Vardannapeta
-
రైతుల ఇళ్లకు నోటీసులు !
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు అన్నదాతలకు నోటీసులు పంపుతున్నాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య అన్నారు. సోమవారం వర్ధన్నపేటలో అఖిలపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈరెల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్‌తో కలిసి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. లక్ష వరకు రుణ మాఫీ కోసం రూ.21,557 కోట్లు అవసరమని వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు తేల్చి చెప్పారన్నారు. రూ.37 వేల వరకు ఉన్న 5,42,609 మంది రైతులకు రుణం రూ.1206 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. 31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.20.35 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలున్న 20 లక్షల మంది రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్ల జాబితా లో చేర్చడంతో వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. రుణమాఫీ అమలులో జాప్యం చేయడంతో అసలు వడ్డీ కలిపి అన్నదాతలకు మోయలేని భారంగా మారిందన్నారు. రెన్యువల్ చేయకపోవడంతో రైతులు కొత్తగా సాగు కోసం అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను సంప్రదించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు - నరుకుడు వెంకటయ్య -
సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వర్ధన్నపేట : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి మండలంలోని కట్య్రాల శివారులో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్‌రావు కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథినికి చెందిన నస్కూరి కుమారస్వామి(42) వర్ధన్నపేట మండలం ఇల్లందలోని ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. బుధవారం తన పనులు ముగించుకుని ఆటోలో పంథినికి బయలుదేరాడు. ఈక్రమంలో కట్య్రాల శివారు వరంగల్–ఖమ్మం రహదారి పెట్రోల్‌బంకు సమీపంలో గేదె ఢీకొట్టగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందాడు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే అరూరి పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారస్వామి టీఆర్ఎస్ కార్యకర్త కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ పంథినికి చేరుకుని కుమారస్వామి మృతదేహాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మార్నేని రవీందర్రావు, జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి, సర్పంచ్ బరిగెల సదానందం తదితరులు ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం రాయపర్తి : అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని సన్నూరులో గురువారం జరిగింది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన పి.నాగేశ్వర్రావు(28)తో పాటు మరో ఇద్దరు సన్నూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి ప్రవేశించగానే అతివేగంగా వస్తున్న సన్నూరుకు చెందిన ట్రాక్టర్ ఢీకొనడంతో నాగేశ్వర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పెళ్లి పేరుతో మోసం
వర్ధన్నపేట : పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఏసీపీ వెల్లడించారు. వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హన్మకొండలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలలో మ్యాట్రిన్గా పనిచేస్తోంది. భర్తతో గొడవపడి కొద్ది రోజుల ఆమె విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి చేసుకోవడానికి ఓ మ్యాట్రిమొనీ సైట్లో తన వివరాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బసవకొత్తూరుకు చెందిన నీలగిరి హరిరావు అనే వ్యక్తి డాక్టర్ రోహిత్‌కుమార్‌చౌదరిగా పేరు మార్చుకుని ఆ యువతిని ఇష్టపడినట్లు చాటింగ్ చేశాడు. దీంతో డాక్టర్ ప్రొఫైల్ నచ్చి ఇష్టపడుతున్నట్లు రోహిత్‌కు ఆమె సమాచారం అందించింది. వీరి చాటింగ్ క్రమంగా ప్రేమగా మారింది. రోహిత్ వరంగల్‌కు రాకపోకలు సాగించడం, ఇద్దరు కలిసి తిరగడం మొదలు పెట్టారు. రెండు నెలల్లో అతడికి రూ.7.74 లక్షలు బ్యాంకు ఖాతా ద్వారా సదరు యువతి బదిలీ చేసింది. తనకు రోహిత్ నచ్చాడని, త్వరలో ఆయనతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సైతం చెప్పి ఒప్పించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని రోహిత్‌కుమార్‌ను ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. రోహిత్ కుంటి సాకులు చెబుతూ దాటవేశాడు. తన తల్లిదండ్రులు రూ.50 లక్షలు అడుగుతున్నారని, ఆడబ్బులు తెస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె మోసపోయానని గ్రహించింది. ఎట్టకేలకు ఈ విషయాన్ని వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌కు సన్నిహిత కౌంటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. కేసును విచారించాలని, నిందితుడిని పట్టుకోవాలని వర్ధన్నపేట పోలీసులను కమిషనర్ ఆదేశించారు. దీంతో వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ, ఎస్సై ఉపేందర్ చాకచక్యంతో వ్యవహరించి గురువారం ఉదయం హన్మకొండలోని జూపార్కు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అసలు పేరు నీలగిరి హరిహరరావు రోహిత్‌ను ప్రాథమికంగా విచారించగా తన పేరు నీలగిరి హరిరావు అని, తమ గ్రామం బసవ కొత్తూరు అని చెప్పాడు. ఆ గ్రామం ఎక్కడ ఉంది అని ఆరా తీయగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఉన్నట్లు తెలిసింది. అక్కడి పోలీసులకు సమాచారం అందించి వివరాలు సేకరించమని కోరగా నీలగిరి హరిహరరావు అలియాస్ భాస్కర్‌రావు అనే వ్యక్తి రోహిత్‌కుమార్‌చౌదరిగా పేరు మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైందని ఏసీపీ తెలిపారు. నిందితుడు డిగ్రీ డిస్ కంటిన్యూ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈమెతో పాటు పలువురు యువతులను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. అతడి వద్ద ఉన్న 8 వివి«ధ బ్యాంకుల డెబిట్ కార్డులు, మూడు పేర్లతో ఓటరు కార్డులు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హరిహరరావును కోర్టులో హాజరుపరిచి, కోర్టు నుంచి అనుమతి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. యువతులు అప్రమత్తంగావ్యవహరించాలి సైట్లలో పెట్టే ప్రతి విషయం నమ్మదగినదిగా ఉండదని, పూర్తి స్థాయిలో విషయం కనుక్కొని పెళ్లి విషయంలో ముందుకు పోవాలని ఏసీపీ సూచించారు. లేనిపోనివి చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ ఆదినారాయణ, ఎస్సై ఉపేందర్‌రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నాకు న్యాయం చేయాలి
► ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన ► మహిళా సంఘాల మద్దతు హసన్‌పర్తి(వర్ధన్నపేట): ఓ యువతి తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ప్రియుడి ఇంటి ఎదుట మహిళ సంఘాల మద్దతుతో దీక్షలో కూర్చుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే సదురు యువతికి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించా రు. వివరాల్లోకి వెళ్లితే... వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన కోమల, హసన్పర్తికి చెందిన మానుపాటి శివకుమార్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరికి ఏడాది క్రితం పెళ్లి కుదిరింది. ఘనంగా వరపూజ చేశారు. రైల్వేలో ఉద్యోగం రావడంతో.. శివకుమార్‌కు ఏడాది క్రితం రైల్వేలో ఉద్యోగం వచ్చింది. దీంతో మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. దీంతో కోమల అప్పట్లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే మంగళవారం హసన్పర్తికి వచ్చిన కోమల తనను పెళ్లి చేసుకోవాలని ఆందోళనకు దిగింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ పుల్యాల కిషన్ సంఘటన స్థలానికి చేరుకుని యువతిని శాంతిపజేశారు. శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.