత్తిని రూ.6 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. మిర్చి పంటకు రూ.10 వేలు, పప్పు ధాన్యాలకు రూ.7 వేల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. వరి, ఇతరత్రా పంటల కొనుగోలుకు రాష్ట బడ్జెట్‌నుంచి అధిక నిధులు కేటాయించి బోనస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి అందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం ఓకే కానీ, అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలుగా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. డిసెంబర్, జనవరిలలో ఎన్నికలు వస్తాయనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు నాలుగు వేలు ఇస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు రాష్ట ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి, నేతలు మల్లు రవి, చిన్నారెడ్డి, సమరసింహారెడ్డి, పద్మావతి, çసర్వోత్తమ్‌రెడ్డి, మైసూరారెడ్డి, బూడిద భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. -
దగా చేయడం కేసీఆర్ అలవాటు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీపై తాము ఇచ్చిన హామీ అమలు సాధ్యంకాదంటూ సీఎం కేసీఆర్ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. తనను నమ్మిన ప్రజలను దగా చేయడం కేసీఆర్‌కు అలవాటని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్‌కు ఉందని.. ఉచిత విద్యుత్‌ను సాధ్యం చేసి చూపింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలన అంశంపై ఉత్తమ్ శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.1.96 లక్షల కోట్లకు చేరుతుందని, అందులో రైతుల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేయలేమా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక దేశమంతా వ్యవసాయ రుణమాఫీ జరుగుతుందని.. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘శక్తి’యాప్ పార్టీలో బూత్ స్థాయి కార్యకర్తలతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు వీలుగా శక్తి యాప్‌ను కాంగ్రెస్ అందుబాటులోకి తెచ్చింది. దీనిపై శుక్రవారం ఉత్తమ్, భట్టి విక్రమార్క, ఏఐసీసీ డేటా అనలిస్ట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తదితరులు గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. టీ పీసీసీ తరఫున ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని డేటా అనలిస్ట్ హెడ్‌గా నియమించారు. ఈ నెల 30వ తేదీ వరకు బూత్ లెవెల్ నాయకులు, కార్యకర్తలు శక్తి యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్ సూచించారు. శక్తి యాప్ ద్వారా నాలుగున్నర లక్షల మందిని క్రియాశీల సైన్యంగా తయారు చేయాలన్నది రాహుల్‌గాంధీ ఆలోచన అని తెలిపారు. 7996179961 నంబర్‌కు ఓటర్ ఐడీ నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేస్తే.. శక్తి యాప్‌తో అనుసంధానం అవుతారని ప్రవీణ్ చక్రవర్తి వివరించారు. కాంగ్రెస్ తరఫున ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా... శక్తి యాప్‌లో రిజిస్టర్ కావడం తప్పనిసరి అని సూచించారు. నాయకులతో కార్యకర్తలు నేరుగా అనుసంధానం అయ్యేందుకు శక్తి తోడ్పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. ‘ఆజాద్’ ప్రచారంపై కుంతియా అసంతృప్తి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న కుంతియాను తొలగించి, గులాం నబీ ఆజాద్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సమావేశంలో కుంతియా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీలోని కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కుంతియా సూచించినట్టు సమాచారం. రంజాన్ అనంతరం తిరిగి బస్సుయాత్ర నాలుగో విడత బస్సు యాత్ర అంశంపైనా శుక్రవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో పాటు ఉత్తమ్, భట్టి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ అనంతరం వారం పాటు నాలుగో విడత బస్సుయాత్రను నిర్వహించాలని... గతానికి భిన్నంగా రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటించి, సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ విడత బస్సు యాత్రలో పాల్గొనేందుకు వస్తానని రాహుల్‌గాంధీ చెప్పారని, ఆయన ఈ నెలాఖరున వచ్చే అవకాశముందని ఉత్తమ్ వెల్లడించారు. రాహుల్ అమెరికా నుంచి వచ్చాక తేదీలపై స్పష్టత వస్తుందన్నారు. 12న పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు. -
చేనేత రుణాల్ని మాఫీ చేస్తాం : కేటీఆర్
సాక్షి, వనపర్తి : చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మిగతా రుణాలతో సంబంధం లేకుండా మాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చేనేత కార్మికులకు కొత్తకోటలో డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం 70 కోట్ల రూపాయల్ని కేటాయించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఆన్లైన్ మార్కెటింగ్‌కు శ్రీకారం చుడుతున్నామని కేటీఆర్ తెలిపారు.