సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం(డిసెంబర్ 16) అసెంబ్లీ కమిటీహాల్‌లో కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.
కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ-కార్ రేసుపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఈ కార్ రేసులో నిధుల అవకతవకలపై దర్యాప్తునకు గవర్నర్ న్యాయనిపుణులను సంప్రదించి అనుమతించారని పొంగులేటి తెలిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు.
కేబినెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..
- భూమి లేని వారికి డిసెంబర్ 28న రూ.6వేల నగదు పంపిణీ
- సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ
- కేటీఆర్‌పై కేసు విషయంలో ఏసీబీకి సీఎస్ ద్వారా లేఖ
- సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
- రైతు కూలీలకు రెండు దఫాలుగా 12 వేలు ఆర్దిక సహాయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం.
- స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం..
- పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment