సాక్షి,వనపర్తి: రైతులకు తాము ఇచ్చిన హమీలు అన్ని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాధనం సద్వినియోగం చేయాలనే రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు.
శుక్రవారం(జులై12) వనపర్తిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కూడిన సబ్‌కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కొందరు నాయకులు, ప్రతిపక్షాలు రైతుభరోసాపై రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతిపక్షాలు కూడా మంచి సూచనలు చేస్తే బేషజాలు లేకుండా వాటిని స్వీకరిస్తాం. రైతుభరోసా స్కీమ్‌పై ఎలాంటి అపోహలు వద్దని, ప్రజాభిప్రాయాలను అసెంబ్లీలో చర్చించి స్కీమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతు బంధు పేరుతో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం: తుమ్మల నాగేశ్వరరావు
రైతులు, మేధావుల అభిప్రాయం మేరకే రైతుభరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగుకు పనికిరాని భూములకు రూ. 25 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేశారన్నారు.
సీఎం మనసులో రైతుల పంటలకు బీమా ఇచ్చే ఆలోచన ఉందన్నారు. మద్దతుధర అందించి రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment