ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు: కె. లక్ష్మణ్
నాలుగు ఉద్యోగాలు పొందిన కేసీఆర్ కుటుంబం,రాష్ర్టంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలని బీజేపీ నేత కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.
యాదాద్రి భువనగిరి : నాలుగు ఉద్యోగాలు పొందిన కేసీఆర్ కుటుంబం, రాష్ర్టంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయనిక్కడ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తన కుంటుంబ సంక్షేమం తప్ప రైతుల సంక్షేమంపై పట్టింపులేదన్నారు. వెంటనే తెలంగాణ రైతులకు రూ.8 వేల కోట్ల రుణమాఫీ చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయని అన్నారు. భువనగిరి ప్రాంతంలో ప్రవహిస్తోన్న మూసీనదిని వెంటనే ప్రక్షాళన చేయించాలని కోరారు. ఇప్పటికైనా డబుల్ బెడ్‌రూం నిర్మాణాలకు కేంద్రం ఇస్తున్న వాటాలను కలిపి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం హామీలు విస్మరిస్తే పెద్ద ఎత్తున బీజేపీ ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు.