'రుణమాఫీలో ప్రభుత్వం విఫలం'
Published Fri, Jun 30 2017 3:42 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
హైదరాబాద్: రుణమాఫీలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విడతల రుణ మాఫీ వల్ల రైతులకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రధాని పసల్ బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని మండిపడ్డారు.
పసల్ బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల 14 లక్షల మంది రైతులు నష్టపోయారని వివరించారు. నకిలీ విత్తన కంపెనీలు రాజ్యం ఏలుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహారిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దళారులకు, దోపిడీదారులకు అడ్డాగా మారిందని దెప్పిపొడిచారు. వెంటనే నకిలీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Advertisement