కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్
సాక్షి,కరీంనగర్ : కంటి, పంటి ఆపరేషన్లకు తప్ప ఢిల్లీకి పోని కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలేం చేస్తాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ.. విభజన హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో రాజీనామాలే అన్నింటికి పరిష్కారమన్న పార్టీ ఇప్పుడెందుకు రాజీనామా చేయడం లేదని పొన్నం సూటిగా ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు కావడంతోనే ఎంపీలు నోరు మెదపడం లేదని, కేంద్రంతో పోరాడే దమ్ము ధ్యైర్యం లేకుంటే మహిళా కాంగ్రెస్ నేతలు పంపిన చీరలు, గాజులు వేసుకొని ఝాన్సీ లక్ష్మిభాయి స్ఫూర్తితో పోరాడాలని హితవు పలికారు. టెక్స్ టైల్ క్లస్టర్ కోసం కేంద్రంపై పోరాటానికి కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు కలిసి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.
ముస్లిం రిజర్వేషన్లు పెంచలేమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ అయినా, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వచ్చి కరీంనగర్ ఎంపీగా పోటీచేసినా తాను ఆహ్వానిస్తానని, ప్రత్యర్థి ఎవరున్నా ఎదుర్కొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment