టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై విస్తృత పోరాటాలు | BJP state president K Laxman on TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై విస్తృత పోరాటాలు

Published Wed, Jul 12 2017 1:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై విస్తృత పోరాటాలు - Sakshi

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై విస్తృత పోరాటాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌:
టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై విస్తృతంగా పోరా టాలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. బీజేపీ అనుబంధ విభాగాలపై వివిధ మోర్చాల రాష్ట్ర ముఖ్యులతో పార్టీ కార్యాలయంలో మంగళ వారం సమావేశం జరిగింది. ఈ భేటీలో కె.లక్ష్మణ్‌ మాట్లాడు తూ.. కేంద్రం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవడంలో మోర్చాల పాత్ర కీలకమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఉందని, సీఎం కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం వట్టి మాటలకే పరిమి తమైందన్నారు. మద్యపానం అమ్మకాలను పెంచి ప్రభుత్వ ఖజానాను నింపుకో వాలనే ప్రయత్నంలో సీఎం ఉన్నారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. పార్టీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, ఎస్‌.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement