
సాక్షి,హైదరాబాద్: ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ధరణి సమస్యలు ఎక్కువగా వచ్చాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై పొంగులేటి బుధవారం(నవంబర్ 13) మీడియాతో మాట్లాడారు.‘భూములున్న వారిని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది.గ్రామ సభలో ఇంధిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
పైరవీలు అవసరం లేదు.కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.అసెంబ్లీలో కొత్త భూ చట్టం వివరాలు వెల్లడిస్తాం.ప్రతిపక్ష నేతల సలహాలు కూడా కొత్త చట్టం లో తీసుకుంటాం.ఇటీవల ధరణి బాధ్యతలు ఎన్ఐసికి ఇచ్చాం. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతు భరోసా కూడా ఇస్తాం’అని పొంగులేటి తెలిపారు.
ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డికి లిక్కర్ అమ్మకాలపై ప్రేమ ఎక్కువైంది: హరీశ్‌రావు