షాబాద్: రుణమాఫీ పేరుతో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి ఆరోపించారు. షాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.
రైతులకు వన్‌టైం సెటిల్‌మెంట్ రుణమాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాను ఇతర జిల్లాలో కలపరాదని కోరారు. అమిత్‌షా ప్రకటనలకు టీఆర్‌ఎస్ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేసిందో బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను తెలంగాణ ప్రభుత్వం కరెంట్ బిల్లులకు కట్ చేసుకోవడం దారుణమన్నారు.
జిల్లాలో పార్టీని బలమైన శక్తిగా ఎదిగించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రెండేళ్ల కేంద్ర ప్రభుత్వం యువతకు, నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకుందన్నారు. సమావేశంలో ఆ పార్టీ షాబాద్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు వెంకట్‌రెడ్డి, రాములు, రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్రీకాంత్, శివకుమార్, లక్ష్మినర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎ.రాములు తదితరులున్నారు.
రుణ మాఫీ పేరుతో మోసం
Published Mon, Jun 13 2016 10:51 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement