సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే మనస్తత్వం లేదని, రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడం కేసీఆర్ వల్ల కాదని బీజేపీ జాతీయ నేత ప్రొఫెసర్ శేషగిరి రావు అన్నారు. కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేయగల సామర్థ్యం కేసీఆర్‌కు లేదని అభిప్రాయపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
రిజర్వేషన్ల పెంపు అంశం చాలా సున్నితమైందని, ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. కేసీఆర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటున్నారని, ఇది దేశంలో విపత్కర పరిస్థితులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో వైషమ్యాలు, అల్లర్లు, విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రంతో పోరాడాలని.. ఇలా మతం పేరుతో రిజర్వేషన్లంటూ ప్రకటనలు చేయొద్దని కేసీఆర్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment