
కేసీఆర్‌ను సమాజం సహించదు
♦ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
♦ లేకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే.. కలెక్టరేట్ ముట్టడిలో బీజేపీ
♦ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
నల్లగొండ టూటౌన్ :
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్యర్యంలో సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన మాట్లాడారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని 8 రోజులు యాత్ర చేశామని.. దానిలో భాగంగానే కలెక్టరేట్లను ముట్టడిస్తున్నామన్నారు. వీటితోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. సబ్బండ వర్గాలు సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మజ్లిస్ పార్టీకి తాకట్టు పెడుతామంటే ప్రజలు సహించబోరన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని అప్పట్లో కాంగ్రెస్‌ను డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేసిన తప్పిదాలే టీఆర్‌ఎస్ చేస్తుందని దానికి పట్టిన గతే టీఆర్‌ఎస్‌కు పడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా మజ్లిస్ పార్టీ చేతిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అనంతరం ఐటీఐ కాలేజీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. బీజేపీ నాయకులకు పోలీసుల మద్య తోపులాట చోటు చేసుకుంది. నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచికత్తుపై వదిలి పెట్టారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల వెంకట్‌నారాయణరెడ్డి, పాదూరి కరుణ, బండారు ప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, బాకి పాపయ్య, ఓరుగంటి రాములు, పోతెపాక సాంభయ్య, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, బొజ్జ నాగరాజు, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, పకీరు మోహన్‌రెడ్డి, పుప్పాల శ్రీనివాస్, సరిత, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.