
శింగనమల/గార్లదిన్నె: టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారని ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్‌ను పలువురు రైతులు ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నె కొట్టాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
కాగా, అక్కడకు టీడీపీ శ్రేణులు రైతులను బతిమాలి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘మీ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారు’ అని రాసి అక్కడ ఉంచిన ప్రశ్నోత్తరాల బాక్స్‌లో వేయగా.. వాటి గురించి లోకేశ్ సమాధానం చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానిస్తామని, బటన్ నొక్కగానే వ్యవసాయ యంత్ర పరికరాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment