తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎంపికయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎంపికయ్యారు. సోమవారం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేత జేపీ నద్దా పరిశీలకునిగా హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో ఐదు సీట్లను గెల్చుకుంది. లక్ష్మణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.