
సాక్షి, యాదాద్రి : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు ప్రజలు భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నికల హామీలన్నీ విస్మరించారని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని.. నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొలపడానికే పాదయాత్ర చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో అన్నదాతలు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కేసీఆర్ మాత్రం దేశాన్ని ఉద్దరిస్తాడనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని వెల్లడించారు.