
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భేటీ అయ్యానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘అదానీ నేను హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్‌గా చెప్పండి.
మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment