సాక్షి,హైదరాబాద్ : ప్రజల పక్షాన గళం విప్పే వారిపై రేవంత్‌రెడ్డి (revanth reddy) ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఆరోపించారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్‌ఎస్ (brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఉదయం కేటీఆర్ తన లీగల్ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ హైడ్రామా నడింది. ఈ తరుణంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వడంపై కవిత స్పందించారు.
‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాపై పెట్టిన కేసులకు మేం భయపడం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఆమొత్తాన్ని రూ.12,000 రూపాయలకు తగ్గించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా చెల్లించాలనే మా డిమాండ్’ అని కవిత అన్నారు.
BRS MLC K Kavitha says "The Revanth Reddy Govt is filing illegal cases against those who raise their voices on behalf of the people. The government is acting vengefully against our party’s Working President KTR with false cases. We are not afraid of cases filed against us. Our… https://t.co/QPEa6zAEhC pic.twitter.com/bQTbdODpVF
— ANI (@ANI) January 6, 2025
Comments
Please login to add a commentAdd a comment