వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు అన్నదాతలకు నోటీసులు పంపుతున్నాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య అన్నారు.
సోమవారం వర్ధన్నపేటలో అఖిలపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈరెల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్‌తో కలిసి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. లక్ష వరకు రుణ మాఫీ కోసం రూ.21,557 కోట్లు అవసరమని వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు తేల్చి చెప్పారన్నారు. రూ.37 వేల వరకు ఉన్న 5,42,609 మంది రైతులకు రుణం రూ.1206 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు.
31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.20.35 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలున్న 20 లక్షల మంది రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్ల జాబితా లో చేర్చడంతో వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. రుణమాఫీ అమలులో జాప్యం చేయడంతో అసలు వడ్డీ కలిపి అన్నదాతలకు మోయలేని భారంగా మారిందన్నారు. రెన్యువల్ చేయకపోవడంతో రైతులు కొత్తగా సాగు కోసం అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను సంప్రదించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు - నరుకుడు వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment