సాక్షి,జగిత్యాల జిల్లా: అప్పు చేసి మరీ రెండు లక్షల రుణమాఫీ చేశామని,రైతుభరోసా కూడా రెండు పంటలకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు. సోమవారం(జనవరి 6) జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతు భరోసా రెండు పంటలకు రూ. 12 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12000 ఆర్థిక భరోసా ఇస్తాం. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని మంచి చేస్తే హర్షించాలి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తాం. ఏక మొత్తంగా రుణ మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రైతులకు రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేక చేతులెత్తేసింది. కేసీఆర్ రుణమాఫీ చేయలేక ఎన్నికల ప్రణాళికలో కూడా రుణమాఫీ అంశాన్ని చేర్చలేదు.
సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే చేయలేదంటారు. చేస్తేనేమో విమర్శిస్తారు.పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారా..వద్దనుకుంటున్నారా..?పంజాబ్ లో 33 నెలల్లో 50 వేల ఉద్యోగాలను గొప్పగా చెప్తున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో 12 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని జీవన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: మీరెన్ని కేసులు పెట్టినా భయపడం
Comments
Please login to add a commentAdd a comment