K.Laxman
-
నియంతృత్వ రాజకీయాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టు
రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాల్సిన కొన్ని పార్టీలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి ‘ఆగర్భ శతృత్వం’తో పని చేస్తున్నాయి. అందులో ఎక్కువగా కుటుంబ పార్టీలు ఉండడం విశేషం. నిస్వార్థ రాజకీయాలు దేశంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయన్న ఆందోళనతో ‘వ్యక్తిత్వ హననం’ చేస్తూ కుటిల రాజకీయా లకు తెరతీశాయి. ఇప్పుడు ఆ వరుసలోకి కేసీఆర్ సారథ్యం లోని టీఆర్ఎస్ అగ్రస్థానం తీసుకున్నది. గత నెల నుండి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండే వర్గాలకు కేసీఆర్ నియంతృత్వ, ధన రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయి. రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసిన గవర్నర్‌ను ఒక మహిళ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమాన పరుస్తున్న కేసీఆర్ అండ్ కో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. రోజూ ప్రజాస్వామ్య పాఠాలు వల్లించే కమ్యూని స్టులకు కొత్తగా కేసీఆర్ స్నేహం దొరికింది. సీఎంను మెప్పించడం కొరకు ‘కోతికి కొబ్బరిచిప్ప’ దొరికినట్లుగా గవర్నర్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అతి చిన్న వయసులో మంత్రిపదవి కూడా లెక్కపెట్టకుండా ‘న్యాయం కోసం’ రాజీనామా చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్... అక్కడి కమ్యూనిస్టుల దురాగతాలు ఒక్కొక్కటి బయటపెడుతూంటే ఆ అక్కసును కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళగక్కడం విచిత్రం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు చదువుకొనే విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామక బిల్లు లోని లొసుగులతో ప్రభుత్వ పెద్దలు తప్పు చేసేందుకు అవ కాశం ఉంది. దానికి తగిన సవరణలు చేయాలని గవర్నర్ సూచిస్తే తమ వందిమాగధులలో దుష్ప్రచారం చేయిస్తూ కేసీఆర్ వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే అణ గారిన వర్గాలకు చెందిన యువత చదువులపై సమ్మెట దెబ్బలా ఎక్కడా లేనివిధంగా తన అస్మదీయులకు, తస్మదీ యులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టింది. ఎనిమిదేళ్ళలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసింది. కాబట్టి గవర్నర్ పేరు చెప్పి నియామకాలు జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన కామన్ రిక్రూట్ బోర్డు 1953లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రిజ ర్వేషన్ల విషయంలో విధిగా పాలించాల్సిన రోస్టర్ పాయింట్లు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బోర్డు ఏ రోస్టర్ విధానాన్ని పాటించి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది అనేది ప్రశ్న. ఓవైపు పోడు భూములకు సంబంధించిన పట్టాలు గిరిజనులకు ఇస్తాం అంటూనే, మరోవైపు వాళ్ళపై నిఘా పెట్టండని అటవీ అధి కారులను ఉసిగొల్పి ఓ నిజాయితీ గల ఆఫీసర్ హత్యకు కేసీఆర్ ప్రభుత్వం కారణమైంది. ప్రభుత్వ భూములను అమ్ముతూ, అలా వచ్చిన ఆదా యాన్ని తమ సొంత నియోజకవర్గాలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు తరలించుకు పోతున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, విద్య, వైద్య వ్యవస్థలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లు తయారయ్యాయి. గవర్నర్ దగ్గర ఎన్నో బిల్లులు ఆగా యని ఓ వైపు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తప్పని సరిగా వెళ్ళాల్సిన చోటు రాజ్‌భవన్. కానీ ఆయన ప్రతి దానినీ రాజకీయ కోణంలో చూస్తూ గవర్నర్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. గ్లోబరీనా టెండర్లను తనవారికి ఇప్పించి ఆ సంస్థ తప్పిదాలతో ఎందరో ఇంటర్ విద్యార్థులు మరణించినా కేసీఆర్ కనికరించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు కలి గించలేదు. అలాగే ధరణి పోర్టల్ అనే భూమాయను సృష్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకొనేందుకు కారణం అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు ఎమ్మా ర్వోలపై పెట్రోల్ దాడులు చేయడం ఈ రాష్ట్రంలోనే చూశాం. చివరికి ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు నిర్వహించే ఆరోగ్య శాఖ వైఫల్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు విక టించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఎవరి పాపమో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. గరీబులను వంచించే సరికొత్త ‘గడీ’గా కేసీఆర్ ప్రగతి భవన్‌ను నిర్మించుకొని కుట్రలకు, కుహకాలకు కేంద్రంగా దానిని తయారు చేశారు. బూర నర్సయ్యగౌడ్ లాంటి సీనియర్ నాయకుడు భాజపాలోకి రాగానే బెంబేలెత్తిన కేసీఆర్ మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సరిక్రొత్త కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ప్రగతి భవన్లో కూర్చొని ‘ఫాంహౌస్ బ్లాక్ బస్టర్ సినిమా’కు స్క్రిప్ట్ రచించారు. అనామకులు ఎవరో ఏదో మాట్లాడుకున్న వీడి యోలకు లేని స్క్రిప్ట్ తయారుచేసి జనం మీదకు వదిలారు. నిఖార్సుగా, నిజాయితీగా రాజకీయం చేసే భాజపాపై బురద చల్లేందుకు సరిక్రొత్త ‘కపట నాటకం’ కేసీఆర్‌కు పనికివచ్చింది. తన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు తెలం గాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదిగిన భాజపాను బూచిగా చూపిస్తూ... సొంతపార్టీ వారిపైనే బ్లాక్ మెయి లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా భాజపాపై ఎదురుదాడికి దిగాలని ప్రగతి భవన్ మీటింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం తెలంగాణలో జరుగుతున్న దాడుల రాజకీయానికి నాందిగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ వాళ్లు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారు. ఇది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిందిస్థాయి కార్యకర్తల మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఆలోచించవచ్చు. రాష్ట్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలైన శర్మిళను మహిళ అని కూడా చూడకుండా కారుతో సహా అరెస్ట్ చేసిన పోలీసుల అత్యుత్సాహం చూస్తే కేసీఆర్ హయాంలో ఇక్కడి స్వేచ్ఛకున్న హద్దులు బహిర్గత మవుతున్నాయి. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని ఈ సంఘ టన బహిర్గతం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించిపోయారు. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు కరెంట్ మీటర్లు కేంద్రం పెట్టబోతోందనీ, అలాగే కేంద్రం రాష్ట్రానికి ‘నయా పైసా’ ఇవ్వలేదనీ రోజూ దుష్ప్రచారం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎంలు వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇప్పటికి మూడుసార్లకు పైగా ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ ఆయనను ఆహ్వా నించకుండా ముఖం చాటేశారు. మునుగోడు ఎన్నికలలో దశాబ్దాలుగా కాంట్రాక్టులు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంటూ దుష్ట ప్రచారానికి తెరలేపారు. మరి మిషన్ భగీరథ, కాకతీయ, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టింది ఎవరు? అందులో కమిషన్ ఎంత ముట్టిందని మాత్రం వీళ్ళను ప్రశ్నించడం ‘సమాఖ్య వ్యవస్థ’పై దాడి అవుతుంది కాబోలు! రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ‘గాడిపసరం’లా కట్టేసి ఇలా ఏ ముఖ్యమంత్రీ వాడలేదు. కానీ రోజూ ‘ఈడీ, సీబీఐ దాడులు’ అని గింజు కుంటారు! ఈ రాష్ట్రంలో ‘జన్మకో శివరాత్రి’లా జరిగే ముఖ్యమంత్రి పర్యటన నాడు ప్రతిపక్షాల నాయకులను, కార్యకర్తలను ‘హౌస్ అరెస్టు’లు చేస్తున్నారు. ఏ సభ, పాదయాత్ర జరుపు కోవాలన్నా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన దుఃస్థితి నెలకొన్న కేసీఆర్ పాలన కేసీఆర్ చేరదీసిన మేధా (తా)వులకు స్వర్గంలా ఉందట. ధర్నా చౌక్ కూడా లేకుండా చేసి, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌ను గొప్ప ప్రజా స్వామ్య వాదిగా వీరు కీర్తిస్తున్నారు. అయితే వేయి శవాలను తిన్న రాబందు కూడా ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదు. కాలం ప్రతి దానికీ సమాధానం చెబుతుంది. చరిత్రలో కూలి పోయిన ఎందరో నియంతలు ఇందుకు ఉదాహరణ. (క్లిక్ చేయండి: ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?) - డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు -
మునుగోడు ఎన్నిక తర్వాత బీజేపీలోకి మాజీ మంత్రి.. ఎవరాయన!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికల అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక తమ పార్టీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతాయనే ధీమాను ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనేతలతో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీలోకి మాజీ మంత్రి మునుగోడు ఎన్నిక అనంతరం బీజేపీలో భారీగా చేరికలుంటాయని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ 3 రోజుల కిందట తెలిపారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని సోమవారం మీడియా ప్రతినిధులతో లక్ష్మణ్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ మంత్రి ఒకరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్నారు. దీంతో ఆ మాజీమంత్రి ఎవరనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదని, రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని తాజాగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మరిన్ని ఊహాగానాలకు తావిస్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకతను ఎత్తిచూపేందుకు, ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఇంకా ఒకటి, రెండు ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు) -
బీజేపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు భైజయంత్ పాండ సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 39 మంది నేతల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందో చెప్పాలని పరిశీలకులు నేతలకు సూచించారు. ప్రతి ఒక్కరితో వన్ టు వన్‌గా మాట్లాడి అభిప్రాయాలను స్వీకరించారు. 39 మందిలో 10 మంది నేతలు తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అబ్జర్వర్లకు చెప్పుకున్నారు. అయితే అబ్జర్వర్లు మీరు కాకుండా అధ్యక్షుడిగా ఇంకా ఎవరి పేరునైనా ప్రత్యామ్నాయంగా ప్రపోజ్ చేయాలని సూచించడంతో వారు కంగుతిన్నట్లు తెలిసింది. తమకే అవకాశం ఇవ్వాలన్న వారిలో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఎంపీ అరవింద్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీలోని కోర్ కమిటీ నేతలతోపాటు కొంత మంది వైస్ ప్రెసిడెంట్లు, మరికొంత మంది అధికార ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కొంత మంది రాష్ట్ర పార్టీలో మార్పు అవసరమని పేర్కొనగా, కొంత మంది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికే అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. అధ్యక్షుడి మార్పు జరగాల్సిందే.. మెజారిటీ నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పు జరగాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే పాత వాళ్లకు ఇస్తారా? లేదా కొత్త వాళ్లకు ఇస్తారా? అనే దానిపై అభిప్రాయ సేకరణకు వచ్చిన నేతలు విషయాన్ని బయటకు చెప్పలేదు. మరోవైపు సీనియర్ నేతలు మాత్రం అభిప్రాయ సేకరణ విషయంలో కోర్ కమిటీ అభిప్రాయానికే పరిమితం కాకూడదని, గ్రౌండ్ లెవల్లో నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకొని నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాలని అబ్జర్వర్లకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటూ కీలకంగా మారిన ఒకరిద్దరు నేతలు అభిప్రాయ సేకరణలో పాల్గొనే నేతల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల కోర్ కమిటీలో కొత్తగా నియమితులైన వారి పేర్లే జాబితాలో ఉన్నాయని, కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ల పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఓ సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. -
ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ అండగా నిలిచారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగ సంఘాల నేతలు.. పదవులకు కక్కుర్తి పడి ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులను పణంగా పెట్టి పదవులు దక్కించుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై సీఏఏ పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్చి 15 న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని లక్ష్మణ్ వెల్లడించారు. -
నిజామాబాద్ ఎమ్మెల్యే నిస్సహాయుడు..
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. మిషన్ భగీరథ స్కీమ్ విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఆదివారమిక్కడ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. టీఆర్ఎస్ సర్కార్ పేదలకు ఇచ్చే అన్ని నిధులు దుర్వినియోగం చేసింది. నిజామాబాద్‌కు ఇచ్చిన అమృత్ పథకం, గ్రీన్ సిటీకి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారు. గత ఆరేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. నిజామాబాద్‌లో రూ.800 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని చెప్తున్నా, ఎక్కడా అది కనిపించడం లేదు. జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రం చేపట్టింది. లక్కంపల్లిలో ఫుడ్ ప్రొసెసింగ్ ఫ్లాంట్ ఏర్పాటు చేశాం. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో పీజీ సీట్లు పెంచాం.’ అని తెలిపారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రెండు పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. ఎన్నార్సీ బిల్లు ఏ భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎంకు భారతీయుల మీద ప్రేమలేదని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం చేస్తున్న ఆందోళనలకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. టీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, నిజామాబాద్ ఎమ్మెల్యే నిస్సహాయుడు, ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు గుప్పించారు. -
ఆ చర్చ దేనికి సంకేతం..
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సీఎం కేసీఆర్, అసద్‌లు మూడు గంటల పాటు జరిపిన చర్చ దేనికి సంకేతమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేశారు. కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టులంతా వ్యతిరేకిస్తున్నారు. ఆ కోవలోకే టీఆర్ఎస్ వచ్చిందని’ తెలిపారు. దేశంలో అలజడులు, అల్లర్లు సృష్టించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. ఎందుకు భయపడుతున్నారు.. పూర్వికుల వివరాలు చెప్పాలంటే అసద్ ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఎందుకు అభ్యంతరమో కేసీఆర్ కూడా సమాధానం చెప్పాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వివరాలు తీసుకున్నారని.. అవి ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలన్నారు. తమ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియలో స్వలాభం కోసమే సమగ్ర సర్వే చేశారని విమర్శించారు. అసద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కోసం కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఆర్సీ గురించి ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. -
‘నాగంకు ఏం తక్కువ చేశాం’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓటమి పాలైన పార్టీలు కూటమిగా ఏర్పడటం వల్ల ఒరిగేదేమి లేదన్నారు. జూన్ నుంచి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్నిసిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని, పార్టీ అనుమతి వచ్చిన తరువాత ప్రారంభిస్తామన్నారు. కోదండరాం కు, తెలంగాణ జనసమితి పార్టీకి ప్రజల్లో గుర్తింపు ఉందని, ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడితే ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ జన సమితి కాంగ్రెస్‌తో వెళ్తే కోదండరాం పుట్టి మునిగినట్టేన్నారు. టీఆర్ఎస్పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం సభ్యులను సస్పెండ్ చేసి, ఇద్దరి సభ్యుల సభ్యత్వం రద్దు చేసినా కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. మరోవైపు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన అంశంపై లక్ష్మణ్ స్పందించారు. నాగం జనార్థన్‌రెడ్డికి ఏం తక్కువ చేయలేదని, ఆయన కొడుకుకు నాగర్‌కర్నూల్ టికెట్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. అక్కడ మర్రి జనార్థన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు నాగర్ కర్నూల్‌ను గెలిచేవాళ్లమన్నారు. నాగం.. కొడుకు అసమర్థతను పక్కన పెట్టి, పార్టీపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల పదవులు త్యాగం చేసి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇచ్చిన ఘనత తమదని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం ఏపీ వ్యవహారాల ఇంచార్జీ రాంమాధవ్ ప్రభావం దక్షణాది అంతటా ఉంటుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యవేక్షణ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాలరావు పేరు తెరపైకి వచ్చిందని, మరో రెండు రోజుల్లో ఈ అంశం తేలిపోతుందన్నారు. కర్టాటక ఎన్నికల నేపథ్యంలో తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్టాటకలో బీజేపీ గెలుపు తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. -
'తాగుబోతుల తెలంగాణగా మార్చారు'
సాక్షి, యాదాద్రి : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు ప్రజలు భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నికల హామీలన్నీ విస్మరించారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని.. నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొలపడానికే పాదయాత్ర చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో అన్నదాతలు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కేసీఆర్ మాత్రం దేశాన్ని ఉద్దరిస్తాడనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని వెల్లడించారు. -
నిరుద్యోగ యువత విషయం పట్టదా!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగం లేకుండా అవసరానికంటే ఎక్కువ మందికి పదవులిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ నిరుద్యోగ యువత కనిపించడంలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం వెలువరించిన జీవో 25ను సవరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికగా నియామక నోటిఫికేషన్ చెల్లదని తేల్చిచెప్పిందన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు తప్ప.. ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వడంలేదని విమర్శించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వాటిని కోర్టులు కొట్టివేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించి 121 ఉద్యోగాల నియామకమే గందరగోళంగా మారితే, లక్ష 12 వేల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. 26న నిరుద్యోగ సమర భేరీ.. ఈ నెల 26న హైదరాబాద్‌లో నిరుద్యోగ సమర భేరీ నిర్వహిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు పూనమ్ మహాజన్ ఈ సమరభేరీకి హాజరవుతారని పేర్కొన్నారు. డిసెంబర్ 1న బీసీల సమస్యలపై, 2న గల్ఫ్ బాధితుల సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాన మంత్రి మోదీకి బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం చెబుతారని పేర్కొన్నారు. -
కేసీఆర్‌ను సమాజం సహించదు
♦ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ♦ లేకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే.. కలెక్టరేట్ ముట్టడిలో బీజేపీ ♦ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నల్లగొండ టూటౌన్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్యర్యంలో సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన మాట్లాడారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని 8 రోజులు యాత్ర చేశామని.. దానిలో భాగంగానే కలెక్టరేట్లను ముట్టడిస్తున్నామన్నారు. వీటితోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. సబ్బండ వర్గాలు సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మజ్లిస్ పార్టీకి తాకట్టు పెడుతామంటే ప్రజలు సహించబోరన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని అప్పట్లో కాంగ్రెస్‌ను డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలే టీఆర్ఎస్ చేస్తుందని దానికి పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా మజ్లిస్ పార్టీ చేతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అనంతరం ఐటీఐ కాలేజీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. బీజేపీ నాయకులకు పోలీసుల మద్య తోపులాట చోటు చేసుకుంది. నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచికత్తుపై వదిలి పెట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల వెంకట్‌నారాయణరెడ్డి, పాదూరి కరుణ, బండారు ప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, బాకి పాపయ్య, ఓరుగంటి రాములు, పోతెపాక సాంభయ్య, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, బొజ్జ నాగరాజు, మొరిశెట్టి నాగేశ్వర్రావు, పకీరు మోహన్‌రెడ్డి, పుప్పాల శ్రీనివాస్, సరిత, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గడీల పాలన కూల్చేస్తాం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గరీబోళ్ల పాలన వస్తుందనుకుంటే గడీల పాలన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. గడీల పాలన గోడలు కూల్చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విమోచన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పోకుండా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల ముట్టడి: విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే వెయ్యి కోట్ల రూపాయలతో స్ఫూర్తి కేంద్రాలు, హైదరాబాద్‌లో స్టాట్యూ ఆఫ్ లిబరేషన్ విగ్రహాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. ఈ నెల 11న నిర్వ హించే బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతారన్నారు. కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ను చేర్చుకోబోమన్నారు. పార్టీ నేతలు జారిపోతారనే భయంతోనే కేంద్ర కేబినెట్లో చేరుతామని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందన్నారు. -
స్వరాష్ట్రంలోనూ బానిసత్వమా?
-
స్వరాష్ట్రంలోనూ బానిసత్వమా?
తెలంగాణ విమోచన యాత్ర ప్రారంభ సభలో లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: స్వరాష్ట్రంలోనూ స్వాతం త్య్రదినోత్సవం అధికారికంగా జరుపుకోలేని బానిసత్వం తెలంగాణ ప్రజలకు ఎందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని కోరుతూ బీజేపీ చేపట్టిన విమోచన యాత్ర శుక్రవారం ఇక్కడ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపం వద్ద ప్రారంభమైంది. లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. విమోచన దినోత్సవం ప్రాముఖ్యత , సీఎం కేసీఆర్ ఎవరి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారో ప్రజలకు వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించకుంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఉద్యమ సమయంలో మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య త్యాగానికి కూడా కొందరు మతం రంగు పూస్తున్నారని అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగాయని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని హామీని ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారని, ప్రజలు తిరగబడకముందే సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని సూచించారు. బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లింలకు బానిసగా మారారని విమర్శించారు. కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని అభివర్ణించారు. అభినవ ఖాసీం రజ్వీ కేసీఆర్ పాలనను అంతమొందించాలని నాగం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, పార్టీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, పార్టీ నేతలు కె.దిలీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, కుమార్‌రావు, శ్రీధర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాత్రను ప్రారంభించడానికి ముందుగా దుర్గామాతకు పూజలు చేశారు. నాంపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. -
టీఆర్ఎస్కూ కాంగ్రెస్ గతే..
బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ► రాష్ట్రంలో బీజేపీకి అండగా ఉంటా: కేంద్రమంత్రి హన్స్‌రాజ్ ► బీజేపీలో పలువురి చేరిక సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టినగతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కూ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, న్యూ డెమోక్రసీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పటిదాకా చేరికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన చాలామంది ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. నిజాంపాలన, రజాకార్ల దౌర్జన్యాల గురించి అన్ని వర్గాల ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడివడిన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవటం దారుణమని లక్ష్మణ్ విమర్శించారు. రజాకార్ల వారసత్వంతో వచ్చిన పార్టీ మజ్లిస్ అని, బీజేపీ మినహా అన్ని పార్టీలు మజ్లిస్‌కు దాసోహమంటున్నాయని మండిపడ్డారు. మతపర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి సంకల్పం తీసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచనదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ ప్రకటించారు. కేంద్రమంత్రి హన్స్‌రాజ్ మాట్లాడుతూ తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి వివరాలను గ్రామ స్థాయిలో సేకరించి, వారికి తగిన గౌరవం కల్పిస్తామని ప్రకటించారు. తమ పూర్వీకులు కూడా తెలంగాణకు చెందినవారేనని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాకా అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దురుద్దేశంతోనే సీఎం విమర్శలు
► బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ► జీఎస్టీపై కేంద్రం మీద ఆరోపణలు సరికాదు ► జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలూ ఉన్నాయి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ఎదుగు దలకు భయపడి రాజకీయ దురుద్దేశంతోనే జీఎస్టీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రెండురోజులుగా మాట్లాడుతున్న మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. జీఎస్టీ రూపకల్పనలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ కూడా భాగస్వాములన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలున్నాయని అన్నారు. జీఎస్టీతో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రోడ్ల నిర్మాణంపై రాష్ట్రంమీద రూ.19 వేల కోట్లు అదనంగా భారం పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. ఆయన అన్నీ తప్పుడు లెక్కలు చెప్పారని, సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇలా తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదని లక్ష్మణ్ సూచించారు. సిమెంట్, కంకర, స్టీల్ లాంటి వస్తువులపై 10 శాతం పన్ను తగ్గిందని, అయినా ఇంకా భారం అంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలు, న్యాయపోరాటం అనే హెచ్చరికలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల వారీగా ఇంకా భారం పడే అంశాలుంటే జీఎస్టీ కౌన్సిల్లో మాట్లాడటానికి అవకాశం ఉందన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడకుండానే పోరాటం, సమరం అనడం విడ్డూరమన్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అందరూ కలసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని లక్ష్మణ్ సూచించారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, జీఎస్టీ దేశ భవిష్యత్తు అని అసెంబ్లీలోనే మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలపై ఏమైనా భారం పడితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి రాష్ట్ర బీజేపీ సిద్ధంగా ఉందని లక్ష్మణ్ చెప్పారు. -
నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులను థర్డ్ డిగ్రీతో హింసించిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ చైర్మన్, సభ్యుడు రాములుకు కూడా ఫిర్యాదు చేశారు. త్వరలోనే సిరిసిల్ల వస్తామని కమిషన్ హామీ ఇచ్చింది. ఇసుక లారీలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదనలో ప్రశ్నించిన, లారీలను దగ్ధం చేసిన గ్రామస్తులను పోలీసులు పాశవికంగా కొట్టిన విషయం విదితమే. -
టీఆర్ఎస్ వైఫల్యాలపై విస్తృత పోరాటాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వైఫల్యాలపై విస్తృతంగా పోరా టాలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. బీజేపీ అనుబంధ విభాగాలపై వివిధ మోర్చాల రాష్ట్ర ముఖ్యులతో పార్టీ కార్యాలయంలో మంగళ వారం సమావేశం జరిగింది. ఈ భేటీలో కె.లక్ష్మణ్ మాట్లాడు తూ.. కేంద్రం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవడంలో మోర్చాల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఉందని, సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం వట్టి మాటలకే పరిమి తమైందన్నారు. మద్యపానం అమ్మకాలను పెంచి ప్రభుత్వ ఖజానాను నింపుకో వాలనే ప్రయత్నంలో సీఎం ఉన్నారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. పార్టీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, ఎస్.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రామ్‌నాథ్ గెలుపు ఖాయం: లక్ష్మణ్
హైదరాబాద్: రామ్‌నాథ్ కోవింద్‌ను అన్ని పార్టీలు బలపరుస్తున్నందున ఆయన గెలుపు ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌నాథ్ పేద కుటుంబానికి చెందిన వారు. ఆయన దళిత మేధావి.. రాజ్యాంగం పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. విపక్షాలు పోటీ పెట్టాలి కాబట్టి పెడుతున్నాయన్నారు. రాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారన్నారు. దళిత అభ్యర్థిపై దళిత అభ్యర్థినే పోటీకి పెట్టకూడదు.. కానీ యూపీఏ పక్షాలు దళిత అభ్యర్థినే పెట్టడంలో ఆంతర్యం ఏమిటో తెలీదని అన్నారు. గతంలో నీలం సంజీవరెడ్డిని బరిలో పెట్టినట్టు పెట్టి ఓడగొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉన్నాయన్నారు. తన ఇంట్లో వివాహం కారణంగా రామ్‌నాధ్ కోవింద్‌తో భేటీలో తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొనలేకపోయారన్నారు. -
'రుణమాఫీలో ప్రభుత్వం విఫలం'
హైదరాబాద్: రుణమాఫీలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విడతల రుణ మాఫీ వల్ల రైతులకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రధాని పసల్ బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని మండిపడ్డారు. పసల్ బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల 14 లక్షల మంది రైతులు నష్టపోయారని వివరించారు. నకిలీ విత్తన కంపెనీలు రాజ్యం ఏలుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహారిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దళారులకు, దోపిడీదారులకు అడ్డాగా మారిందని దెప్పిపొడిచారు. వెంటనే నకిలీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
మోదీ సునామీ పొంచి ఉంది: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాని మోదీ ప్రభావం సునామీని సృష్టించబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పార్టీ నిర్మాణాన్ని పోలింగ్ బూత్‌స్థాయి వరకు పటిష్టం చేయడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి బీజేపీ సమాయత్తమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘పల్లె పల్లెకు బీజేపీ– ఇంటింటికీ మోదీ పథకాలు’ కార్యక్రమాన్ని సోమవారం ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బండమైసమ్మ బస్తీలో ఆయన ప్రారంభించారు. పోలింగ్‌బూత్ స్థాయిల్లో పార్టీ పటిష్టత, కేంద్ర పథకాల ప్రచారం, మూడేళ్ల మోదీ పాలన, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జూన్ 12 వరకు సాగనుంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కొరవడిందని, తెలంగాణలో వీటి సాధన బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తీరును గురించి, సీఎం కేసీఆర్ వైఫల్యాలను గురించి ఇంటింటికీ కరపత్రాల రూపంలో తెలియజేస్తామని చెప్పారు. -
టీఆర్ఎస్కు గుబులు పట్టుకుంది: లక్ష్మణ్
హైదరాబాద్: అమిత్ షా వచ్చి వెళ్లాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇక మీదట పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు బూత్ కేంద్రంగానే నిర్వహిస్తామన్నారు. నగరంలోని కవాడిగూడలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మోదీ మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఈ 15 రోజుల్లో 8 వేల మంది కార్యకర్తలు 50 లక్షల కుటుంబాలను కలుస్తారు. మోదీ పాలన, పథకాలు, విజయాల గురించి ప్రజాల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతాం. అమిత్‌షా వచ్చి వెళ్లిన మూడు రోజులకే టీఆర్ఎస్కు గుబులు పట్టింది. అందుకే సర్వేల పేరుతో అబద్ధాలు చెప్తున్నారని మండి పడ్డారు. -
కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు: లక్ష్మణ్
- కాంగ్రెస్ నేతల చేరికలపై టీఎస్ బీజేపీ చీఫ్ వ్యాఖ్య హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీపరులను, నమ్మకస్తులను కాషాయదళంలోకి చేర్చుకుంటామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్. అంతమాత్రాన బీజేపీలో చేరాల్సిందిగా ఎవరివెంటా పడబోమని, కాంగ్రెస్‌వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని స్పషం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో అధికారంలోకి రాబోయే రాష్ట్రంగా తెలంగాణను మొదటి కేటగిరీలో చర్చామని, అందుకే అమిత్ షా 3 రోజులపాటు తెలంగాణలోనే పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాగా, బీజేపీ పార్టీ పదవుల్లో కొనసాగుతూ సరిగా పని చెయ్యని వారిపై సమీక్ష నిర్వహిస్తామని, గతంలో పోటీ చేసి యాక్టివ్‌గా ఉన్నవాళ్లపేర్లను మరలా పరిశీలిస్తామన్నారు. ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ చెప్పారు. -
నిధులను సర్కార్ పక్కదారి పట్టిస్తోంది: లక్ష్మణ్
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహకరిస్తున్నప్పటికీ రాష్ట్రం కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తోందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర వాటా నిధులను విడుదల చేస్తున్నా.. రాష్ట్ర వాటాను చెల్లించకుండా అభివృద్ధి పథకాలు ముందుకు వెళ్లకుండా అవరోధాలు సృష్టిస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే మత రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. -
'టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మనోహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం కేసీఆర్ ఆశలు కల్పించారని, వడ్డీలు కూడా మాఫీ చేయక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. ఫసల్ బీమా వంటి పథకంలో ప్రభుత్వం కనీసం భాగస్వామి కాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు లేదని, ప్రభుత్వంలో చలనం లేదని ఆయన మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వందేళ్లు కావస్తుండగా పెద్ద సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయకపోగా జాతీయస్థాయి (న్యాక్) గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. -
'నోట్లరద్దుపై అవగాహన కల్పిస్తాం'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై రాష్ర్టంలోని అన్ని పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. దేశ సంక్షేమం కోసం తీసుకున్న రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ, బ్యాంకింగ్, పోలీస్, ఆర్థికనిపుణులను భాగస్వాములను చేసి ప్రజల అపోహలను దూరం చేసేందుకు చర్చా గోష్టులను నిర్వహిస్తున్నామన్నారు. -
'నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి అడ్డుకట్ట'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి అడ్డుకట్ట పడుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. అద్భుతాలు సృష్టించడం ప్రధాని మోదీ నైజమని లక్ష్మణ్ ప్రశంసించారు. -
ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు: కె. లక్ష్మణ్
యాదాద్రి భువనగిరి : నాలుగు ఉద్యోగాలు పొందిన కేసీఆర్ కుటుంబం, రాష్ర్టంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయనిక్కడ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తన కుంటుంబ సంక్షేమం తప్ప రైతుల సంక్షేమంపై పట్టింపులేదన్నారు. వెంటనే తెలంగాణ రైతులకు రూ.8 వేల కోట్ల రుణమాఫీ చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయని అన్నారు. భువనగిరి ప్రాంతంలో ప్రవహిస్తోన్న మూసీనదిని వెంటనే ప్రక్షాళన చేయించాలని కోరారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూం నిర్మాణాలకు కేంద్రం ఇస్తున్న వాటాలను కలిపి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం హామీలు విస్మరిస్తే పెద్ద ఎత్తున బీజేపీ ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు. -
రాష్ట్రంలో దోపిడీ పాలన
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కె.లక్ష్మణ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో రెండు రోజులపాటు జరగనున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తోందని, మిషన్ కాకతీయ, భగీరథల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల ముందు వాస్తవాలను ఉంచి ప్రభుత్వాన్ని దోషిగా నిలబె డతామన్నారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా గత ప్రభుత్వాల పాపమేనంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. పాపాత్ములను మీపంచన చేర్చుకున్నంత మాత్రాన పుణ్యాత్ములెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటూ పేదలను వంచిస్తున్నారని మండిపడ్డారు. అసలు బంగారు తెలంగాణ వస్తుందో రాదో కానీ, అవినీతి, అక్రమాలకు తెలంగాణను నిలయంగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని, అందుకోసం 2019లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీని పటిష్టం చేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. రాబోయే ఆరు నెలలు పంచముఖ వ్యూహాన్ని అమలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి సాధాన్సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
క్షమాపణతో కష్టాలు తీరవు
సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి భూనిర్వాసితులకు డబుల్బెడ్రూం ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మిడ్‌మానేరు గండి పరిశీలన.. ముంపు బాధితులకు పరామర్శ బోయినపల్లి/వేములవాడరూరల్ : మధ్యమానేరు నిర్మాణంతో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారి కన్నీళ్లను ఒక్క క్షమాపణ చెప్పి తీర్చలేరని, డబుల్ బెడ్రూమ్ విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మధ్యమానేరు గండిని పరిశీలించారు. మండలంలోని కొదురుపాక ఎస్సీ కాలనీలో వరద ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శించారు. వేములవాడ మండలం రుద్రవరంలో మానేరు ముంపు బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వీరు కూడా ముంపు గ్రామాలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. 2008లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని, 2016 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారంతోపాటు ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. డబుల్బెడ్రూమ్ హామీపై నాడు అవగాహన లేక మాట్లాడానని, క్షమించాలని సీఎం కోరడం సిగ్గుచేటన్నారు. మిడ్‌మానేరు వరదతో పంటలు దెబ్బతిన్న భూములను సేకరించి ఎకరానికి రూ.20లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, వర్షాలకు ధ్వంసమైన పంటలకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. వర్షాలతో పంటలు నష్టపోయి, మానేరు నీటితో రుద్రవరం గ్రామంలో బాధితులు ఆవేదన చెందుతుంటే ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు గ్రామంవైపు కన్నెత్తి చూడకపోవడం ప్రజలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోందని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతీ నాయకుడు ఆపదలో ఉన్న ముంపు గ్రామాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పాలని సూచించారు. రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక గ్రామంలోని సమస్యలతోపాటు ముంపు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, లింగంపల్లి శంకర్, శ్రీధర్, ఆకుల విజయ్, మేకల ప్రభాకర్‌యాదవ్, గుడి రవీందర్‌రెడ్డి, కన్నం అంజయ్య, గంటల రమణారెడ్డి, మహిళామోర్చ జిల్లా అధ్యక్షురాలు గాజుల స్వప్న, సుజాతారెడ్డి తదితరులున్నారు. -
పార్టీపై పట్టు సాధించ లేకపోతున్నాడు
-
ఊహాగానాల్లో ఉత్తమ్: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో కలసిపోయినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊహాగానాలతో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎంతో కలసి అధికార దాహాన్ని తీర్చుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఎద్దేవా చేశారు. పతనమవుతున్న కాంగ్రెస్‌ను చూసి దిక్కుతోచక ఉత్తమ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకునే కాంగ్రెస్ నేతలు గురివింద గింజల్లాగా నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. -
2019 నాటికి అధికారమే లక్ష్యం
పల్లెపల్లెకు బీజేపీ... గడపగడపకు నరేంద్రమోదీ 7న బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం పాల్గొననున్న ప్రధాన మంత్రి కేంద్రం నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హన్మకొండ : 2019 నాటికి అధికారం లక్ష్యంగా ‘మిషన్–2019’తో ముందుకు పోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతుందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మిషన్–2019 రూపకల్పన చేశారని చెప్పారు. శనివారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, అనంతరం జరిగిన పార్టీ బూత్ కమిటీ సమ్మేళనం జిల్లా సన్నాహక సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. పల్లెపల్లెకు బీజేపీ..గడప గడపకు నరేంద్ర మోదీ అనే నినాదంతో కార్యాచరణ చేపడతామన్నారు. ప్రతి గడపను తట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అగష్టు 7వ తేదీన బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17వ తేదీ ప్రత్యేకతను, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రధానికి వివరించనన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని లక్ష్మణ్ చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతో పాటు టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు, హెల్త్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తారని, మిషన్ భగీరథను ప్రారంభించనున్నారని వెల్లడించారు. మనోహరాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. కేంద్రం విడుదల చేసే నిధులకు కాపలా కుక్కలా ఉంటామని, నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. అనంతరం బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రఘునాథరావు, దుగ్యాల ప్రదీప్‌రావు, నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి, కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, కూచన రవళి, పెసరు విజయచందర్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, దిలీప్‌నాయక్ పాల్గొన్నారు. -
'ద్రోహులు సీఎం పంచన చేరారు'
హైదరాబాద్: హైకోర్టు విభజన వెంటనే చేయాలంటూ ఇందిరా పార్కు వద్ద బీజేపీ లీగల్ సెల్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంఎల్సీ రాంచందర్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులే బంగారు తెలంగాణ నిర్మాణంలో అగ్రభాగాన ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమంతో సంబంధంలేని వాళ్లు సీఎం కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారంటే ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొండితనం, ఆదరబాధర నిర్ణయాల వల్లే ఈ కష్టాలన్నారు. తెలంగాణా రాకూడదన్న వ్యక్తులు సీఎం పంచన చేరి న్యాయవాదులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీధుల్లో ఉద్యమాలు చేయడమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాధ్యతా రహితంగా ఉందో అర్ధమవుతోందన్నారు. న్యాయవాదుల డిమాండ్స్‌కు తమ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. జేఏసీ కోరుతున్న 7 డిమాండ్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. -
‘తప్పు మాది కాదు.. సీఎంలిద్దరిదీ’
హైదరాబాద్: హైకోర్టు విభజన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కారం చేసుకోవాల్సిన అంశంకాగా కేంద్ర ప్రభుత్వంపై నింద వేయటం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అమరావతికి కేసీఆర్, చండీయాగానికి చంద్రబాబు వెళ్లారు కదా...అప్పుడెందుకు హైకోర్టు విషయం వారు మాట్లాడుకోలేదని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే నాటకాలాడుతున్నాయని తప్పుపట్టారు. ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. ప్రతి అంశాన్నీసెంటిమెంట్ పేరుతో రాజకీయం చేసే పరిస్థితి మానుకోవాలని అధికార టీఆర్ఎస్కు హితవు పలికారు. న్యాయవాదుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ప్రకటిస్తోందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారాన్ని, ఆప్షన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు. -
కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
హైదరాబాద్: అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్ తీవ్ర స్వరంతో అధికారపక్షాన్ని నిలదేసేందుకు విపక్షంలో కొత్త గొంతుక చేరనుంది. ఆ స్వరం మరెవరిదోకాదు తెలంగాణ బీజేపీ 'మాజీ' అధ్యక్షుడు కిషన్ రెడ్డిది. అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించేందుకు ఆ పార్టీ అన్నివిధాలా సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎల్పీ నేతగా కొనసాగుతున్న డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా నియమితులుకావటమే ఈ మార్పునకు ప్రధాన కారణం. బీజేపీ సంస్థాగత నియమాల ప్రకారం ఒక వ్యక్తి జోడు పదవులు నిర్వహించడానికి వీలులేదు. లక్ష్మణ ఇప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తారు కాబట్టి, అసెంబ్లీలో లెజి స్లేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కిషన్ రెడ్డికి కట్టబెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. పైగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు అందరిలోకీ కిషన్ రెడ్డే సీనియర్ కావటం మరో సానుకూల అంశం. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. కిషన్ రెడ్డికి గతంలోనూ బీజేఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ కొత్త అధ్యక్షడిగా ఎంపికైన లక్షణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు లక్షణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
'కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలి'
కాచిగూడ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల సైనికుల్లాగా పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారులు, కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని అసెంబ్లీలవారీగా కో-ఆర్డినేటర్లను నియమించడం, బహిరంగ సభలు పెట్టడం, డివిజన్ల వారిగా పార్టీకి ఉన్న అన్ని మోర్చాల సమావేశాలు నిర్వహించి, బస్తీల వారిగా పాదయాత్రలు చేస్తూ నాయకుల పర్యటనలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను గుర్తించడం వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీర్చే విధంగా చూడాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బీజేపీని బూత్‌స్థాయి నుంచి పటిష్ట పరచాలని అప్పుడే ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందని అన్నారు. ఆగస్టు నెలలో నగరంలో తొలి విడతగా 5 నియోజక వర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. -
ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిందిపోయి కేవలం రాజకీయాలతో కాలం నెట్టుకొస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధమవుతున్నట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. సమస్యలపై చర్చించే వేదికైన అసెంబ్లీని సమావేశపర్చకుండా వాయిదా వేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వినూత్న బడ్జెట్ పేరు చెప్పి వాయిదా వేస్తూ రావటం ప్రజలపాలిట శాపంగా మారిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధులు లేకపోవటమే దీనికి కారణమా? అనే అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఫీజు పథకం ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర
తెలంగాణ బీజేపీ ఎల్పీనేత డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్: స్థానికత పేరిట ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీజేపీ శాసన సభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మనోహర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ప్రకాష్‌రెడ్డి, సుభాష్చందర్జీ, దాసరి మల్లేశంతో కలిసి ఆయన మాట్లాడారు. 1956కు ముందు నివాసమున్న వారికే ఫీజు రీయింబర్స్మెంట్ ను వర్తింపజేస్తామనడం తగదని, ఇలాంటి విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. అర్హులైన విద్యార్థులందరికీ ఆ పథకాన్ని వర్తింపజేయాలని, లేని పక్షంలో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. 1956కు ముందు జహీరాబాద్, గద్వాల్, భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలు తెలంగాణలో లేవని, మరి ఆయా ప్రాంతాల విద్యార్థుల సంగతేమిటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న ప్రభుత్వం.. వాటికి అనుమతించిన అధికారులపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలను చార్మినార్ నుంచి ఎందుకు ప్రారంభించడం లేద న్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎంతో దోస్తీ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లే వివాదాస్పదమైన నేపథ్యంలో 12 శాతం ఎలా అమలు చేస్తారన్నారు. ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని చెప్పి, ఇప్పుడు దళితులకు మాత్రమే ఇస్తామనడం ఎస్టీలను మోసగించడమేనని విమర్శించారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ ఏపీ శాఖ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు విషయంలో 1956కు ముందటి స్థానికతనే ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే ఎందాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ హెచ్చరించింది. పార్టీ నాయకులు యడ్లపాటి రఘునాథ్‌బాబు, సుధీష్ రాంబొట్ల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ సంక్షోభానికి కారణమయ్యేలా తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
రుణ మాఫీపై అసెంబ్లీలో ప్రకటన చేయండి: కె.లక్ష్మణ్
హైదరాబాద్: ఎన్నికల సమయంలో రైతులకు టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాల మేరకు రుణాల మాఫీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని టీ-బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణ మాఫీని ఒక్క ఏడాదికే పరిమితం చేస్తామని కేసీఆర్ ప్రకటిస్తే తాము అసెంబ్లీలోనే కాకుండా తెలంగాణ నలుమూలలా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. -
తెలంగాణ బీజేఎల్పీ నాయకుడిగా లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎంపికయ్యారు. సోమవారం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేత జేపీ నద్దా పరిశీలకునిగా హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో ఐదు సీట్లను గెల్చుకుంది. లక్ష్మణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.